MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హైపర్ ఆది వల్లే జబర్దస్త్ మానేశా, నేను బోల్డ్ కాబట్టి ఆఫర్స్ కోసం వెళితే.. ఫస్ట్ టైం ఓపెన్ అయిన రీతూ చౌదరి

హైపర్ ఆది వల్లే జబర్దస్త్ మానేశా, నేను బోల్డ్ కాబట్టి ఆఫర్స్ కోసం వెళితే.. ఫస్ట్ టైం ఓపెన్ అయిన రీతూ చౌదరి

గతంలో రీతూ చౌదరి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో సందడి చేసేది. ముఖ్యంగా హైపర్ ఆది తో కలసి బాగా కెమిస్ట్రీ పండించేది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 27 2024, 10:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బుల్లితెరపై గ్లామర్ హంగామా చేస్తూ రీతూ చౌదరి క్రేజీ బ్యూటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా రీతూ ఊహించని విధంగా ఫాలోవర్స్ పెంచుకుంది.  యువతని ఆకర్షించే విధంగా రీతూ చౌదరి ఫోటో షూట్స్ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. కొన్నిసార్లు గ్లామర్ డోస్ ఎక్కువవడం వల్ల రీతూ చౌదరి ట్రోలింగ్ ని ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. 

26

అయితే గతంలో రీతూ చౌదరి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో సందడి చేసేది. ముఖ్యంగా హైపర్ ఆది తో కలసి బాగా కెమిస్ట్రీ పండించేది. వీళ్లిద్దరి చనువు చూసి అంతా సంథింగ్ సంథింగ్ జరుగుతోంది అని అనుకున్నారు, రీతూ, హైపర్ ఆది గురించి రూమర్స్ కూడా వచ్చాయి. 

36

కానీ సడెన్ గా హైపర్ ఆది, రీతూ చౌదరి జబర్దస్త్ మానేశారు. ప్రస్తుతం రీతూ చౌదరి కొన్ని షోలు చేస్తోంది. వాటిలో కిలాడీ గర్ల్స్ కిరాక్ బాయ్స్ అనే షో ఒకటి. ఇటీవల ఇంటర్వ్యూలో రీతూ చౌదరి హైపర్ ఆది గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జబర్దస్త్ మానేసి ఇలాంటి షోలు చేయడానికి కారణం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా రీతూ చౌదరి ఓపెన్ గా కామెంట్స్ చేసింది. 

46

నేను జబర్దస్త్ మానేయడానికి కారణం హైపర్ ఆది. హైపర్ ఆది జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాడు. ఇక నేనొక్కదానినే అక్కడ ఏం చేయాలి అని ప్రశ్నించింది. హైపర్ ఆది వెళ్ళిపోయాడు కాబట్టే తాను కూడా జబర్దస్త్ నుంచి వచ్చేసినట్లు రీతూ పేర్కొంది. 

56

టివి షోలు మాత్రమే చేస్తున్నారు.. సినిమా ఆఫర్స్ రావడం లేదా అని ప్రశ్నించగా.. ఇండస్ట్రీలో నేను జస్ట్ విజె అవుదాం అని వచ్చాను. ఈ రోజు ఇక్కడి వరకు చేరుకున్నా. చాలా షోలు చేస్తున్నా. ఇప్పుడిప్పుడే సినిమాల్లో కూడా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నా. 

66

కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఆఫర్స్ కోసం వెళితే ఈ అమ్మాయి బోల్డ్ గా ఉంటుంది కాబట్టి అలాంటి పాత్రలే ఇష్టం అంటున్నారు. బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి నేను రెడీ. కాకపోతే సినిమాలో ఆ పాత్రకి ప్రాధాన్యత ఉండాలి అని రీతూ చౌదరి అంటోంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ షో గురించి విమర్శించే వారిని పట్టించుకోను అని రీతూ పేర్కొంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Anushka Shetty: నాగార్జున చెప్పిన ఈ ఒక్క మాటని ఇప్పటికీ ఫాలో అవుతున్న అనుష్క.. సినిమాలకు గుడ్‌ బై ఎప్పుడంటే
Recommended image2
Karthika Deepam 2 Today Episode: దోషిలా కార్తీక్- నింద తనపై వేసుకున్న దీప- దశరథను ఇరికించిన పారు
Recommended image3
Upasana: కొడుకు మరణంతో తల్లడిల్లిన తల్లి, ఉపాసన జీవితాన్ని మార్చిన ఘటన.. ఇంత జరిగిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved