- Home
- Entertainment
- RRR Pre release Event: పోటెత్తిన ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్.. జనసేన, టీడీపీ జెండాలు ప్రత్యక్షం
RRR Pre release Event: పోటెత్తిన ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్.. జనసేన, టీడీపీ జెండాలు ప్రత్యక్షం
ఇండియన్ బిగ్గెస్ట్ ఈవెంట్‌గా `ఆర్‌ఆర్‌ఆర్` ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఇద్దరు హీరోల అభిమానులు భారీగా తరలి రావడంతో ప్రాంగణం మొత్తం పోటెత్తింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రం మార్చి 25న విడుదల కాబోతుంది. దీంతో శనివారం కర్నాటకలోని చిక్కబల్లాపూర్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో ఈ వేడుకని ఏర్పాటు చేశారు. ఇద్దరు హీరోల అభిమానులు భారీగా తరలి రానున్న నేపథ్యంలో ఈవెంట్ సైతం కనీ విని ఎరుగని విధంగా అద్భుతంగా డిజైన్ చేశారు.
అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులతో, మరోవైపు కన్నడ అభిమానులు, పునీత్ రాజ్‌కుమార్ అభిమానులతో `ఆర్‌ఆర్‌ఆర్` ఈవెంట్ వేడుక ప్రాంగణం మొత్తం పోటెత్తిపోయింది. జనసందోహంతో కిక్కిరిసిపోయింది. ఊహంచని విధంగా ఈ వేడుకకి మూడు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలి వచ్చారు.
ఇదిలా ఉంటే ఈ ఈవెంట్‌లో టీడీపీ, జనసేనా పార్టీ జెండాలు కూడా ప్రత్యక్షం కావడం విశేషం. ఏకంగా కొందరు జనసేనా కార్యకర్తలు ఈవెంట్ గ్రౌండ్ మధ్యలో ఏర్పాటు చేసిన సౌండ్ బాక్స్ లు పైకి ఎక్కి మరీ జెండాని ప్రదర్శించారు. మరోవైపు బైక్ ర్యాలీలో టీడీపీ జెండాలను ప్రదర్శించారు ఎన్టీఆర్ అభిమానులు. ఎన్టీఆర్ టీడీపీ వైపు ఉన్న విషయం తెలిసిందే.
మరోవైపు రామ్‌చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆయా పార్టీల జెండాలని ప్రదర్శించారు.
మరోవైపు ఎన్టీఆర్ కోసం కర్నాటక నుంచి పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు కూడా భారీగా తరలి వచ్చారు. కన్నడ పవర్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న పునీత్ గతేడాది గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన నటించిన ఓ సినిమాలో ఎన్టీఆర్ పాట పాడారు. ఇద్దరూ మంచి స్నేహితులు. దీంతో పునీత్ అభిమానులు సైతం ఈ వేడుకకి తరలి వచ్చారు.
మరోవైపు ఈ `ఆర్‌ఆర్‌ఆర్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై గెస్ట్ గా రాబోతున్నారు. దీంతోపాటు చిత్ర బృందం, ఇతర సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు.