Guppedantha Manasu: గౌతమ్ పై రిషి సీరియస్.. వసుధారకి సపోర్టుగా నిలిచిన రిషి?
Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 16 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార సర్ మీకు మహేంద్ర సర్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలిస్తే చెప్పండి సార్ అని అనడంతో వెంటనే గౌతమ్ చూడు వస్తదా రా ఈ మాట నా ముందు అన్నావు కాబట్టి సరిపోయింది రిషి ముందు అనకు వాడు నా పీక పిసికేస్తాడు అని అంటాడు. మీరు ఒక్కటైతే వస్తారేమో అనిపించింది అందుకే చెప్పాను అంటాడు గౌతం. అప్పుడు మీరు ఎలా అనుకుంటారు సార్ మేడం వాళ్ళు లేకుండా మేము ఎలా ఒకటవుతాం మేడం కోసం మీడియా ఇంటర్వ్యూనే వాయిదా వేసిన దాన్ని నేను అని అంటుంది వసుధార. అప్పుడు ఏంటి వసుధార నువ్వు ఇంటర్వ్యూ పోస్ట్ ఫోన్ చేసావా ఎందుకు అని అడగడంతో నా విజయంలో జగతి మేడం పాత్ర కూడా ఉంది సార్.
జగతి మేడం వచ్చేవరకు నేను ఇంటర్వ్యూ ఇవ్వను అని అంటుంది. వసుధార మాటలకు గౌతమ్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు గౌతమ్ అటు వాడు అంకుల్ కోసం ఇటు నువ్వు మీ మేడం కోసం ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఎదురు చూస్తారు అని అంటాడు గౌతమ్. అప్పుడు వసుధార మేడం వచ్చేంత వరకు ఎదురు చూస్తూనే ఉంటాను సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు మీడియా ప్రతినిధి రిషికి ఫోన్ చేసి ఇంటర్వ్యూ వాయిదా వేయమని చెప్పింది అనడంతో రిషి ఆశ్చర్యపోతాడు. పొగరుకు అసలు బుద్ధి లేదు.ఇంటర్వ్యూ వాయిదా వేయడం ఏంటి అని వసుధార మీద కోపంతో అక్కడికి వెళ్తాడు.
మరొకవైపు వసుధార ఇంటికి వెళుతూ ఉంటుంది. రిషి వెళ్తుండగా గౌతమ్ ని ఎదురుపడటంతో వసుధర కనిపించిందా అని అనగా ఇంటికి వెళ్లిపోయింది అని అంటాడు గౌతమ్. అప్పుడు ఇప్పుడే వసుధారతో మాట్లాడి ఒక సలహా ఇచ్చాను అని అసలు విషయం చెప్పడంతో వెంటనే రిషి ఇది కాలేజీ కాబట్టి సరిపోయింది లేకపోతే నేను చెంప చెల్లుమనిపించే వాడిని అని రిషి కోపంతో మాట్లాడుతాడు. చెత్త ఆలోచనలు మనసులో నుంచి తీసేయ్ అని గౌతమ్ ని తిడతాడు రిషి. అప్పుడు అక్కడి నుంచి వసుధార దగ్గరికి బయలుదేరుతాడు రిషి.
మరొకవైపు వసుధార అమ్మవారి ముందు నిలబడి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇది ఎందుకు మమ్మల్ని ఇంకా ఎన్ని కష్టాలు పెడుతున్నావు. విశేషాలు కోసం నేను నిన్ను ఎన్నిసార్లు ప్రాధేయపడ్డాను అని అమ్మవారితో తన బాధలు చెప్పుకుంటూ ఉంటుంది. ఇదే న్యాయం తల్లి నీకు అనీ జగటీ దంపతులు ఎక్కడున్నా వచ్చేలా చెయ్యి అని అమ్మవారనీ వేడుకుంటూ ఉండగా ఇంతలో రిషి అక్కడికి రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది వసుధార. నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎవరు చెప్పారు సార్ అనటంతో నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటావు అని నా మనసు చెప్పింది అంటారు రిషి.
అపుడు వారిద్దరు ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వసుధార చెయ్యి పట్టుకొని రిషి ఒక చోటికి పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు రిషి వసుధార ఒకచోట మాట్లాడడానికి కారు ఆపుతారు. అప్పుడు రిషి వసుధార ఎందుకు ఇంటర్వ్యూ వాయిదా వేశావు అని అంటాడు. నువ్వు అనుకున్నది సాధించావు. నీ గురించి ప్రపంచం మొత్తం తెలియాలి అని అంటాడు రిషి. నీ ఇంటర్వ్యూ చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు అని వసుధారకి నచ్చ చెబుతాడు రిషి. అప్పుడు ఇంటర్వ్యూ వద్దు ఇవ్వను అనడం సరైనది కాదు వసు అని అనగా వసుధార మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.
అప్పుడు వసుధార సార్ నా జీవితంలో అడుగడుగునా జగతి మేడం తోడు ఉండి నాకు సహాయపడింది అని అంటుంది. అటువంటి మేడం నా పక్కన లేకుండా నా గురించి నేను చెప్పుకోవడం అంటే అది అసంపూర్ణం సార్ అని అంటుంది. అప్పుడు వసుధార జగతి గురించి ఎమోషనల్ గా మాట్లాడుతుంది. అప్పుడు వసుధార ఎమోషనల్ అవడంతో రిషి కన్నీళ్లు తుడుస్తాడు. వెంటనే వసు రిషి ని హత్తుకుంటుంది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరుతారు. మరొకవైపు ఫణింద్ర గౌతమ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇంత జరుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు అనటంతో గౌతం కావాలనే ఫణీంద్రకు అబద్ధాలు చెబుతాడు. అప్పుడు పనింద్ర పోలీస్ స్టేషన్ అనటంతో గౌతమ్ వద్దు అని టెన్షన్ పడతాడు. అప్పుడు పనింద్ర నువ్వు ఈ పరిస్థితులలో రిషికి తోడుగా ఉండాలి అనడంతో లేదు పెద్దనాన్న రిషి నీ వసుధార ఎంతో బాగా చూసుకుంటటోంది వసుధార చూస్తే నాకు సంతోషమేస్తుంది అనడంతో ఇంతలోనే అక్కడికి రిషి వసుధార లు వచ్చి ఫణింద్రను మాట్లాడిస్తారు. అప్పుడు రిషి జగతి వాళ్ల గురించి కావాలని నన్ను దూరం పెట్టి నన్ను బాధ పెడుతున్నారు దూరంగా ఉంటున్నారు అని బాధపడతాడు రిషి.