- Home
- Entertainment
- Guppedantha Manasu: దగ్గరవుతున్న వసుధార, రిషి.. వసుకు చీరను కానుకగా ఇచ్చిన మినిస్టర్?
Guppedantha Manasu: దగ్గరవుతున్న వసుధార, రిషి.. వసుకు చీరను కానుకగా ఇచ్చిన మినిస్టర్?
Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు ఫిబ్రవరి 9వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో వసు రిషికి కాఫీ ఇవ్వగా కాఫీ తాగి బాగుంది అని అంటాడు రిషి. అప్పుడు వసుధార ఇలా బయటకు వచ్చి కాఫీ తాగితే చాలా బాగుంటుంది కదా సార్ అని అనడంతో నీతో ప్రతి ఒక్కటి బాగుంటుంది వసుధార కానీ అవి శాశ్వతం కాదు కదా అని మనసులో అనుకుంటూ ఉండగా అప్పుడు వసుధార ఏంటి ఎండీ గారు ఆలోచిస్తున్నారు అనడంతో మాటిమాటికీ అలా పిలవకు అంటాడు రిషి. ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు కలిసి ఒక ఊరికి వెళ్తారు. అప్పుడు వసుధార ఊర్లో వాళ్లకు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి వివరిస్తూ ఉంటుంది. నా పేరు వసుధార, ఈయన రిషి సార్ జెంటిల్మెన్ అని అంటుంది. రిషి సార్ అంటే మామూలు వ్యక్తి కాదు గొప్ప వ్యక్తి ఈ డీబీఎస్టీ కాలేజ్ ఎండి మై డార్లింగ్ అని అంటుంది.
ఏంటి వసుధార ఇలా మాట్లాడుతుంది ఎలా అర్థం చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడు వసుధార మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి గొప్పగా వివరిస్తూ ఉంటుంది. ఆ ఊరు జనాలకు రిషి గొప్పతనం గురించి వివరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రిషి కూడా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి వివరిస్తూ ఉంటాడు. అప్పుడు రిషి ఇందాక వసుధార గారు మాట్లాడారు ఇప్పుడు నేను ఆవిడ గొప్పతనం గురించి చెబుతాను ఆవిడ ఎంత గొప్పవారు అంటే ఆవిడ ఆలోచనలు మనకు అంతు పట్టవు అని అంటాడు రిషి. ఆ తర్వాత వసుధార రిషి ఇద్దరు కలిసి ఆ కిట్ లను అక్కడున్న పిల్లలకు ఇస్తూ ఉంటారు. అప్పుడు వసుధార సంతోష పడుతూ ఉంటుంది. ఇంతలోనే ఒక అతను సార్ మీరు మా కోసం ఇంతలా ఖర్చు పెడుతున్నారు.
మా ఇంట్లో భోజనం చేసి వెళ్లండి అనడంతో రిషి పర్లేదు మేము బయట తింటాము అని అంటాడు. అప్పుడు అతను బలవంతం చేయడంతో సరే మీరు వెళ్ళండి అంటాడు రిషి. ఇద్దరు కాసేపు మౌనంగా ఉంటారు. అప్పుడు వసుధార చాక్లెట్ తిందామా కానీ ఒకటి ఉంది అనడంతో అప్పుడు రిషి ఆ చాక్లెట్ తీసుకుని ఒక్కడే తింటాడు. అప్పుడు వసు సంతోష పడుతూ ఉంటుంది. ఆ తర్వాత వసుధార,రిషి ఇద్దరు కలిసి భోజనం చేయడానికి వెళ్తారు. అప్పుడు వసుధర ఆ వంటలు కాంబినేషన్ బాగుంటుంది అని పొగుడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార పదేపదే రిషి సార్ అంటుండగా తాళి కట్టిన భర్తను అలా పిలవకూడదు ఏవండీ,ఏమయ్యా అని పిలవాలి అని అంటుంది ఒక ఆమె.
అప్పుడు వసుధార రిషి వైపు చూసి ఏమయ్యా అనడంతో రిషి షాక్ అవుతాడు. అప్పుడు వసుధార మనసులో సంతోషపడుతూ ఉంటుంది. రాగి ముద్ద ఎలా తినాలో రిషికి నేర్పిస్తూ ఉంటుంది. తర్వాత రిషి వసుధార వెళ్ళొస్తామండి అనడంతో సరే సార్ మళ్లీ సంవత్సరం వచ్చే నాటీకి మీరు పాపతోనే బాబుతో రావాలి అనడంతో రిషి ఆశ్చర్యపోగా వసుధార సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడు రిషి జరిగిన విషయాలు తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వసుధార జరిగిన విషయాలకు సార్ కోపంగా ఉన్నట్లున్నాడు పడుకోవడం బెటర్ అని అనుకొని నిద్రపోతూ ఉండగా నన్ను ఇంతలా బాధపెట్టి ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావ్ వసుధార అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వసుధార పడుకోవడంతో కావాలని కారు సడన్ గా బ్రేకులు వేస్తూ ఉంటాడు.
అప్పుడు వారిద్దరు సరదాగా పోట్లాడుకుంటూ ఉంటారు. రిషి సార్ నన్నే పొగరు అంటారు కానీ నాకంటే పొగరు రిషి సార్ కి ఎక్కువ ఉంది అనుకుంటూ ఉంటుంది వసుధార. ఇంతలోనే మినిస్టర్ ఫోన్ చేయడంతో సర్ మనం అక్కడికి వెళ్లాలి అని అంటుంది. ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు కలిసి మినిస్టర్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు వసుధార మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి వివరిస్తూ ఉండగా రిషి మినిష్టర్ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడు మినిస్టర్ వసుధార ప్లాన్ ని విని సంతోషపడుతూ ఇంకేమి చెప్పొద్దమ్మా ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే నాకు చెప్పకుండా చేయండి అని అంటాడు. అప్పుడు మినిస్టర్ వసుధార కోసం ఒక చీర తెప్పించి ఇస్తాడు. పెళ్లి అయ్యింది అంట కదా నాకు తెలియదు అని చెప్పి వసుధారకు ఆ చీరను కానుకగా ఇస్తాడు.
అప్పుడు మినిస్టర్ కోరిక మేరకు మినిస్టర్, రిషి చేతుల మీదుగా వసుధార చీరను తీసుకుంటుంది. అప్పుడు వసుధార సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు మినిస్టర్ మీ ఆయన ఏం చేస్తుంటారు అనడంతో మా ఆయన చాలా గొప్ప వ్యక్తి సార్ అనగా మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రావాలి అనడంతో తప్పకుండా సార్ అని అంటుంది. అప్పుడు రిషి సార్ ని కూడా పిలుచుకొని వస్తాను సార్ అనడంతో మంచిది అవును వసుధార మీ ఆయన కు రిషి సార్ ని పరిచయం చేసావా అని అడుగుతాడు మినిస్టర్.