Guppedantha Manasu: టాపిక్ డైవర్ట్ చేసిన మహేంద్ర.. మద్యం మత్తులో డాన్స్ చేస్తున్న రిషి దంపతులు!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో టాప్ టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంటుంది. బాధలో ఉన్న తండ్రిని తిరిగి మామూలు స్థితికి తేవాలని తపన పడుతున్న ఒక కొడుకు కథ ఈ సీరియల్. ఇక ఈరోజు అక్టోబర్ 23 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో శైలేంద్ర గురించి ఆధారాలు సంపాదించి రిషి సార్ కి ఇస్తే వాళ్ల సంగతి ఆయనే చూసుకుంటారు అంటుంది వసుధార. అవునమ్మా వాళ్ళని అసలు వదిలి పెట్టకూడదు అంటాడు మహేంద్ర. అప్పుడే అక్కడికి వచ్చిన రిషి ఏంటి మాట్లాడుకుంటున్నారు డాడీ మీరు, ఎవరిని వదిలి పెట్టకూడదు అని అడుగుతాడు. వెంటనే టాపిక్ మార్చేస్తాడు మహేంద్ర.
ఎందుకు వసుధారని ఒంటరిగా వదిలేసావు, అసలే రోజులు బాగోలేదు ఇప్పుడే ఇద్దరు ఆకతాయిలు వచ్చి తనని ఇబ్బంది పెడుతుంటే, సమయానికి నేను వచ్చాను లేదంటే ఎంత ప్రమాదం. అయినా నువ్వు కూడా రిషి ని వదిలేసి ఒంటరిగా తిరగద్దు అని వసుధారకి చెప్తాడు మహేంద్ర. కొడుకు చేతిలో కోడలు చేయి పెట్టి జీవితాంతం ఈ చేయి విడిచిపెట్టొద్దు మాలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అంటాడు.
మీకు ఈ పరిస్థితి రావటానికి ఏ కారణం నేనే కదా అని బాధపడతాడు రిషి. అలా ఎందుకు అనుకుంటున్నావు రిషి అయినా ఆనందంగా గడపడానికి వచ్చి ఇలా బాధపడటం ఏంటి, రండి మిమ్మల్ని ఒక దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పే రిసార్ట్లో దింసా డాన్స్ చేస్తుంటే అక్కడికి వెళ్లి వాళ్లతోపాటు దింసా డాన్స్ చేస్తారు మహేంద్ర వాళ్ళు. మధ్యలో అలసిపోయిన మహేంద్ర మంచినీళ్లు తాగి వస్తానని చెప్పి పక్కకి వచ్చేస్తాడు.
ఈ లోపు ఏదో ఫోన్ రావటంతో బాటిల్ అక్కడే వదిలేసి ఫోన్ మాట్లాడటానికి వెళ్తాడు మహేంద్ర. ఈలోపు అలసిపోయిన రిషి వసుధారలు వచ్చి ఆ వాటర్ బాటిల్ లో ఉన్న వాటర్ తాగుతారు. వాటర్ టేస్ట్ డిఫరెంట్ గా ఉంది కానీ టేస్ట్ బాగుంది అంటూ ఇద్దరూ కలిసి బాటిల్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఫోన్ మాట్లాడి వచ్చిన మహేంద్ర షాక్ అవుతాడు. ఏంటి బాటిల్ మొత్తం ఖాళీ చేసేసారా అని అడుగుతాడు.
అయితే ఆ వాటర్ లో ఆల్కహాల్ కలిపి పెట్టుకుంటాడు మహేంద్ర. ఆ విషయం రిషి వాళ్లకు తెలియదు. ఏంటి అలా అడుగుతున్నారు మేము తాగింది మంచినీళ్లే కదా, ఈ నీళ్లు చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకొక బాటిల్ తీసుకురండి అంటుంది వసుధార. ఇప్పుడు కుదరదు, పదండి వెళ్లి పడుకుందాం అంటాడు మహేంద్ర. మీరే ఇక్కడ తీసుకువచ్చారు మళ్ళీ అప్పుడే మీరే వెళ్ళిపోదాం అంటున్నారు.
అదేమీ కుదరదు కాసేపు డాన్స్ చేద్దాం అని చెప్పి ఒళ్ళు తెలియని మైకంతో పిచ్చిపిచ్చిగా ఇద్దరు డాన్స్ చేస్తారు. తర్వాత మహేంద్ర ఇద్దరిని తీసుకువెళ్లి పడుకోబెడతాడు. పొద్దున్నే లేచిన రిషి, వసుధార ఇద్దరు ఓకే బెడ్ మీద ఉండడం చూసుకొని షాక్ అవుతారు. మనం ఏంటి ఇలా ఒకే బెడ్ మీద ఉన్నాము అనుకుంటారు. రాత్రి డాన్స్ చేసినట్లుగా, గట్టిగట్టుగా అరిచినట్లుగా అనిపిస్తుంది అనుకుంటారు.
మళ్ళీ మనిద్దరం డీసెంట్ కదా అలా చేసి ఉండము అనుకుంటారు. తర్వాత తలంతా డిమ్ముగా ఉంది ఫుడ్ పాయిజన్ జరిగిందా అని అనుకుంటారు, మళ్ళీ అలా జరిగే ఛాన్స్ ఉండదు అనుకుంటారు. వాళ్లు కన్ఫ్యూజన్లో ఉండగానే నాకు తల బాగా నొప్పిగా ఉంది కాఫీ పెట్టి తీసుకు వస్తాను ఈ లోపు మీరు ఫ్రెష్ అవ్వండి అని చెప్పి బయటికి వెళ్తుంది వసుధార. తరువాత కాఫీ తీసుకువచ్చిన వసుధారతో డాడీ కాఫీ తాగారా అని అడుగుతాడు రిషి.
నాకు మావయ్య కనిపించలేదు అంటుంది వసుధార. ఎక్కడికి వెళ్లి ఉంటారు మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్లరు కదా వెళ్లి రిసెప్షన్లో అడుగుదాం అని చెప్పి అక్కడికి వెళ్లి అడుగుతారు. అక్కడ మేము ఎవరిని చూడలేదు అని చెప్పటంతో ఇద్దరూ వెతకడం ప్రారంభిస్తారు. అయితే మహేంద్ర ఫుల్ గా తాగేసి రోడ్లమీద తిరుగుతూ ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.