- Home
- Entertainment
- బిగ్‌బాస్ ఓటింగ్‌లో రీతూకు షాక్.. టాప్‌లో లక్స్ పాప.. డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే?
బిగ్‌బాస్ ఓటింగ్‌లో రీతూకు షాక్.. టాప్‌లో లక్స్ పాప.. డేంజర్ జోన్‌లో ఎవరున్నారంటే?
Bigg Boss Telugu 9 Week 3 Voting: బిగ్ బాస్ సీజన్ 9 లో మూడో వారం నామినేషన్‌లో ఫ్లోరా, రీతూ, రామూ, హరీష్, ప్రియాశెట్టి, పవన్ కళ్యాణ్ నిలిచారు. వారం హౌస్ నుంచి ఎవరు? ఎలిమినేట్ కాబోతున్నారు? ఓటింగ్ లో ఎవరు టాప్ లో నిలిచారు? అనే ఆసక్తికరంగా మారింది.

నామినేషన్స్ తో హీటెక్కిన హౌస్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా జరుగుతోంది. ట్వీస్టులు, కాంట్రవర్సీలు, లవ్ స్టోరీలు లతో షో ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇక మొదటి వారం ఎలిమినేషన్ లో సెలబ్రిటీలలో శ్రేష్టీ వర్మ ఎలిమినేట్ అయ్యాగా, రెండో వారం కామనర్స్‌లో మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. పేరు మాత్రం మర్యాద, కానీ, ఆయన ప్రవర్తన మాత్రం అమర్యాదగా ఉండటంతో ఫ్యాన్స్ అతడ్ని హౌస్ నుంచి బయటకు పంచేశారట. ఇక మూడో వారం ప్రారంభం కాగానే, హౌస్ లో నామినేషన్స్ హీట్ మొదలైంది
నామినేషన్ లో దిమ్మతిరిగే ట్విస్ట్
వారం మొత్తం ఎన్నో ప్రేమగా, స్నేహంగా ఉన్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ ప్రాసెస్ ప్రారంభం కాగానే.. బద్ద శత్రువుల్లా వ్యవహరిస్తారు. ఇక మూడో వారం నామినేషన్స్ ప్రారంభం కాగానే ఒక్కసారి హౌస్ హీటెక్కింది. ఈ వారం నామినేషన్స్‌లోఆసక్తికర ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి. బిగ్ బాస్ లో కామనర్స్ గా వచ్చిన ప్రియా శెట్టి, దమ్ము శ్రీజా లు రచ్చ రచ్చ చేస్తున్నారు. వీరిద్దరూ ఎప్పుడు నామినేషన్స్‌లో వస్తారో ప్రేక్షకులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. హౌస్‌లో కెప్టెన్‌గా ఉన్న డీమాన్ పవన్‌కి ప్రత్యేక పవర్స్ ఇచ్చారు. ఈ పవర్స్‌తో ఒకర్ని నామినేషన్స్ నుండి సేవ్ చేయవచ్చు. ప్రేక్షకులు ఊహించినట్టుగా రీతూ చౌదరిని సేవ్ చేయాలని అనుకున్నారు, కానీ, పవన్ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుని శ్రీజాని సేవ్ చేశారు. ఈ నిర్ణయం చూసి హౌస్‌లో సస్పెన్స్ నెలకొంది.
నామినేషన్స్‌లో ఎవరు నిలిచారు?
మూడో వారంలో మొదట సారి టెనెంట్స్ ద్వారా కామనర్స్ నామినేట్ చేయబడ్డారు. హరీష్, శ్రీజా, పవన్, ప్రియా శెట్టి, డీమాన్ పవన్ ఐదుగురు సెలెక్ట్ అయ్యారు. ఆ ఐదుగురిలో ఒకరు తప్పక టెనెంట్స్‌లో ఉండాల్సింది. క్రమంగా హరీష్ నామినేట్ అయ్యాడు. తర్వాత సెలబ్రిటీలకు కామనర్స్ నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు. ఫైనల్‌లో ఈ ఆరుగురు నామినేషన్‌లో నిలిచారు: ఫ్లోరా షైనీ,రీతూ చౌదరి, రామూ రాథోడ్, హరీష్, ప్రియాశెట్టి, పవన్ కళ్యాణ్ నామినేట్ అయ్యారు. మూడు వారాల నామినేషన్స్‌లో ఆసక్తికర ట్విస్ట్‌లతో ఫ్యాన్స్ షాక్‌లో ఉన్నాయి. సుమన్ శెట్టి, సంజనా మొదట నామినేట్ అయ్యినా, తుది నిర్ణయంలో సేవ్ అయ్యారు. ప్రియా శెట్టి నామినేషన్‌లో ఉండటంతో ఆమె ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.
బిగ్ బాస్ ఓటింగ్ ఇలా..
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మూడో వారం ఓటింగ్ విషయానికి వస్తే.. ఈ వారం నామినేషన్స్ లో ఫ్లోరా, రీతూ, రామూ, హరీష్, ప్రియాశెట్టి, పవన్ కళ్యాణ్ నిలిచారు. ఈ వారం ఎవ్వరూ ఊహించని విధంగా ఓట్లు పోల్ అవుతున్నాయి. తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ లేకపోయినా.. ఉన్న వారికి బెస్ట్ పర్సన్ కు ఓట్లు వేస్తున్నారు. ఇతరులపై కోపం మరొకరికి వరంలా మారినట్టు.. కామనర్స్ పై కోపంగా ఉన్న ఫ్యాన్స్ సెలబ్రెటీలకు ఓట్లు వేస్తున్నారు. సోషల్ మీడియా పోల్స్ ప్రకారం.. ఫ్లోరా షైనీ 27.37% ఓటింగ్‌తో టాప్‌లో నిలిచారు. రాము రాథోడ్ 27% ఓటింగ్‌తో ఫ్లోరాకు దగ్గరగా ఉన్నారు. ఇక హరిత హరీశ్ బిగ్ బాస్ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మాస్క్ మ్యాన్ దాదాపు 13.57% ఓటింగ్‌తో మూడో స్థానంలో నిలిచారు. ఇక పవన్ కళ్యాణ్ 12.38% ఓటింగ్‌తో నాల్గో స్థానంలో , రీతూ 11.95% ఓటింగ్ తో ఐదో స్థానంలో ఉన్నారు. ఇక, ప్రియా శెట్టి కేవలం 7.3% ఓట్లు పొందారు.
డేంజర్ జోన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్
ప్రస్తుతం బిగ్ బాస్ ఓటింగ్ చూస్తే.. చాలా ఇంట్రెసింగ్ గా ఉంది. కేవలం 24 గంటల్లో పోలింగ్ మాత్రమే కాబట్టి.. ఎవరు ఎలిమినేట్ అవుతారో? ఎవరు డేంబర్ జోన్ లో ఉన్నారో సరిగ్గా చెప్పలేం. కానీ, ఇదే పరిస్థితి ఇలాగే కొన్నసాగితే మాత్రం ప్రియా శెట్టి ఈవారం ఎలిమినేట్ అవ్వే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఓటింగ్ లైన్‌లు ఇంకా మూడు రోజులపాటు తెరవనున్నాయి. ఆ సమయంలో ర్యాంకింగ్స్ మారే అవకాశం ఉంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో, ఈ వారం హౌస్ లో ఎవరు ఉంటారో? ఎవరు డేంజర్ జోన్‌లో ఉంటారో కొద్దిరోజుల్లో స్పష్టమవుతుంది.