Guppedantha Manasu: వసుకు సర్ప్రైజ్ ఇచ్చిన రిషి.. జగతికి థాంక్స్ చెప్పిన కొడుకు?
Guppedantha Manasu: స్టార్ మాలో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. ఆత్మాభిమానం, అంతులేని ప్రేమ ఉన్న ఇద్దరు వ్యక్తుల ప్రేమ కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఇలా జరిగిందేంటి సౌజన్య రావు గారు రిషి సార్ తో మాట్లాడినప్పుడు ఒకలాగా మనతో మరొక లాగా మాట్లాడారు. ఆయన ప్రపోజల్ ఇలా ఉంటుందనుకోలేదు అంటూ బాధపడుతుంది వసు. గుడ్ న్యూస్ తీసుకువద్దామని వెళ్ళాము కానీ ఇలాగా మాట్లాడుతారని అనుకోలేదు. అయినా సౌజన్య రావు మాటల్లో ఏదో తేడా ఉంది అతను ఏదో కుట్రతోనే మనల్ని అప్రోచ్ అయ్యాడు.
పాపం ఈ డీలింగ్ ఓకే అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రిషి తనకి ఈ విషయాన్ని ఎలా చెప్పడం అంటుంది జగతి. కాలేజీ ఓకే అవుతుందని ఆల్రెడీ ఇంజనీర్ తో మాట్లాడి బ్లూ ప్రింట్ తీయించి చాలా హడావుడి చేస్తున్నాడు రిషి తన ఫీలింగ్స్ అన్ని నాతో షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ బ్యాడ్ న్యూస్ తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అంటూ బాధపడతాడు మహేంద్ర. అంతలోనే అక్కడికి వచ్చిన రిషి అందరూ ఎందుకు ఇలా ఉన్నారు మీరు వెళ్లిన పని ఏమైంది అని జగతిని అడుగుతాడు. ఆమె ఏదో చెప్పేలో గానే మీరు వెళ్తే పని ఖచ్చితంగా అవుతుంది
నేను వసు ని తీసుకొని బయటికి వెళ్తాను వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం పని జగతితో చెప్పి వసుని తనతో రమ్మని బయటకు వెళ్తాడు రిషి. ఇదే కరెక్ట్ టైం వెళ్లి వీలు చూసుకుని విషయం చెప్పు అంటుంది జగతి. వసు రాకపోవడంతో మళ్లీ లోపలికి వచ్చిన రిషి ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. ఏమి లేదు అంటూ అతనితో బయలుదేరుతుంది వసు. బయటికి వచ్చిన తర్వాత కారులో కాకుండా బైక్ మీద బయలుదేరుతారు రిషి, వసు. అది చూసిన దేవయాని కోపంతో రగిలిపోతుంది. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు నడుచుకుంటున్నారు బయట వాళ్ళు ఏమైనా అనుకుంటారని భయం లేదు అంటూ భర్తకి చెప్తుంది.
అందరూ మారుతున్నారు ఒక్క నీ ఆలోచన తప్ప రిషిని ఎక్కువగా గుప్పెట్లో పెట్టుకోవాలని చూడకు అది మొదటికే మోసం వస్తుంది అంటూ మందలిస్తాడు ఫణీంద్ర. అప్పుడే అటుగా వచ్చిన ధరణిని పిలిచి ఉన్న గదికి కాఫీ తీసుకొని రా తల పగిలిపోతుంది అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. అలాగే మావయ్య గారు అంటూ మీకు కూడ కాఫీ తెమ్మంటారా అని దేవయానిని అడుగుతుంది ధరణి. ఇంత విషం తీసుకురా అంటూ కోపంగా చెప్తుంది దేవయాని. అది మన ఇంట్లో లేదు అంటూ వెళ్ళిపోతుంది ధరణి. మరోవైపు బైక్ మీద వెళ్తున్న వసు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని రిషి ని అడుగుతుంది.
ప్రయాణాన్ని ఎంజాయ్ చేయు గమ్యం గురించి ఆలోచించకు అంటాడు రిషి. నేరుగా తీసుకెళ్లి వాళ్ళ కాలేజీలో ఆపుతాడు. ఇక్కడికి తీసుకొచ్చారేంటి అంటుంది వసు. నీకు ఒక సర్ప్రైజ్ చూపించాలి అని చెప్పి తన రూమ్ కి తీసుకువెళ్లి డి బి ఎస్ టి మెడికల్ కాలేజ్ అనే ఒక బోర్డు చూపిస్తాడు. ఇదేనా సర్ప్రైజ్ అంటూ నిరుత్సాహపడుతుంది వసు. నేను ఎంతో ఎగ్జిైటెడ్ తో చూపిస్తే నువ్వు ఎందుకు అలా ఉన్నావు నీకు నచ్చలేదా అంటాడు రిషి. అది కాదు సార్ అంటూ సౌజన్య రావు డీలింగ్ గురించి చెప్తుంది వసు. అలా ఎలా కాలేజీలో కలిపేస్తాము అలా జరగడం కుదరదు అయినా నువ్వెందుకు డల్ గా ఉన్నావు అంటాడు రిషి.
మీరు చాలా ఆశలు పెట్టుకున్నారు కదా సరి కాలేజీ మీద అంటుంది వసు. డీలింగు కుదరక పోయినంతమాత్రాన కాలేజ్ ఏమీ ఆగిపోదు ఎవరో వచ్చారని ఎవరో వెళ్లిపోయారని బాధపడుతూ కూర్చోకూడదు మన పని మనం చేయాలి కాకపోతే అనుకున్న పని కాస్త లేట్ అవుతుంది ఎప్పటికైనా నా డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకుంటాను అంటూ కాన్ఫిడెంట్ గా చెప్తాడు రిషి.మరోవైపు ఇలా జరుగుతుంది అనుకోలేదు పాపం కాలేజీ కోసం రిషి చాలా ఆశలు పెట్టుకున్నాడు అంటాడు మహేంద్ర. రిషి ఆనందంగా ఉండటం కోసం మనమే ఏదో ఒకటి చేయాలి ఎలాగైనా మన కాలేజీలో మెడికల్ కోర్సెస్ స్టార్ట్ చేయాలి అంటుంది జగతి.
అది చాలా పెద్ద ప్రాసెస్ దానికోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి చాలా పర్మిషన్లు తీసుకోవాలి అంటాడు మహేంద్ర. అలాగని వెనకడుగు వేయలేం కదా అంటుంది జగతి. అనుకోకుండా ఈ మాటలన్నీ రిషి వింటాడు. మరోవైపు ఆలోచనలు ఉన్న రిషి దగ్గరికి వచ్చి కాలేజీకి టైం అవుతుంది బయలుదేరుదామా అని అడుగుతుంది వసు. సరే పద అని రిషి బయలుదేరబోతుంటే ఒక్క నిమిషం ఆగండి ఏదో ఆలోచనలో ఉన్న మీరు షర్ట్ బటన్ సరిగ్గా పెట్టుకోలేదు అంటూ బటన్ సరిచేసి కాలేజీ గురించి డిస్టర్బ్ అవుతున్నట్లుగా ఉన్నారు అంటుంది వసు.
మీరు నా గురించి ఎక్కువ డిస్టర్బ్ అవుతున్నట్లుగా ఉన్నారు రాత్రి మీరు మాట్లాడుకున్న మాటలు విన్నాను నాకోసం ఏదైనా చేయాలని తపన పడుతున్నారు అంటూ వసుకి థాంక్స్ చెప్తాడు రిషి. మేడం కి కూడా నేను థాంక్స్ చెప్పానని చెప్పు అంటాడు. మీ థాంక్స్ మీరే చెప్పుకోండి సార్ నేను చెప్పిన దానికన్నా మీరు చెప్తే ఆవిడ ఎక్కువ సంతోషిస్తారు అంటుంది వసు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.