MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ఈ వీడియోని అడ్డం పెట్టి చిరుపై దారుణ ప్రచారం... అసలు నిజం ఇదీ

ఈ వీడియోని అడ్డం పెట్టి చిరుపై దారుణ ప్రచారం... అసలు నిజం ఇదీ

చిరంజీవి రష్యన్ లాయిర్ల టీమ్ తో మాట్లాడుతున్నారని ఈ ఫొటోలు, వీడియోలను అడ్డం పెట్టి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

3 Min read
Author : Surya Prakash
| Updated : Apr 20 2024, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Chiraneevi

Chiraneevi


ఇది ఎలక్షన్స్ సమయం. ప్రతీ విషయం రాజకీయం ముడిపెడుతూ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు ప్రచారం చేస్తున్నారు. కొందరు సెలబ్రెటీలకు ఇది సమస్యగా మారింది. తాము ప్రత్యక్ష్య రాజకీయాల్లో లేకున్నా సమస్యలు తప్పటం లేదు. ఆ విధంగానే ఇప్పుడు చిరంజీవి ఓ పార్టీవారి సోషల్ మీడియా టీమ్ దాన్ని రాంగ్ గా ప్రొజెక్టు చేస్తోంది. ఈ విషయం చిరంజీవి అభిమానులను బాధిస్తోంది. ఇంతకీ ఏం జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210


విశ్వంభర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న మెగాస్టార్‌ చిరంజీవిని రష్యా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కలిశారు. హైదరాబాద్ కు వచ్చిన ఈ ప్రతినిధి బృందం.. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసానికి వెళ్లి సమావేశమైంది. ఈ సందర్భంగా చిత్ర సీమకు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు.

310
Chiranjeevi

Chiranjeevi

 రష్యాలో తెలుగు చిత్రాల షూటింగ్‌తో సహా తదితర అంశాలపై వారితో మాట్లాడారు. రష్యాలో (Russian celebs meeting) తెలుగు సినిమాల షూటింగ్‌ను ప్రమోట్‌ చేయడానికి వారు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భారతీయ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ, రష్యా మధ్య సృజనాత్మక సహకారాలపై ప్రతినిధి బృందం చిరంజీవితో మాట్లాడారు. 

410
Chiranjeevi

Chiranjeevi


రష్యాలో తెలుగు సినిమాల షూటింగ్ లను ప్రోత్సహించేందుకు, వీలైన సహకారం అందించేందుకు సిద్ధమని రష్యా ప్రతినిధులు చిరంజీవితో పేర్కొన్నారు. మెగాస్టార్‌ను కలిసిన వారిలో రష్యా సాంస్కృతిక శాఖ మంత్రికి సినిమా సలహాదారు జూలియా గోలుబెవా, క్రియేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్‌ మెంట్ సెంటర్ హెడ్ ఎకటెరినా చర్కెజ్, యూనివర్సల్ యూనివర్సిటీ డైరెక్టర్ మరియా సిట్కోవ్‌ స్కయా, ఇతర సీనియర్ సభ్యులు ఉన్నారు. చిరంజీవితో రష్యా బృందం భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  అయితే ఈ వీడియోని అడ్డం పెట్టి పవన్ కళ్యాణ్ విడాకులకు ముడిపెడుతూ ప్రచారం చేస్తున్నారు. 
 

510

తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి జరిగిన చర్చ మరే ఇతర వ్యక్తుల గురించి జరగ లేదు అనేది నిజం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండు పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన తన మూడో భార్య అన్నా లెజ్నెవా తో కూడా విడాకులు తీసుకుంటున్నట్టు వీరి పెళ్లి కూడా పెటాకులు అవుతుందని పెద్ద ఎత్తున చర్చ కు తెర తీస్తున్నారు.  అయితే ఇదంతా పవన్ వ్యతిరేక వర్గం  చేస్తున్న దుష్ప్రచారం అని అభిమానులు చెబుతున్నారు. 

610

పవన్ కళ్యాణ్ కు, ఆయన మూడో భార్య అయిన అన్నా లెజ్నెవాకు మధ్య సంబంధం సరిగాలేదని ప్రచారం చేస్తన్నారు. ఆ  ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చి ఉంటుంది అని చెప్తున్నారు.అందుకే ఆ విషయం విడాకులకోసం చిరంజీవి రష్యన్ లాయిర్ల టీమ్ తో మాట్లాడుతున్నారని ఈ ఫొటోలు, వీడియోలను అడ్డం పెట్టి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

710


 పవన్ కళ్యాణ్ అభిమానులు ఇది పవన్ ని ఇబ్బంది పెట్టడం కోసం కావాలని చేస్తున్న దుష్ప్రచారంగా చెబుతున్నారు. దీని వెనుక ఎవరున్నారు అన్నది ఏపీ ప్రజలకు తెలుసని అంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియోని అడ్డం పెట్టి పవన్ విడాకులపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం ఉందని కొందరు అంటున్నారు. అయితే ఇలా ఖండలను, స్పందనలు చేసుకుంటూ పోతే మిగతా  విషయానికి టైమ్ ఉండదనేది నిజం. కాబట్టి లైట్ తీసుకోవటమే బెస్ట్.

810
Chiranjeevi

Chiranjeevi


ఇక మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ పూర్తిగా తన సోదరుడు పవన్ కు అందచేస్తున్నారు. ఆ విషయం బహిరంగంగా తెలియచేస్తున్నట్లుగా ...జనసేన పార్టీకి భారీ విరాళం ప్రకటించారు. రూ.5 కోట్ల చెక్ ను జనసేనాని పవన్ కల్యాణ్ కు అందజేశారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చింతల్ లో జరుగుతుండగా... పవన్ కల్యాణ్, నాగబాబు షూటింగ్ లొకేషన్ కు వెళ్లారు. తన తమ్ముళ్లకు చిరంజీవి ప్రేమపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగానే జనసేన పార్టీకి ఆశీస్సులు అందిస్తూ, రూ.5 కోట్ల విరాళం తాలూకు చెక్ ను పవన్ కు అందజేశారు. ఈ సందర్భంగా భావోద్వేగాలకు గురైన పవన్ తన పెద్దన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు. 

910


 అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభలో పవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలతో చిరంజీవి కదిలిపోయారు. తన తమ్ముడికి ఆర్థికంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ మరుసటి రోజే భారీ విరాళం అందించారు.  కాగా, చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా జనసేన పార్టీకి ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

1010
Chiranjeevi

Chiranjeevi


ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే. చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న ‘విశ్వంభర’కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. హైదరాబాద్‌లో దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రెండో పాట కూడా షూటింగ్ పూర్తయినట్లు టాక్‌. త్రిష, చిరంజీవిలపై దీన్ని చిత్రీకరించారట. మెగాస్టార్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలవనుంది. రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం కోసం 18 ఏళ్ల తర్వాత చిరు- త్రిషలు కలిసి నటించనున్నారు.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Recommended image2
Anasuya: అనసూయ ఏం చేసినా వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image3
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved