'యానిమల్' బ్యాటీ తృప్తి డిమ్రి...Bad Newz మేటరేంటంటే...
గ్లామర్‌తో పాటు యాక్టింగ్‍తోనూ ఆకట్టుకున్న ఆమె సరికొత్త నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. మొత్తంగా తృప్తి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు.

రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాతో తృప్తి దిమ్రి ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిందనటంలో ఎలాంటి సందేహం లేదు . ఈ సినిమాలో రష్మిక మందన్నా మెయిన్ హీరోయిన్ అయినా తృప్తికే ఎక్కువ మార్కులు పడ్డాయి. అమె అందానికి కుర్రకారు పిచ్చెక్కిపోయారు. గ్లామర్‌తో పాటు యాక్టింగ్‍తోనూ ఆకట్టుకున్న ఆమె సరికొత్త నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. మొత్తంగా తృప్తి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు.
ఈ క్రమంలో తృప్తి తర్వాత ఏ సినిమా చేస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తృప్తి డిమ్రికి క్రేజీ ఆఫర్ వచ్చింది. బాలీవుడ్‍లో ఎంతో ఫేమస్ అయిన హారర్ కామెడీ ఫ్రాంచైజీ ‘భూల్ భులయా’లోకి ఆమె అడుగుపెట్టారు. భూల్ భులయా 3 మూవీలో కార్తీక్ ఆర్యన్ సరసన తృప్తి హీరోయిన్‍గా నటించనున్నారు. భూల్ భులయా 3 చిత్రంలో తనతో పాటు తృప్తి డిమ్రి నటించనున్నారని హీరో కార్తీక్ ఆర్యన్ అధికారికంగా వెల్లడించారు. అలాగే ఇప్పుడు మరో సినిమాలోనూ ఆమె కనిపించనుంది.
తృప్తి ఇప్పుడు Bad Newz అనే సినిమా కమిటైంది. ఈ మేరకు అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. టైటిల్ Bad Newz అయినా ఇది ఆమె ఫ్యాన్స్ కు గుడ్ న్యూసే. ఎందుకంటే ఈ సినిమా గతంలో వచ్చిన గుడ్ న్యూస్ అనే హిట్ సినిమా తీసిన టీమ్ ఇది. కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో విక్కీ కౌశల్, అమ్మీ విర్క్ నటిస్తున్నారు. ఆనంద్ తివారీ డైరక్ట్ చేస్తున్నారు.
అలాగే తృప్తి డిమ్రి ఇప్పుడు పుష్ప 2లో ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పుష్ప రాజ్ అనుచరుడిని ట్రాప్ చేయించి చంపించే పాత్రలో తృప్తి డిమ్రి కనిపిస్తోందట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఆగస్టు 15న, 2024లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ సినిమాతో పాటు కు తృప్తి డిమ్రి కి తాజాగా ఓ బంపర్ ఆఫర్ దక్కినట్టు సమాచారం.. బాలీవుడ్‍లో ఎంతో పాపులర్ అయిన ఆషికీ ఫ్రాంచైజీలో తదుపరి రానున్న ఆషికీ 3 మూవీలో హీరోయిన్‍గా తృప్తి డిమ్రికి అవకాశం దక్కిందని సమాచారం.ఆషికీ 3 చిత్రం లో కార్తీక్ ఆర్యన్ హీరో గా చేయనున్నారు. ఈ సినిమా లో కార్తీక్ సరసన తృప్తి డిమ్రి హీరోయిన్‍గా నటించనున్నారని సమాచారం.
యానిమల్ సినిమా బంపర్ హిట్ తర్వాత తృప్తి డిమ్రి ఫుల్ పాపులరిటీ వచ్చింది.కార్తీక్ ఆర్యన్‍తో ఆమె నటిస్తే అద్భుతంగా ఉంటుందని ఆషికీ 3 మేకర్స్ కొంతకాలంగా అనుకుంటున్నారట. అయితే, ఈ విషయంపై కొన్ని రోజుల చర్చ తర్వాత ఎట్టకేలకు హీరోయిన్‍గా తృప్తి డిమ్రిని ఫిక్స్ చేసినట్టు ఆ మూవీ వర్గాల నుంచి సమాచారం.దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఆషికీ 3 చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించనున్నారు. టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కూడా మ్యూజికల్ లవ్ స్టోరీగానే రూపొందనుంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకమైన మ్యూజిక్ స్కోర్ క్రియేట్ చేస్తామని ఇటీవల అనురాగ్ బసు తెలిపారు.ఆషికీ 3 సినిమా షూటింగ్ 2024 మొదటి మూడు నెలల్లోనే ప్రారంభం కానుంది. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నిషియన్ల గురించి మేకర్స్ ప్రకటించనున్నారు.
ఇదిలా ఉంటే ఆమె రెమ్యునరేషన్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఆమె తాజాగా “భూల్ భులయ్య 3” సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది. ఆమె “యానిమల్” చిత్రంలో నటించినందుకు 40 లక్షల రూపాయలు అందుకొంది. కానీ “భూల్ భులయ్య 3″కి ఆమె ఏకంగా దాదాపు కోటి రూపాయలు తీసుకుంటోంది అని టాక్.
అంటే తృప్తి పారితోషికం ఒక్క సినిమా సక్సెస్ తో రెండింతలు అయింది. ఇకపై బాలీవుడ్ లో చేసే అన్ని సినిమాలకు ఎక్కువ పారితోషికం డిమాండ్ చెయ్యనుంది. ఇంకో రెండు హిట్స్ పడితే ఈ భామ రెండు కోట్లకు పైగా అందుకోవడం ఖాయం అంటున్నారు బాలీవుడ్ మీడియా జనం.
రెమ్యునరేషన్ పెంపు వార్తలపై తృప్తి స్పందించింది. “నా కన్నా మీడియాకే నా సంపాదన గురించి ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు ఉంది,” అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది. మరోవైపు ఈ భామని తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటింప చెయ్యాలని ఓ నిర్మాత భావిస్తున్నారు.