- Home
- Entertainment
- Jabardasth- Roja: రోజా షాకింగ్ డెసిషన్ జబర్దస్త్ కి బై బై.?.. అనూహ్య నిర్ణయం వెనుక కారణం అదే!
Jabardasth- Roja: రోజా షాకింగ్ డెసిషన్ జబర్దస్త్ కి బై బై.?.. అనూహ్య నిర్ణయం వెనుక కారణం అదే!
సీనియర్ హీరోయిన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆమె జబర్దస్త్ కి బై బై చెప్పేయనున్నారట. మొత్తంగా బుల్లితెర నుండి ఆమె కనుమరుగు కానున్నారని ఓ షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

స్టార్ హీరోయిన్ గా ఒకప్పుడు సౌత్ ఇండియాను ఊపేసిన రోజా(Roja Selvamani).... రాజకీయాల్లోకి వచ్చాక నటించడం తగ్గించారు. అయితే ఆమె బుల్లితెర కామెడీ షో జడ్జిగా కొత్త అవతారం ఎత్తారు. 2013లో జబర్దస్త్ పేరుతో కామెడీ షో ప్రారంభమైంది. ఈ షో జడ్జిగా రోజా ఎంట్రీ ఇచ్చారు.
నటుడు నాగబాబు(Nagababu)తో పాటు ఏళ్ల తరబడి ఆ షో జడ్జిగా వ్యవహరించారు. ఏదో షోలో కూర్చున్నామా? టీమ్స్ కి మార్కులు వేశామా? అన్నట్లు కాకుండా రోజా తన ప్రత్యేకత చాటుకున్నారు. కమెడియన్స్ పంచ్ లకు కౌంటర్లు వేయడంలో రోజా దిట్ట. ఆమె తన మార్కు పంచ్ లతో షోలో జోష్ నింపుతూ ఉంటారు.
ఇక రెండేళ్ల క్రితం నాగబాబు షో నుండి తప్పుకున్నా రోజా మాత్రం కొనసాగుతున్నారు. జబర్దస్త్ షోతో ఏకంగా 9 ఏళ్ల అనుబంధం ఆమెది. జబర్దస్త్ మాత్రమే కాకుండా ఇతర షోలు, స్పెషల్ ఈవెంట్స్ లో రోజా సందడి చేస్తూ ఉంటారు. ఇటీవల రోజాకు సర్జరీ జరిగింది. దానితో కొన్ని వారాలు జబర్దస్త్ షోతో పాటు బుల్లితెర ఈవెంట్స్ కి దూరమయ్యారు.
కాగా ఇకపై బుల్లితెర షోలు చేయకూడదని రోజా నిర్ణయం తీసుకున్నారట. దానితో భాగంగా జబర్దస్త్ (Jabardasth) నుండి వైదొలగనున్నారట. ఆమెకు మంత్రి పదవి వరించడమే ఇందుకు కారణం అంటున్నారు. ఏపీ సీఎం జగన్ మంత్రివర్గం పునఃవ్యవస్థీకరణ చేస్తున్న నేపథ్యంలో... ఎప్పటి నుండో ఆశలు పెట్టుకున్న రోజాకు మంత్రి పదవి ఖాయం అంటున్నారు. ఈ మేరకు రోజాకు హామీ కూడా ఇవ్వడం జరిగిందట.
మంత్రిగా మరిన్ని బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంటుంది. అందుకే జబర్దస్త్ షో నుండి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. మరోవైపు రోజా బుల్లితెర షోలపై ఎప్పటి నుండో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. విపక్షాలతో పాటు ఆమె యాంటీ ఫ్యాన్స్ ఈ కోణం నుండి ఆమెను టార్గెట్ చేస్తున్నారు. మంత్రి పదవిలో హుందాగా వ్యవహరించాలంటే ఈ షోలకు దూరంగా ఉండడమే బెటర్ అని రోజా భావిస్తున్నారట.
అలాగే నిబంధనల ప్రకారం మంత్రి పదవిలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఆదాయం సమకూర్చే ఇతర వృత్తుల్లో కొనసాగకూడదు. ఈ మేరకు ఆమె టెలివిజన్ షోల నుండి నిష్క్రమించాలానే నిర్ణయం తీసుకున్నారట. సీఎం జగన్ నుండి గట్టి హామీ దక్కడంతో అన్ని విధాలుగా మంత్రి పదవి కోసం రోజా సన్నద్ధం అవుతున్నారట.
మరి ఇదే నిజమైతే జబర్దస్త్ కి చాలా నష్టం జరిగినట్లే. రోజా స్థాయిలో మరొకరు జబర్దస్త్ షోకి ప్రత్యేకత తీసుకురాలేరు. ఇప్పటికే చాలా మంది స్టార్ కమెడియన్స్ తప్పుకోగా షో పట్ల ఆదరణ తగ్గింది. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది టీమ్స్ మాత్రమే ఫేవరేట్ గా ఉన్నాయి. ఇక రోజా కూడా నిష్క్రమిస్తే జబర్దస్త్ టీఆర్పీ తగ్గిపోవడం ఖాయం...