- Home
- Entertainment
- Devatha: చెప్పు రాధా.. నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావ్.. రుక్మిణికి ధైర్యాన్నిచ్చిన ఆదిత్య!
Devatha: చెప్పు రాధా.. నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావ్.. రుక్మిణికి ధైర్యాన్నిచ్చిన ఆదిత్య!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 23 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే దేవి (Devi) రాధ (Radha) ని గట్టిగా కౌగలించుకొని ఎమోషనల్ గా ఎన్నో ముద్దులు పెడుతుంది. అంతేకాకుండా నువ్వు చాలా మంచి దానివి అని అంటుంది. నాకు నిజం తెలిసింది, నువ్వు మా అమ్మవి కావు అయినా కానీ నన్ను బాగా చూసుకున్నావు అన్నట్లు అంటుంది.
ఇక రాధ (Radha) అలాంటి మాటలు వినకు నేనే మీ అమ్మను అంటూ కుమిలి పోతూ చెబుతుంది. అంతేకాకుండా నా బిడ్డకు నేనే నీ కన్న తల్లి అని చెప్పుకునే గతి పట్టింది నాకు అని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆదిత్య (Adithya) రాధ ను కలిసి అమ్మకు నువ్వు చనిపోలేదు అన్న నమ్మకం వచ్చింది అని అంటాడు. దాంతో రాధ ఒకసారిగా స్టన్ అవుతుంది.
ఇక ఆదిత్య (Adithya) నీ విషయంలో నిర్ణయం తీసుకోలేని అంత దూరాన్ని ఏర్పరిచావు అందుకే నేను కూడా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అని రాధ (Radha) తో అంటాడు. అంతే కాకుండా నీలో ఏదో చెప్పుకోలేని బాధ ఉంది. అది ఏంటో చెప్పమంటాడు. అది ఇప్పుడు చెప్పేది కాదు అని రాధ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇక మరోవైపు దేవి (Devi) ఒక చెట్టు కింద కూర్చుని వాళ్ళ తల్లి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కారులో వెళుతున్న దేవుడమ్మ (Devudamma) అది గమనించి దేవి దగ్గరికి వెళుతుంది. దేవుడమ్మ ఏంటమ్మా ఆ కన్నీళ్లు.. నువ్వు హ్యాపీగా ఉండాలి అంటూ తనతో పాటు కారులో తీసుకొని వెళుతుంది.
ఇక దేవుడమ్మ (Devudamma) దేవి ఇంట్లో ఇంటికి తీసుకు వెళ్ళ గానే.. బాషా, సత్య (Sathya) లు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు. ఇక ఆదిత్య కనబడితేనే దీనికి బావుంటుంది అని దేవుడమ్మ అంటుంది. కానీ ఆదిత్య పని మీద బయటకు వెళ్ళాడు అని సత్య అంటుంది. ఇక మరోవైపు ఇంకోసారి మా అమ్మ ఎవరు? అని నా దగ్గర అడగనని ఒట్టు వెయ్యి అని రాధ దేవి తో అంటుంది.
దానితో దేవి (Devi) కూడా నువ్వే మా అమ్మా అయితే.. ఇంకోసారి అబద్ధం చెప్పనని ఓటు వెయ్యి అని అంటుంది. దాంతో రాధ ఎంతో కుమిలిపోతూ ఏడుస్తుంది. ఇక మరోవైపు రాధ దేవి కి సొంత అమ్మ కాదంట అని దేవుడమ్మ ఆదిత్య (Adithya) కు చెబుతుంది. ఈమాట దేవి చెప్పింది అని అంటుంది. దీన్ని బట్టి కథ మొత్తం అడ్డం తిరిగేలా ఉంది.