- Home
- Entertainment
- Guppedantha Manasu: తండ్రిని తన వైపు తిప్పుకుంటున్న శైలేంద్ర.. రిషి కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ఏంజెల్!
Guppedantha Manasu: తండ్రిని తన వైపు తిప్పుకుంటున్న శైలేంద్ర.. రిషి కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ఏంజెల్!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకొని మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. అధికారం దక్కించుకోవడం కోసం అడ్డమైన పనులు చేస్తున్న ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఈరోజు ఆగస్టు 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మహేంద్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భోజనం చేస్తూ ఉంటారు. కూరలో ఉప్పు ఎక్కువైందని ధరణిని మందలిస్తుంది దేవయాని. కూర బావుంది కదా మమ్మీ ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి ధరణి వైపు తిరిగి కూర బావుంది. నా కోసమే చేసావా అంటూ ప్రేమగా మాట్లాడుతాడు శైలేంద్ర. జగతి దంపతులతో పాటు దేవయాని కూడా అతని ప్రవర్తనకి ఆశ్చర్యపోతారు. తర్వాత తండ్రి తో మాట్లాడుతూ నేను కాలేజీ అడ్మినిస్ట్రేషన్ వర్క్ నేర్చుకోవడం దగ్గర నుంచి మొదలు పెడతాను అంటాడు శైలేంద్ర.
అలాగే నేర్చుకో కానీ ఎలాంటి పొరపాట్లు చేయకు. నాకు కావలసింది నువ్వు ఇలా అందరితోని సరదాగా మాట్లాడటం. నీ భార్యని ప్రేమగా చూసుకోవటం అని కొడుక్కి చెప్పి జగతి వాళ్ళవైపు తిరిగి వీడికి మళ్ళీ మొదటి నుంచి వర్క్ మొత్తం నేర్పించండి అని మరదలితో చెప్పి అవసరం అయితే మేనేజర్ దగ్గర కూడా నేర్చుకో అని సైలేంద్రకి చెప్తాడు ఫణీంద్ర. మరోవైపు కారులో వెళ్తున్న వసుధార ఇప్పుడు ఏంజెల్ నన్ను ఏం అడుగుతుందో ఏంటో అని మనసులో అనుకుంటుంది.
ఏంజెల్ వసుధారతో మాట్లాడుతూ నాకు రిషి ప్రవర్తన ఏమీ అర్థం కావడం లేదు అంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను నాకే అర్థం కాలేదు అని మనసులో అనుకుంటుంది వసుధార. ఇంతకీ ఆ లెటర్ ఆయన చదివారా లేదా అంటుంది. చదవకుండా ఉండడానికి ఛాన్స్ లేదు. అతనికి కనిపించే ప్లేస్ లోనే లెటర్ పెట్టాను అయినా పాజిటివ్గా కాని నెగిటివ్గా కాని రెస్పాండ్ అవ్వలేదు అంటుంది ఏంజెల్.
ఇంతకుముందు రిషి ఎవరినైనా ప్రేమించి ఉంటాడు అంటావా అనే మళ్లీ వసుధారని అడుగుతుంది ఏంజెల్. కంగారు పడిపోతుంది వసుధార. అతని ప్రేమ గురించి అడిగితే నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు.. మీ ఇద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతుంది ఏంజెల్. ఉంది ఒక లెక్చరర్ కి మరొక లెక్చరర్ కి మధ్య ఉండే సంబంధం అంటుంది వసుధార. సరే కానీ రిషి మనసులో ఏముందో తెలుసుకోవడానికి నాకు కొన్ని టిప్స్ చెప్పు అంటుంది ఏంజెల్. ఏమీ మాట్లాడకపోతే నా మీద అనుమానం వస్తుంది అనుకొని ఏంజెల్ కి ఒక సలహా ఇస్తుంది వసుధార.
సీన్ కట్ చేస్తే శైలేంద్ర మేనేజర్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జగతి దంపతులు మళ్ళీ శైలేంద్ర ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనుకోని మేనేజర్ ని శైలేంద్ర నిన్నేమడుగుతున్నాడు, నువ్వు అతనికి ఏం చెప్తున్నావు అని అడుగుతాడు మహేంద్ర. డాడీ చెప్పారు కదా మేనేజర్ దగ్గర నుంచి నేర్చుకోమని అదే అడుగుతున్నాను అంటాడు శైలేంద్ర. అందరూ అన్ని నేర్చుకోవక్కర్లేదు నీకు ఎంత కావాలో అంత మటుకు తెలుసుకో చాలు. అక్కరలేని విషయాలు నీకు ఎందుకు అంటాడు మహేంద్ర.
అంతలోనే ఫణీంద్ర అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. మీరే చెప్పారు కదా డాడీ మేనేజర్ దగ్గర నుంచి పని నేర్చుకోమని కానీ బాబాయ్ వాళ్లు ఎందుకో సందేహిస్తున్నారు అంటాడు ఫణీంద్ర. మీ బాధ నాకు అర్థమైంది వాడు ఇంకెప్పుడూ తప్పు చేయడు. అందుకు నేను హామీ. వాడిని వర్క్ నేర్చుకొనివ్వండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఫణీంద్ర. జగతి దంపతులు కూడా వెళ్లిపోయిన తర్వాత మీ బలము బలహీనత మా డాడీ అని నాకు తెలుసు అలాగే నా బలము బలహీనత కూడా మా డాడీ యే.
నెమ్మదిగా మా డాడీని నా దారిలోకి తెచ్చుకుంటే ఈ డి బి ఎస్ టి సామ్రాజ్యం నా చేతిలోకి వస్తుంది అని అనుకుంటాడు శైలేంద్ర. సీన్ కట్ చేస్తే ఇంట్లో ఇంతమంది ఉండగా మేనేజర్ దగ్గర పని నేర్చుకోవడం ఏంటి అని భర్తతో అంటుంది దేవయాని. అదే మంచిది మమ్మీ అక్కడినుంచి అయితే ప్రతి విషయము నేర్చుకోవచ్చు ఎందుకంటే పిన్ని వాళ్ళు బిజీగా ఉంటారు కదా ప్రతి విషయం నాకు చెప్పలేరు అందుకని మేనేజర్ దగ్గర నేర్చుకోవడం మంచిది.
కానీ డాడీ.. పిన్ని వాళ్ళకి చెప్పు మేనేజర్ ని ఏమీ అనొద్దని. అతను నాకు వర్క్ నేర్పిస్తుంటే వర్క్ పెండింగ్లో పడిపోతుందని పిన్ని మళ్లీ మేనేజర్ ని మందలిస్తుంది అంటాడు శైలేంద్ర. మేనేజర్ ని ఏమీ అనొద్దు అని జగతి దంపతులకు చెప్పి ఫణింద్ర అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. శైలేంద్ర కావాలని మమ్మల్ని బావగారు ముందు ఇరికిస్తున్నాడు అనుకుంటుంది జగతి.
సీన్ కట్ చేస్తే రిషి సార్ నన్ను అర్థం చేసుకోవాలి, ఆయన చేతులతో ఆయనే నన్ను దగ్గరికి తీసుకోవాలి అందుకే ఏంజెల్ తో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేయించాను అనుకుంటుంది వసుధార. మరోవైపు అందంగా ముస్తాబై ఉంటుంది ఏంజెల్. ఇంటికి వచ్చిన రిషితో నీకోసం సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అంటుంది. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.