- Home
- Entertainment
- Brahmamudi: స్వప్నను టార్గెట్ చేస్తున్న రాహుల్, రుద్రాణి.. భర్తకు తెలియకుండా ఆ పని చేస్తున్న కావ్య?
Brahmamudi: స్వప్నను టార్గెట్ చేస్తున్న రాహుల్, రుద్రాణి.. భర్తకు తెలియకుండా ఆ పని చేస్తున్న కావ్య?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ తో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. తన ప్రవర్తనతో తను ఉంటే ఇష్టం లేని అత్త మనసు గెలుచుకున్న ఒక కోడలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో డ్రైవింగ్ రాదు వాడు నీకు నేర్పటమా.. ఈ సంగతి నాకు ముందే చెప్తే పరిస్థితి ఇంతవరకు రానివ్వను కదా అంటాడు రాజ్. వదిన దేమి తప్పులేదు అన్నయ్య నేనే సరిగ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేకపోయాను అంటాడు కళ్యాణ్. ఇంక చాల్లే ఆ నేర్పించడం ఏదో ఇకనుంచి నేనే నేర్పిస్తాను అంటాడు రాజ్. మీరు నేర్పిస్తారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది కావ్య.
ఏం నాకు నేర్పించడం రాదనుకున్నావా అంటాడు రాజ్. అలా అని కాదు మీరు నేర్పించడం కన్నా నాకు కావాల్సిందేముంది అని చెప్పి అందరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు టీవీ రిమోట్ లో బ్యాటరీ కోసం వెతుకుతుంటే ప్రతి సొరుగు లోని ఇన్హేలర్ కనిపిస్తుంది అపర్ణకి. ఇదేంటి ఎక్కడ చూసినా అవే ఉన్నాయి అంటుంది అపర్ణ. ఇన్హేలర్ లేకపోవడం వల్లే రాజ్ కి అంత ప్రమాదం వచ్చింది మళ్ళీ అలాంటి ప్రమాదం రాకూడదని కావ్యనే పెట్టింది అంటుంది ధాన్యలక్ష్మి.
తన భర్త కోసం బాగా జాగ్రత్త తీసుకుంటుంది కానీ నువ్వే తనని పట్టించుకోవడం లేదు పుట్టింటి వాళ్ళతో మాట్లాడకూడదని చెప్పి తన ఫోన్ తీసేసుకున్నావు. ఆ ఫోన్ ఉండి ఉంటే రాజ్ కి అంత సీరియస్ అయినప్పుడు ఉపయోగపడేది కదా అంటుంది చిట్టి. అంతలోనే రాజ్ వాళ్ళు వస్తారు. అపర్ణ సీరియస్గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఏం జరిగింది అంటాడు రాజ్. ఇంతలో అపర్ణ మళ్ళీ వచ్చి కావ్య చేతిలో ఫోన్ పెడుతుంది.
ఎమోషనల్ అవుతుంది కావ్య. మీరు మనస్ఫూర్తిగానే ఇస్తున్నారు కదా అంటుంది. నువ్వు మరి ఎక్కువ ఊహించుకోకు ఫోన్ ఉండడం ఎంత అవసరమో అర్థమైంది అందుకే ఇస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది అపర్ణ. మొత్తానికి భర్త మనసుతో పాటు అత్త మనసు కూడా గెలుచుకున్నావు ఘటికురాలివే అంటుంది ధాన్యలక్ష్మి. ఇదంతా మెట్ల మీద నుంచి చూస్తారు స్వప్న దంపతులు. కోపంతో తన గదిలోకి వెళ్లిన స్వప్న చెల్లెలి మీద అసూయతో రగిలిపోతూ ఉంటుంది.
అప్పుడే రాహుల్ ఒక ఫోన్ తీసుకొచ్చి ఇస్తాడు. కావ్యకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు అని మళ్ళీ గొడవ పెడతావు అందుకే తీసుకొచ్చాను అంటాడు. నా బాధ నీకు అర్థం కావట్లేదు నాకు కావలసింది గౌరవం. అంతేకానీ ఈ తొక్కలో ఫోన్లు, బ్యాంక్ అకౌంట్ లు కాదు అంటుంది స్వప్న. దానికోసం మేము గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాము నువ్వు ఇప్పటికి ఎప్పుడు కావాలంటే దొరికేస్తుందా అని మనసులో అనుకుంటాడు రాహుల్.
నేను మోడలింగ్ చేస్తాను రాహుల్ అప్పుడు బయటి వాళ్ళందరూ నన్ను మెచ్చుకుంటుంటే అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా నాకు గౌరవం ఇస్తారు అంటుంది స్వప్న. అలా చేస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు సరి కదా నీతో పాటు నన్ను కూడా చెదరించుకుంటారు ఇది జరిగే పని కాదు అని కోపంగా బయటికి వచ్చేస్తాడు రాహుల్. ఈ మాటలు అన్ని బయట నుంచి ఉంటున్న రుద్రాణి తను అడిగిన దాంట్లో తప్పేముంది అంటుంది.
అదేంటి మమ్మీ అలా అంటున్నావు అలా చేస్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా తను ఇంట్లోంచి బయటికి గెంటేస్తారు అంటాడు రాహుల్ మనకి కావలసింది అదే కదా అంటుంది రుద్రాణి. నిజమే కదా నేనేంటి నిజమైన భర్త లాగా ఎమోషనల్ అయిపోతున్నాను అని చెప్పి స్వప్న దగ్గరికి వెళ్లి నేను మీకు సపోర్ట్ చేస్తాను కానీ నేనే నీకు అవకాశాలు ఇచ్చినట్లు చెప్పొద్దు అని స్వప్న దగ్గర మాట తీసుకుంటాడు రాహుల్.
తనకు ఏదో మంచి చేస్తున్నాడు అనుకొని మురిసిపోతుంది స్వప్న. రాహుల్ మనసులో పిచ్చిదానా నీకు నువ్వే తవ్వుకుంటున్నావు అనుకుంటాడు. మరోవైపు స్వప్న సూడిదల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు. ఇంతలో కావ్య ఫోన్ చేసి అత్తగారు తన ఫోన్ తనకి ఇచ్చేసిన విషయం చెబుతుంది. నీ కాపురం కుదిరి పడినందుకు ఆనందంగా ఉందని అందరూ కావ్యకి చెప్తారు. కనకం స్వప్నకి సూడిదలు తేవాలనుకుంటున్నట్లు చెప్తుంది. ఇప్పుడు అలాంటి వేవి పెట్టుకోకు నువ్వు తెచ్చినా అక్క చిరాకు పడుతుంది తప్పితే ఆనందించదు.. తర్వాత మీరు బాధపడాలి అంటుంది కావ్య.
ఇంతలో సేటు కేకలు వేసుకుంటూ వస్తాడు. ఎవరమ్మా మర్యాద లేకుండా మా నాన్నని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది కావ్య. ఏమీ లేదు మళ్లీ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కనకం. కానీ కావ్య మళ్లీ ఫోన్ చేస్తుంది.ఫోన్ కింద పడిపోయి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సేటు అప్పు తీర్చమంటూ కేకలు వేయటంవిని షాక్ అవుతుంది. కృష్ణమూర్తి చేతిలోంచి డబ్బులు లాక్కొని మిగతాది రేపు కట్టండి లేదంటే ఇల్లు స్వాధీనం చేసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు సేటు. తరువాయి భాగంలో డిజైనర్ శృతి దగ్గర పనిచేయడానికి డిసైడ్ అయ్యి అదే విషయం శృతికి చెప్తుంది. అర్ధరాత్రి డిజైన్లు వేస్తుంది కావ్య. పక్క మీద కావ్య లేకపోవడంతో ఏం చేస్తుందో అని బయటికి వచ్చి చూస్తాడు రాజ్.