Brahmamudi: అప్పును ఘోరంగా అవమానించిన రుద్రాణి.. రాజ్ చేసిన పనికి ఫిదా అయిన కావ్య!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. డబ్బున్న ఇంటికి కోడలిగా వెళ్లి పుట్టింటిని చులకనగా చూస్తున్న ఒక పొగరుబోతు కూతురు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో అప్పుడే ఇంటికి వచ్చిన అప్పుకి ఒక బ్యాగ్ ఇచ్చి స్వప్న కి ఇచ్చి రమ్మంటాడు కృష్ణమూర్తి. ఏంటి ఈ బ్యాగ్ అని అడుగుతుంది అప్పు. మామిడికాయలు చింతకాయలు స్వప్న కడుపుతో ఉంది కదా ఈ టైంలో ఇలాంటివి తినాలనిపిస్తుంది అందుకే పట్టుకొని వెళ్లి ఇవ్వు అంటాడు కృష్ణమూర్తి. దానిమీద అంత ప్రేమ ఎప్పుడు పుట్టుకొచ్చింది అంటుంది అప్పు.
పుట్టిన దగ్గరనుంచి ఉంది కానీ తప్పు చేసినప్పుడు ప్రేమని చూపించలేము కదా అంటాడు కృష్ణమూర్తి. వాళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అప్పు కి మూలుగు వినిపిస్తుంది. ఏంటా మూలుగు అని అనుమానంగా అడుగుతుంది. కంగారు పడిన కనకం,మీనాక్షి ఏదో అబద్ధం చెప్పి తప్పించుకుంటారు. సీన్ కట్ చేస్తే బయటికి వెళ్తున్న రాహుల్ ని ఇప్పుడు నీకు పెళ్లి అయ్యింది కాస్త బాధ్యతగా నడుచుకో అని చెప్తాడు రాజ్.
అంటే ఇప్పటివరకు నేను బాధ్యతగా లేననా నీ ఉద్దేశం అంటాడు రాహుల్. అలా అని కాదు నిన్ను నమ్ముకొని ఒక అమ్మాయి ఇంటికి వచ్చింది ఇప్పుడు నువ్వు మరింత బాధ్యతగా ఉండాలి నువ్వు నాతో పట్టే నా బ్రాంచ్ లో కొన్ని రోజులు పని చెయ్యు అప్పుడు నీకు ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్. పైకి వెళ్ళిన తర్వాత తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలని చెప్పారు కదా మరి ఎందుకు రాహుల్ విషయంలో మీరు తప్పుని బయట పెట్టడం లేదు అని నిలదీస్తుంది కావ్య.
సమాధానం నాకు చెప్పక్కర్లేదు మీకు మీరు ఆలోచించుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు కా వ్య వాళ్ళ ఇంటికి వెళ్లిన అప్పు గుమ్మంలోనే నిలబడుతుంది. అది చూసిన ధాన్యలక్ష్మి అక్కడే నిలబడిపోయావేమి లోపలికి రా వచ్చి కూర్చో నేను వెళ్లి కావ్యని తీసుకువస్తాను అని చెప్పి పైకి వెళ్తుంది. సోఫా మీద మగ రాయుడు లాగా కూర్చున్న అప్పుని చూసి అడుక్కోడానికి వచ్చావా అని అసహ్యంగా మాట్లాడుతుంది రుద్రాణి.
ఆకలి వేస్తే మాడి చేస్తాం అంతేకానీ నీకు లాగా పరాయి ఇంట్లో పడి బ్రతకం అని ఘాటుగా సమాధానం ఇస్తుంది అప్పు. ఏం కూసావ్ అంటూ అప్పు మీద చెయ్యెత్తుతుంది రుద్రాణి. అప్పుడే అక్కడికి వచ్చిన చిట్టి ఇంటికి వచ్చిన అతిధి మీద చెయ్యి ఎత్తుతావా అని మందలిస్తుంది. ఈ బికారిది నన్ను ఏమందో తెలుసా అంటుంది రుద్రాణి. ఏమన్నాను మీలాగా ఇంటికి వచ్చిన అతిధిని అడుక్కు తినడానికి వచ్చావా అని అడగలేదు అంటుంది అప్పు.
ఆ పిల్లని అంత మాట అన్నావా అంటూ అపర్ణతో సహా అందరూ రుద్రాణిని మందలిస్తారు. కావ్య కూడా తనని అలా అనటానికి నోరు అలా వచ్చింది అంటూ రుద్రాణి మీద కేకలు వేస్తుంది. స్వప్న మాత్రం అత్తగారిని వెనకేసుకొస్తూ అప్పుని తిడుతుంది. తను ఎప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చిందంటే ఏదో కారణం ఉండి ఉంటుంది అంటుంది ధాన్యలక్ష్మి. ఏదో అవసరం వచ్చి ఉంటుంది అందుకే వచ్చింది అని చీప్ గా మాట్లాడుతుంది స్వప్న.
స్వప్నని మందలిస్తుంది కావ్య. నాన్న నీకు మామిడికాయలు ఇవ్వమని చెప్పి ఇచ్చాడు కానీ నీకు డబ్బు తప్ప ఏది రుచించదని ఆయనకు తెలియదు అంటుంది అప్పు. నాకెందుకు మామిడికాయలు తినాలనిపిస్తుంది నాకు అవంటే అసహ్యం అంటుంది స్వప్న. అందరూ ఆశ్చర్యపోతారు నీకు వేళ్ళు కదా నీకు ఇప్పుడు పులుపు తినాలనిపిస్తుంది కదా అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క డౌట్ ని ఎక్స్ ప్రెస్ చేస్తారు.
నాకు పులుపు తినాలనిపిస్తుంది కానీ అప్పు తీసుకు వచ్చింది కదా అందుకే తినాలనిపించడం లేదు అని అబద్ధం చెప్పేస్తుంది స్వప్న. పుట్టింటి నుంచి ప్రేమగా వచ్చినప్పుడు తిరస్కరించకూడదు అని చిట్టి చెప్పడంతో ఆ మామిడికాయలు తీసుకుంటుంది స్వప్న. సరే నేను బయలుదేరుతానంటూ బయటికి వచ్చేసిన అప్పు వెనకాతలే వస్తాడు కళ్యాణ్.
అప్పుతో కూల్ గా మాట్లాడి ఆమె కోపాన్ని తగ్గించి కదా నేను డ్రాప్ చేస్తాను అని ఆమెని ఒప్పిస్తాడు. తరువాయి భాగంలో ఇంటికి దొంగ చాటుగా పరుపుని తీసుకువస్తాడు రాజ్. ఏంటిది అని అడుగుతుంది కావ్య. కింద పడుకుంటే ఒళ్ళు నొప్పులు వస్తాయని నాకు నిన్ననే తెలిసింది అంటాడు రాజ్. భర్త అభిమానానికి ఫిదా అయిపోతుంది కావ్య.