MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Alia Bhatt: ప్రకృతిలో పరవశిస్తున్న కొత్త పెళ్లి కూతురు అలియా... గడ్డి మైదానంలో పడుకొని అలా!

Alia Bhatt: ప్రకృతిలో పరవశిస్తున్న కొత్త పెళ్లి కూతురు అలియా... గడ్డి మైదానంలో పడుకొని అలా!

పెళ్ళై రెండు నెలలు కాలేదు... కొత్త జంట అలియా భట్, రన్బీర్ కపూర్ ప్రొఫెషన్ లైఫ్ లో బిజీ అయ్యారు. ఇద్దరికీ చేతి నిండా సినిమాలున్న నేపథ్యంలో తీరిక లేకుండా గడిపేస్తున్నారు. షూటింగ్ కోసం అందమైన పచ్చిక మైదానాలకు వెళ్లిన అలియా తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేశారు.  

1 Min read
Author : Sambi Reddy
Published : May 29 2022, 02:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Alia Bhatt

Alia Bhatt


'నా సూర్యకాంతి నాకు ఇవ్వు... నా దారిన నేను పోతాను' అంటూ కామెంట్ చేసిన అలియా (Alia Bhat) ఇంస్టాగ్రామ్ లో ఆహ్లాదమైన ఫోటోలు పంచుకున్నారు. కోరుకున్నవాడిని పెళ్లాడిన ఆనందం అలియా కళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు కెరీర్ పరుగులు పెడుతుండగా ఎంజాయ్ చేస్తున్నారు. 

25
Alia Bhatt

Alia Bhatt


2018 నుండి రన్బీర్ (Ranbir Kapoor) తో అలియా డేటింగ్ చేస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న ముంబైలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వీరి వివాహం టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది. 
 

35
Alia Bhatt

Alia Bhatt

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో బ్రహ్మాస్త్ర చిత్రం తెరకెక్కుతుంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ సోషల్ ఫాంటసీ కాన్సెప్ట్ తో ఈ భారీ చిత్రం రూపొందిస్తుండగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అమితాబ్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక రోల్స్ చేస్తున్నారు. 
 

45
Alia Bhatt

Alia Bhatt

కాగా అలియా మరో మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. కరణ్ జోహార్ దర్శకత్వంలో రాకీ ఔర్ రాణి ప్రేమ్ కహాని తెరకెక్కుతుండగా అలియా హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే డార్లింగ్స్, అనే మరో హిందీ చిత్రం ఆమె ఖాతాలో ఉంది. హార్ట్ ఆఫ్ స్టోన్ చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. 
 

55
Alia Bhatt

Alia Bhatt

అలియా లేటెస్ట్ చిత్రాలు గంగూబాయ్ కతియావాడి, ఆర్ ఆర్ ఆర్ విజయాలు అందుకున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఎన్టీఆర్-కొరటాల శివ మూవీలో (NTR 30) అలియా నటించాల్సి ఉండగా.. ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Aamir Khan: నా సికందర్ నువ్వే.. మాజీ భార్య స్పెషల్ విషెస్! 'లగాన్' కథ విననని చెప్పాడట
Recommended image2
Ananya Panday: అతడి కోసం నన్ను నేను తగ్గించుకున్నా.. బ్రేకప్స్ పై నోరు విప్పిన అనన్య పాండే!
Recommended image3
Lokesh Kanagaraj: బ్యాంక్ ఆఫీసర్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్ వరకు.. లోకేష్ కనగరాజ్ ఆస్తి ఎన్ని కోట్లంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved