- Home
- Entertainment
- Rukmini Vasanth: రుక్మిణి వసంత్‌కి తెలుగులో మరో బంపర్ ఆఫర్, నానితో రొమాన్స్.. డైరెక్టర్ ఎవరంటే?
Rukmini Vasanth: రుక్మిణి వసంత్‌కి తెలుగులో మరో బంపర్ ఆఫర్, నానితో రొమాన్స్.. డైరెక్టర్ ఎవరంటే?
Rukmini Vasanth: నేచురల్ స్టార్ నాని తర్వాతి సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించబోతోంది. '96' సినిమా ఫేమ్ ప్రేమ్ కుమార్ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ను డైరెక్ట్ చేయనున్నారు.

రుక్మిణి వసంత్ కి మరో తెలుగు ఆఫర్
కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు శాండల్వుడ్లోనే కాదు, సౌత్ ఇండియా మొత్తం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. 'సప్త సాగరదాచే ఎల్లో', 'కాంతార: చాప్టర్ 1' సినిమాల తర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీకి ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ తగిలింది.
నాని సరసన హీరోయిన్గా రుక్మిణి వసంత్
టాలీవుడ్ స్టార్ హీరో నాని తర్వాతి సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నాని నటించిన యాక్షన్ సినిమా 'ది ప్యారడైజ్' రీసెంట్గా రిలీజ్ అయింది. నాని కెరీర్లోనే ఇదొక డిఫరెంట్ అటెంప్ట్. ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. కలెక్షన్లు కూడా అలానే ఉన్నాయి. ఓవరాల్‌గా ఇదొక ఫ్లాప్ మూవీగా నిలిచిందని చెప్పొచ్చు. దీంతోపాటు సుజీత్‌తో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు.
ఇప్పుడు యాక్షన్ జానర్ నుంచి బయటకొచ్చి, నాని మళ్లీ తన మార్క్ రొమాంటిక్ కామెడీ, లవ్ స్టోరీల వైపు అడుగులు వేస్తున్నాడు. ఆయన తర్వాతి సినిమా చాలా సింపుల్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ఉండబోతోందని, ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించనుందని సమాచారం.
'96' డైరెక్టర్‌తో నాని-రుక్మిణి జోడీ
తమిళంలో సూపర్ హిట్టయిన '96' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రేమ్ కుమార్, నాని తర్వాతి సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. '96' సినిమాలో ప్రేమ, జ్ఞాపకాలు, ఎమోషన్స్‌ను చాలా నేచురల్‌గా చూపించిన ప్రేమ్ కుమార్.. ఇప్పుడు నాని, రుక్మిణి వసంత్‌లతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
రుక్మిణి నేచురల్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ ఈ క్యారెక్టర్‌కు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయనే ఉద్దేశ్యంతోనే ఆమెను తీసుకున్నారట. నాని లాంటి స్టార్ హీరో పక్కన రుక్మిణి తొలిసారిగా నటిస్తుండటంతో అభిమానులు కూడా ఎగ్జైట్ అవుతున్నారు.
వరుస సినిమాలతో ఫుల్ బిజీ
ప్రస్తుతం రుక్మిణి వసంత్ చేతిలో చాలా సినిమాలున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న 'డ్రాగన్' సినిమాలో ఆమె నటిస్తోంది. అలాగే మలయాళంలో నివిన్ పౌలీ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలోనూ హీరోయిన్గా చేస్తోంది. కన్నడలో 'మంగళ గౌరి' అనే కామెడీ థ్రిల్లర్ సినిమాతో పాటు, తమిళంలో మరో కొత్త ప్రాజెక్టుకు కూడా సైన్ చేసినట్లు తెలుస్తోంది.
కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ మొదలుపెట్టి తమిళ, తెలుగు, మలయాళ భాషల్లోకి ఎంట్రీ ఇస్తున్న రుక్మిణి వసంత్.. ఇప్పుడు నాని సినిమాతో టాలీవుడ్లో మరో సాలిడ్ స్టెప్ వేయడానికి రెడీ అయింది. నాని-రుక్మిణి జోడీ, ప్రేమ్ కుమార్ డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి మరి.

