పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి మూవీ.. అదే తప్పు రిపీట్ అవుతోందా ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలకు ఓకె చెప్పేస్తున్నారు. ఆల్రెడీ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలకు ఓకె చెప్పేస్తున్నారు. ఆల్రెడీ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఓజి మూవీ కోసం మాత్రం చకచకా డేట్లు ఇచ్చేస్తున్నారు. అయితే ఉస్తాద్, వీరమల్లు చిత్రాల పరిస్థితి ఏంటనేది మాత్రం అర్థం కావడం లేదు.
ఇంతలోనే మరో చిత్రానికి చక చకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఎప్పుడో ఏడాది క్రితం అనౌన్స్ మెంట్ జరిగిన సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ చిత్రం ఇప్పుడు మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కే ఈ మూవీ 100కోట్ల బడ్జెట్ లో నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత.
ఏడాది క్రితమే ఈ చిత్రానికి ప్రకటన వచ్చింది. కానీ పవన్ డేట్స్ ఇస్తే చూసుకోవచ్చులే అన్నట్లుగా సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని పక్కన పెట్టేసి ఏజెంట్ మూవీ చేసుకున్నారు. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా వెళ్లి బోల్తా పడ్డారు. ఏజెంట్ డిజాస్టర్ ఎఫెక్ట్ నుంచి తేరుకుని ఇప్పుడు అర్జెంట్ గా పవన్ చిత్రం కోసం కొత్త ఆఫీస్ నే ప్రారంభించారు. అసలు ఈ చిత్రానికి అయినా పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఏడాది క్రితం అనౌన్స్ మెంట్ ఇచ్చి అలా వదిలేశారు. ఇప్పడు పవన్ నటిస్తున్న మూడు చిత్రాలు సెట్స్ పైనే ఉన్నాయి. ఈ చిత్రాలకు డేట్స్ ఎలా అడ్జెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది. ఏకంగా 40 కోట్లకి పైగా నష్టాలు మిగిల్చిన ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డికి మంచి అవకాశమే వచ్చింది అని అంటున్నారు.
ఏజెంట్ తరహాలో స్క్రిప్ట్ లేకుండా హడావిడి చేస్తే సురేందర్ రెడ్డి మరో బిగ్ మిస్టేక్ చేసినట్లే అని అంటున్నారు. ఇక్కడ నిర్మాత రామ్ తాళ్లూరి తొందరపాటు కూడా కనిపిస్తోంది. చాలా ఏళ్లుగా రామ్ తాళ్లూరి పవన్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే కొత్త ఆఫీస్ ఓపెనింగ్ అంటూ హంగామా మొదలైందని చెబుతున్నారు.
ఏది ఏమైనా సురేందర్ రెడ్డి, పవన్ కాంబినేషన్ అంటే క్రేజిగానే ఉంటుంది. అతనొక్కడే, రేసుగుర్రం, ధృవ లాంటి సాలిడ్ హిట్స్ సురేందర్ రెడ్డి ఖాతాలో ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి వక్కంతం వంశి కథ అందిస్తున్నారు. కాబట్టి స్క్రిప్ట్ మినిమమ్ గ్యారెంటీ అన్నట్లుగా ఉంటుందని.. ఏజెంట్ తరహాలో తప్పులు ఉండవనేది పవన్ ఫ్యాన్స్ అభిప్రాయం.