Brahmamudi: అపర్ణను భయానికి గురిచేస్తున్న రుద్రాణి.. రాజ్ కొంపముంచిన ధాన్యలక్ష్మి!
Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. తనకి ఇష్టం లేకుండా ఇంటికి కోడలుగా వచ్చిన కోడల్ని భరించలేక ఇబ్బంది పడుతున్న ఒక అత్త కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో దిగులుగా కూర్చుని ఉంటుంది అపర్ణ. ఎందుకు అంత దిగులుగా ఉన్నావు ఇది సంతోషించవలసిన సమయం అంటుంది రుద్రాణి. నేనెందుకు సంతోషించాలి అంటుంది అపర్ణ. అదేంటి అలా అంటావు నీ కొడుకు ఇప్పుడిప్పుడే నీ కోడల్ని అర్థం చేసుకుని ఓకే గదిలో కలిసి కాపురం చేస్తున్నారు అంటుంది రుద్రాణి. వాడు ఏం చేస్తున్నాడు నాకు బాగా తెలుసు అంటుంది అపర్ణ. నువ్వు అలా అనుకుంటున్నావేమో బయట భార్య మీద చిర్రుబుర్రు లాడుతూ లోపల తనమీద ప్రేమ చూపిస్తున్నాడేమో, నువ్వు ఇలా అందరి మీద అరుస్తూ పెద్దరికం చూపిస్తూ ఉంటే అందరూ నిన్ను ఒంటరిదాన్ని చేసేస్తారు ఆఖరికి నీ కొడుకుతో సహా అంటుంది రుద్రాణి.
మరోవైపు అందంగా ఉన్న తన రూమ్ ని చూసి ఆశ్చర్యపోతాడు రాజ్. పక్కనే ఉన్న పనిమనిషితో ఇన్నాళ్లు నీ టాలెంట్ అంతా ఎక్కడ పెట్టావు హీరోని ఇంత అందంగా డెకరేట్ చేసావు నీలో ఇంత కళాకారిణి ఉందని నాకు తెలియదు అంటాడు రాజ్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటుంది పనిమనిషి. అంతలో పక్కనున్న కావ్య మీరు ఎప్పుడు నాణానికి ఒకవైపే చూస్తారు అంటుంది.
ఎందుకు ఈ రూమ్ ని ఇలా చేశావు ముందులాగే చెయ్యు అంటాడు రాజ్. అదేంటి ఇప్పుడే కదా కళాకారిణి అదీ ఇదీ అంటూ పొగిడారు అంటుంది కావ్య. అప్పుడు అన్నాను కానీ ఇప్పుడు అనట్లేదు అయినా రెండు మూడు రోజుల్లో వెళ్ళిపోయే దానివి నీకు ఎందుకు ఈ పనులన్నీ అంటాడు రాజ్. నేను తప్పు చేశాను అని తెలిసినప్పుడు కదా వెళ్ళేది అంటూ అతనికి మిరియాల పాలు ఇస్తుంది. ఎందుకు అంటాడు రాజ్. మీరు గురక పెడుతున్నారు మిరియాల పాలు తాగితే గురక తగ్గుతుంది అంటుంది కావ్య. నాకేమీ గురక రాదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్.
మరోవైపు స్వప్న రాహుల్ కి ఫోన్ చేసి ఎందుకు నన్ను అక్కడ నుంచి వెళ్ళిపోమన్నావు రాజ్ కి నిజం చెప్పవలసింది కదా అంటుంది. ఈ సందర్భం లేకుండా ఏ విషయం బయట పెట్టకూడదు. సమయం చూసుకొని నేను ఇంట్లో చెప్తాను అప్పుడు గ్రాండ్గా పెళ్లి చేస్తారు అంటాడు రాహుల్. ఏదో ఒకటి త్వరగా చేయు లేదంటే మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు రేపు మనం ఒకసారి కలవాలి అని చెప్తుంది స్వప్న. నాకు కావలసింది కూడా అదే అనుకుంటాడు బయటికి మాత్రం సరే రేపు కలుద్దాం అంటూ ఫోన్ పెట్టేస్తాడు. మరోవైపు నిద్రలో రాజ్ పెడుతున్న గురకకి మెలకువ వస్తుంది కావ్య కి.
అతని ఫోన్ తోనే ఆడియో రికార్డ్ చేస్తుంది. మళ్లీ ఈ గురక నాది కాదు అంటాడేమో అనుకొని వీడియో కూడా తీస్తుంది. రేపు చెప్తాను మీ పని అనుకుంటూ మళ్లీ పడుకుంటుంది. మరోవైపు స్వప్న కోసం చీర తీసుకువస్తుంది కనకం. నువ్వు నాకోసం షేర్ తీసుకు వచ్చావా అంటూ సంతోష్ పడిపోతుంది స్వప్న. నేను నీ మీద ప్రేమతో తీసుకురాలేదు రేపు నీకు పెళ్లి చూపులు. మళ్లీ లేచిపోవుడాలు అదీ ఇదీ అంటూ పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను అని చెప్పడానికి వచ్చాను అంటుంది కనకం. ఆ మాటలకి షాక్ అయిన స్వప్న నాకు అప్పుడే వెళ్లొద్దు నాకు అసలు టైం కావాలి అంటుంది.
కలల్లో బ్రతకకు నువ్వు ఎంత ఎదురు చూసినా రాకుమారుడు ఏమి రాడు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కనకం. మరోవైపు గార్డెనింగ్ చేస్తూ ఉంటుంది కావ్య. నువ్వెందుకు చేయటము పనివాళ్ళేరీ అంటాడు కళ్యాణ్. పనివాళ్ళు సెలవులో ఉన్నారు అందుకే నేను చేస్తున్నాను అంటుంది కావ్య. అక్కడ నుంచి వెళ్ళిపోతున్న కళ్యాణ్ కి రాజ్ ఎదురవుతాడు. పనివాళ్ళు ఉన్నారు కదా అయినా ఆ ఓవరాక్షన్ చూడు అందరిని ఇంప్రెస్ చేయడం కోసమే అలా చేస్తుంది అంటూ కావ్య గురించి చెప్తాడు. మన మనసులో ఎలాంటి ఆలోచన ఉంటే మనుషులు అలాగే కనిపిస్తారు వదిన ఎవరిని ఇంప్రెస్ చేయవలసిన అవసరం లేదు.
ఈరోజు పని వాళ్లు రాలేదు అందుకే ఇలా చేస్తుంది వదిన గురించి కాస్త పాజిటివ్గా ఆలోచించు అంటాడు కళ్యాణ్. తరువాయి భాగంలో నువ్వు కాఫీని వదిలేయటానికి సిద్ధపడితే తనకోసం ఎవరూ లేరు అనుకోకు మేమందరం మేము ఉన్నాము ఇప్పుడే ఈ సంగతి ఇంట్లో అందరికీ చెప్పాను అంటూ రాజ్ చెప్తున్నా వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భాగ్యలక్ష్మి. మరోవైపు కొత్తకోడలు కనిపించడం లేదంటూ రుద్రాణి ఇంట్లో అందరికీ చెప్తుంది.