MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: జగతిని సహాయం కోరిన రిషి.. నీటిలో పడవలు వదిలిన రిషి వసుధార?

Guppedantha Manasu: జగతిని సహాయం కోరిన రిషి.. నీటిలో పడవలు వదిలిన రిషి వసుధార?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

3 Min read
Author : Navya G
Published : Feb 01 2023, 07:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో రిషి,వసు ఆలోచిస్తూ ఉండగా ఇంతలో జగతి అక్కడికి భోజనం తీసుకుని రావడంతో జగతిని చూసి వసుధార అనుకొని ఎందుకు వచ్చావు వసుధార అనగా రిషి నేను జగతిని అని అంటుంది జగతి. రిషి భోజనం చేయలేదు కదా అనగా మేడం వసుధార మళ్లీ కాలేజీకి ఎందుకు వచ్చింది నన్ను బాధ పెట్టడానికే కదా అని అంటాడు. రిషి ఏం జరిగిందో మొత్తం అంతా నీకు తెలుసు బాధ అనగా బాధ కాదు మేడం మోసమా, ద్రోహమో ఇంకా ఏదైనా పెద్ద పదం వాడాలి అనుకుంటాను అంటాడు రిషి. తను ఎందుకు ఇలా చేసిందో మీకు ఏమైనా తెలుసా మేడం అని అంటాడు రిషి. పెళ్లి చేసుకుని అక్కడే ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చింది మీకు ఏమైనా తెలిసి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 ఏంటి రిషి జరిగింది నాకు తెలిసి కూడా నీకు చెప్పలేదు అని అనుకుంటున్నావా అంటుంది జగతి. మేడం నాకు సహాయం చేస్తారా అనగా ఏంటి రిషి అనడంతో నేను వసుధార ని మర్చిపోలేక పోతున్నాను ఎలా మర్చిపోవాలో చెప్తారా అని అంటాడు. నా మనసును చదివారు లేకపోతే వసుధార మనసుని చదివారు తెలియదు కానీ ముందుగానే చెప్పారు అందుకే వసుధారని మరిచిపోయేందుకు నాకు సహాయం చేయండి మేడం అనడంతో జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. చెప్పండి మేడం వసుధార నిజంగానే మిషన్ ఎడ్యుకేషన్ కోసం కాలేజీకి వచ్చిందా అని అడుగుతాడు రిషి. అప్పుడు జగతి నువ్వు వసుధారని ఇప్పటికీ కేవలం మిషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా మాత్రమే చూస్తున్నావా అని అడుగుతుంది.

36

ఒకవేళ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు హెడ్గా అనుకుంటే నువ్వు బాధ పడాల్సిన అవసరం లేదు. లేదా వసుధార నీ మనసులో ఉంటే అది నీ ప్రాబ్లం వసుధర అది కాదు కదా అనడంతో రిషి ఆలోచనలో పడతాడు. అప్పుడు రిషి మేడం నన్ను ఓదారుస్తున్నారా లేదా జీవితంలో ఒంటరిగా బతకాలి అని నన్ను మానసికంగా సిద్ధం చేస్తున్నారా అనడంతో జీవితం అనేది ఒక ఒంటరి ప్రయాణం రిషి అంటూ రిషికి అర్థం అయ్యేవిధంగా చెబుతుంది జగతి. ఎప్పటికీ ధైర్యం కోల్పోకూడదు రిషి అనడంతో నేను కోల్పోయింది ధైర్యం కాదు మేడం నమ్మకం అనడంతో జగతి బాధపడుతూ ఉంటుంది.   అప్పుడు జగతి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రిషి వసు ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు.
 

46

మరొకవైపు వసుధార రిషి గురించి ఆలోచిస్తూ మా మధ్య ఎన్ని గొడవలు వచ్చాయి అవన్నీ గాలి వానల్లా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రిషి వసుధార పంపిన మెసేజెస్ చూసుకొని నువ్వైనా ఎలా మర్చిపోవాలో చెబుతావా అని అంటాడు. అప్పుడు రిషి ఆ మెసేజెస్ ని చూసి మరింత బాధ పడుతూ ఉంటాడు. అప్పుడు వసు కి మెసేజ్ చేయగా అందులో ఏమీ లేకపోవడంతో రిషి సార్ నాకు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నాడా ఈ మెసేజ్ లో ఏమీ లేదే అనుకుంటూ ఉంటుంది వసుధార. ఇంతలోనే చక్రపాణి అక్కడికి వచ్చి ఏంటమ్మా ఇంకా నిద్ర పోలేదా అని అంటాడు. రిషి సార్ వాళ్ళ పెద్దమ్మ అన్న మాటలు గురించి ఆలోచిస్తున్నావా అనడంతో రిషి సార్ గురించి నాకు తెలుసు నా గురించి రిషి సార్ కి తెలుసు మధ్యలో ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను నాన్న అంటుంది.

56

అప్పుడు ఎందుకు ఆమె అలా మాట్లాడింది అనడంతో ఆమె అంతే నాన్న అని దేవయాని గురించి చెబుతూ ఉంటుంది వసుధార. మరుసటి రోజు ఉదయం రిషి బెడ్ పై కూర్చుని వసుధారతో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. ఆ తరువాత రిషి బయటికి వెళ్తుండగా నేను కూడా రావచ్చా అని మహేంద్ర అడగడంతో వద్దు నేనేమి చిన్న పిల్ల వాడిని కాదు కదా అని అంటాడు. ఎంత పెద్దగా అయినా నాకు మాత్రం చిన్నపిల్లాడివి అని అంటాడు మహేంద్ర. అప్పుడు రిషి సరే డాడ్ వెళ్దాం పద అనగా రిషి నేను కూడా వస్తాను అని జగతి అనడంతో సరే అన్నట్టుగా తల ఊపి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత చక్రపాణి వసుధర ఇద్దరు నీటి దగ్గరికి వెళ్తారు. అప్పుడు వసుధార పేపర్లపై కోరికలు రాసి నీటిలో వదులుతూ ఉంటుంది. ఇంతలోనే రిషి మహేంద్ర జగతి అక్కడికి వస్తారు.

66

 ఇక్కడ పిలుచుకొని వచ్చావ్ రిషి అనడంతో కాగితాలపై కోరికలు రాసి పడవలు చేసి నీటిలో వదులుతే నెరవేరుతాయి డాడ్ అని అంటాడు. ఇప్పుడు రిషి వెళ్లి నీళ్ల దగ్గర పడవలు వదులుతు ఉండగా వసుధార కూడా నీళ్లలో పడవలు వదులుతూ ఉంటుంది. అప్పుడు వసుధార రిషి ఇద్దరూ ఒకరికి ఒకరు మనసులో ఒకటే విధంగా కోరుకుంటూ ఉంటారు. అప్పుడు కళ్ళు తెరిచి చూడగా ఇద్దరి పడవలు ఒకచోట కలుసుకోవడంతో అది చూసి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వసుధార రిషి ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. అది చూసి వసుధార సంతోష పడుతూ ఉంటుంది.

About the Author

NG
Navya G
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Trivikram: అత్తారింటికి దారేది తర్వాత త్రివిక్రమ్ చేసిన సినిమాలు ఇవే.. ఒకే ఫార్ములా, దమ్మున్నవి ఎన్ని ?
Recommended image2
Ramayana Movie Review: రామాయణం మూవీ రివ్యూ.. రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి, యష్‌ నటించిన మూవీ హిట్టా ఫట్టా?
Recommended image3
Diwali Movie Releases: దీపావళికి థియేటర్లలో సందడి చేయనున్న 10 సినిమాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved