Guppedantha Manasu: వసుధార, రిషీ రొమాంటిక్ సీన్.. స్కూటీపై షికారు!
Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 6వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..రిషి, వసుధారని తన పక్కన వచ్చి కూర్చోమని చెప్తాడు. అప్పుడు వసుధార చేతిలో ఉన్న జామపండును తింటూ ఉండగా వసు ఆపి, అలా కాదు సార్ దీన్ని ఉప్పు కారం పెట్టి నంచుకుని తినాలి అని తినడం నేర్పిస్తుంది. అప్పుడు రిషి ఇంకేమైనా ఉన్నాయా? మర్చిపోయావా? ఇది ఏ పొలంలో పండుతాది, ఏ సమయంలో పండుతాది అవి కూడా చెప్పు ఇంకా నా అని అంటాడు. అప్పుడు ఉప్పు కారంతో జామకాయ తినేసరికి రిషికి పొలమారగా,వసు మంచినీళ్లు ఇచ్చి మీరు మాములుది తినండి సార్ నేను ఉప్పు కారం వేసుకుని తింటాను అని అంటుంది.
ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు రిషి వసుతో, నువ్వు నీ బైక్ ని వాళ్ళకి ఇచ్చేయ్ వసుధార.నువ్వు నడుపుతూ ఒక్కదాన్నే వెళ్తే నాకు భయంగా ఉంది అని అనగా, పర్లేదు సార్ ఉంచుకుంటాను. ఆటోలో వెళ్లడం కన్నా ఇది బానే ఉంటుంది కదా, ఇంక కార్లు అంటారా అవి పెద్దయ్యాక చూద్దాము. ఈ కార్ల మీదే నాకు మోజు లేదు అని అనగా, నా కార్లు మీ కార్లు కావా వసుధార అని రిషి అంటాడు. అది పెళ్లయిన తర్వాతే హక్కు ఉంటది కదా సార్ ఇప్పుడు మన మధ్య ఒక సమస్య వచ్చింది కదా అని అంటుంది వసుధార.
రిషి కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోతాడు. జగతి మేడం విషయం ఎత్తేసరికి కోపం వచ్చింది ఎలా మార్చాలో సార్ నీ అని వసు అనుకుంటూ నడుస్తు బండి దగ్గరకు వెళుతూ ఉండగా రిషి వచ్చి, నా కార్ పంచర్ అయింది అని అంటాడు.అవునా అని వసు అనగా నేను నీలా కాదు,కావాలని పంచర్ చేయడానికి కావాలంటే వెళ్లి చూసుకో అని అనగా వద్దులెండి సార్ రండి బయలుదేరుదాము అని వసూలు డ్రైవ్ చేస్తాను అంటుంది. దానికి రిషి నేను బండి నడుపుతాను నాకు నీ మీద నమ్మకం లేదు అని అనగా వద్దు సార్ నేను నడుపుతాను అని వసు అంటుంది.
అప్పుడు రిషి,వసుకి వెనకాతల రివర్స్‌లో కూర్చుని ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా సర్ మిమ్మల్ని బండిమీద ఎక్కించుకొని డ్రైవ్ చేస్తే నాకు చాలా గర్వంగా ఉంది సార్ అని అంటుంది. కానీ పక్కన స్కూల్లో వెళ్తున్న వాళ్ళు, దారిన చూసే వాళ్ళందరూ రిషి ని చూసి, చూడరా ఎలా కూర్చున్నాడు అని నవ్వుతూ ఉంటారు. అప్పుడు రిషి,వసు ని బండి ఆపమని చెప్పి తనే డ్రైవ్ చేస్తాడు. అలా వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత, వసు లోపలికి రావచ్చు కదా సార్ అని మనసులో అనుకుంటుంది. అప్పుడు రిషి,నన్ను పిలవచ్చు కదా అని మనసులో అనుకుంటాడు.
వసు మనసులో అనుకున్న సరే బయటకు పిలవదు అప్పుడు రిషి వెళ్తూ ఉండగా ఆగి వెనక్కి వచ్చి ఉదయం వసుధార వదిలేసిన చాక్లెట్ ఇస్తాడు. ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు వసు, ఉంటాను అనొచ్చు కదా సార్ అని అనుకుంటుంది. ఆ తర్వాత చాక్లెట్ నీ చూస్తూ వసు తన గదిలో కూర్చుని ఉండగా రిషి మళ్లీ అక్కడికి వస్తాడు. అప్పుడు వసు రిషిని కూర్చోబెట్టి మంచినీళ్లు ఇస్తుంది. అప్పుడు రిషి, వసూ చేయ పట్టుకుని తనని కూడా కూర్చోబెట్టి నీతో మాట్లాడాలి అని చెప్పి, ఎగురుతున్న పక్షికి రెక్కలు తెగితే ఎలాగ అలమటిస్తుందో అలా ఉన్నది వసుధార నా పరిస్థితి.
చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉండటం వల్ల ఏదో తెలియని వెలతి ఉండేది. నువ్వు వచ్చిన తర్వాత బాగుందనుకుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. నువ్వు కూడా ఇలా ఉన్నావేంటి వసుధార అని అనగా వసు ఏడ్చేస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని రిషి అనగా, ఇది ఏడుపు కాదు సార్ ఆనందం. మీరు మీ మనసులో నా స్థానం చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా పరీక్షలు అయిపోయిన తర్వాత అమ్మ,నాన్నలు దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను.
ఫలితాలు వచ్చేవరకు ఉందామని నాకు నేను నచ్చ చెప్పుకున్నాను కానీ అప్పుడైనా ఇంటికి వెళ్తానో లేదో నాకు నమ్మకం లేదు. ఇదే ప్రేమంటే అసలు ఏం మాయ చేసారు సార్ నన్ను వెళ్ళనివ్వకుండా అని అంటుంది వసు.అప్పుడు రిషి, నువ్వు నన్ను అడుగుతున్నా వసుధార, ఆ మాయే నాకు ఉంది. ఏ మాయ చేసావు నన్ను ఇలా చేస్తున్నావు. మనిద్దరం ఇంత చక్కగా బాగున్నాను కదా అలాగే జీవితకాలం ఉంటాము అని అనుకుంటే మధ్యలో ఎందుకు ఈ దూరం అని అనగా, మీరు జగతి మేడంని అమ్మా అని పిలవడానికి ఎందుకు ఒకసారి సంకోచిస్తున్నారు.
అసలు మేడమ్ మిమ్మల్ని ఏ పరిస్థితిలో వదిలేయవలసి వచ్చింది తెలుసా అని అనగా, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్లిపోయారో తెలుసా వసుధార? ఇంకా విషయం గురించి వదిలేయు అనగా వసు, పిలవచ్చు కదా సార్! జగతి మేడం మీ ప్రేమ కోసం అలమటిస్తున్నారు అని అనగా, రిషి కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!