MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Brahmamudi: కళ్యాణ్ ని వాడుకుంటున్న అనామిక.. తల్లి, కొడుకుల మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా!

Brahmamudi: కళ్యాణ్ ని వాడుకుంటున్న అనామిక.. తల్లి, కొడుకుల మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా!

Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంటుంది. దూరం పెడుతున్న భర్తకి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు సెప్టెంబర్ 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Navya G | Published : Oct 27 2023, 08:57 AM
3 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Asianet Image

 ఈరోజు ఎపిసోడ్ లో నిజం చెప్పాలని కిందికి వస్తుంది కావ్య. కానీ అక్కడ అందరూ పుట్టబోయే బిడ్డ కోసం మాట్లాడుకోవడం చూసి ఇప్పుడు నిజం చెప్పే వీళ్ళందర్నీ బాధ పెట్టాలా అని మనసులో బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు అబార్షన్ టాబ్లెట్స్ రాహుల్ కి చూపించి వీటిని స్వప్న ఎలాగైనా వేసుకునే లాగా చేయాలి అంటుంది. అలా చేస్తే ముందు అనుమానం నా మీదకే వస్తుంది అంటాడు రాహుల్. నీ మీదకి ఎందుకు వస్తుంది, ఇప్పుడు వంటలు అన్ని కావ్య చేస్తుంది కాబట్టి ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్పవచ్చు అప్పుడు నేరం ఆమె మీదకి వెళ్ళిపోతుంది.

28
Asianet Image

 లేదంటే సీమంతం అయిపోయి స్వప్న ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మనం ఏమీ చేయలేము, తన బిడ్డని ఎత్తుకొని ఆడించడం తప్ప అంటుంది రుద్రాణి. అందుకు సరే అంటాడు రాహుల్. మరోవైపు కృష్ణుడి దగ్గరికి వెళ్లి తన మనసులో బాధ చెప్పుకుంటుంది కావ్య. మా ఇంట్లో కూడా నీ లీలలు ప్రారంభించావా.. ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పడం నీకు అలవాటు అయినట్లు నాకు అలవాటు అవ్వలేదు. పెద్దవాళ్ల బాధ చూసి నిజం చెప్పలేకపోతున్నాను అంతేగాని అబద్ధం చెప్పడం లేదు.

38
Asianet Image

ఏది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది, నేను తప్పు చేశాను అని మాత్రం అపార్థం చేసుకోవద్దు. ఇదంతా నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని కృష్ణుడికి దండం పెట్టుకుంటుంది. మరోవైపు అనామిక ఇంట్లో వంట చేస్తూ ఉంటాడు  కళ్యాణ్. అక్కడికి వచ్చిన అప్పు అనామిక ఇంట్లో నువ్వెందుకు వంట చేస్తున్నావు, వాళ్ల పేరెంట్స్ ఏరి అని అడుగుతుంది. వాళ్ల పేరెంట్స్ లేరు బయటకు వెళ్లారు అందుకే అనామిక నాకు కాల్ చేసింది అంటాడు కళ్యాణ్.
 

48
Asianet Image

 మరి నీకు వంట చేయడం వచ్చా అంటుంది అప్పు. నాక్కూడా రాదు అందుకే హెల్ప్ చేస్తావని నిన్ను పిలిచాను కానీ నువ్వు రావడం లేట్ అయింది అందుకే ఆన్లైన్లో చూసి చేసేసాను అంటాడు  కళ్యాణ్. అనామిక కి వంట చేయడం రాదా అంటుంది అప్పు. అప్పుడే అక్కడికి వచ్చిన అనామిక రాదు అంటుంది. మరి రేపు పెళ్లి అయితే ఏం చేస్తావు అంటుంది అప్పు. అందుకే కదా కళ్యాణ్ కి వంట నేర్పిస్తున్నాను అంటుంది అనామిక. వాడిని బాగా వాడుకుంటున్నావు.
 

58
Asianet Image

 పెళ్ళికి ముందే ఇలా ఉంటే రేపు పెళ్లి అయ్యాక ఇంకా ఎలా వాడుకుంటావో అని మనసులో అనుకుంటుంది అప్పు. ఇంతలో వంట రెడీ చేసి అనామికకి పెట్టి టేస్ట్ ఎలా ఉంది అని అడుగుతాడు కళ్యాణ్. వంట బాలేదు అని చెప్తుంది అనామిక. నీకోసం ప్రేమగా చేసి పెడితే అలా అంటావేంటి అంటుంది అప్పు. తప్పు చేసినప్పుడు చేసావని చెప్తేనే కదా తెలుస్తుంది అంటుంది అనామిక. కరెక్ట్ గా చెప్పావు అంటాడు కళ్యాణ్. వీడికి ప్రేమంటే తెలీదు, దీనికి వాడుకోవడం తప్పితే ఇంకేమీ తెలియదు అనుకుంటుంది అప్పు.
 

68
Asianet Image

 మరోవైపు జ్యూస్ లో టాబ్లెట్ కలిపి  భార్యకి పట్టుకొని వెళ్లి ఇస్తాడు రాహుల్. నాకు ఆ జ్యూస్ తాగటం  నచ్చదు అంటుంది స్వప్న. తాగి తీరాలి అల్లుడు తన బిడ్డ మీద ప్రేమతో జ్యూస్ కలిపి తీసుకొస్తే తాగనుంటావా అంటూ ఆ జ్యూస్ ని స్వప్న చేత బలవంతంగా తాగిస్తుంది కనకం. అది చూసిన తల్లి కొడుకులు ఆనందపడతారు. తల్లి తన చేత్తోనే కూతురికి అబార్షన్ అయ్యేలాగా చేస్తుంది అనుకుంటుంది రుద్రాణి. మరోవైపు తలనొప్పికి  రాసుకోవటానికి బామ్ పట్టుకుంటాడు రాజ్.
 

78
Asianet Image

తన నడుముకే రాయటానికి ఏమో అనుకొని మూడు నెలలు ఆగమన్నారు కదా అప్పుడే చిలిపి చేష్టలు ప్రారంభించారేమిటి అని సిగ్గుపడుతుంది కావ్య. అంత సీన్ లేదు నాకు తలనొప్పిగా ఉంది అందుకే రాసుకోవడానికి బామ్ తీశాను అంటాడు రాజ్. అయితే నేను రాస్తాను అని చెప్పి బలవంతంగా అతని దగ్గర బామ్ తీసుకొని రాస్తుంది కావ్య. ఆ తర్వాత కరెంట్ పోయినప్పుడు కూడా అనుకోకుండా రాజ్ చెయ్యి కావ్య నడుము మీద పడుతుంది. అదే విషయాన్ని రాజ్ తో చెప్తే కావాలని వెయ్యలేదు అంటాడు.
 

88
Asianet Image

మీరు మారుతున్నారు కానీ మీకు ఆ విషయం అర్థం అవ్వట్లేదు అనుకుంటుంది కావ్య. మరోవైపు  నిద్రపోతున్న స్వప్నని చూస్తూ ఇంకా ఎలాంటి రియాక్షన్ రాలేదు ఏమిటి అనుకుంటాడు రాహుల్. స్వప్నని నిద్రలేపి ఏమైనా కావాలా, ఆరోగ్యం బాగానే ఉందా అని అడుగుతాడు.  నీకేమైంది నిద్రలేపి మరి అడుగుతున్నావు నువ్వు ఇచ్చిన జ్యూస్ తాగి హాయిగా నిద్ర పట్టింది నువ్వు కూడా పడుకో అని చికాగ్గా చెప్తుంది స్వప్న. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories