హీరోయిన్ల కంటే వెనుకబడిపోయిన పాన్ ఇండియా స్టార్.. ఒక్కొక్కరి ఆస్తులు చూస్తే బాబోయ్ అనాల్సిందే
భారత చలనచిత్ర చరిత్రలో వెండితెరకి ఏలిన నటీమణులు ఎందరో ఉన్నారు. నటనలో గొప్ప కీర్తి పొందిన వారు ఉన్నారు. కానీ అందరూ సంపన్నులు కాలేకపోయారు. మహానటి సావిత్రిలా ఉన్న ఆస్తిని పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు.
భారత చలనచిత్ర చరిత్రలో వెండితెరకి ఏలిన నటీమణులు ఎందరో ఉన్నారు. నటనలో గొప్ప కీర్తి పొందిన వారు ఉన్నారు. కానీ అందరూ సంపన్నులు కాలేకపోయారు. మహానటి సావిత్రిలా ఉన్న ఆస్తిని పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు.
కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే వందల కోట్లు పోగేసుకున్నారు. ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ల జాబితా ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ ఎవరో సులభంగా ఊహించవచ్చు. కానీ ఆమె ఆస్తులని మాత్రం అంచనా వేయడం అంత సులభం కాదు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ల జాబితాలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అగ్ర స్థానంలో ఉంది. ఐశ్వర్యారాయ్ ఏకంగా 860 కోట్ల విలువైన ఆస్తులతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా ఎంత పాపులర్ అయిందో అందరికి తెలుసు. అదే విధంగా ఆమె కార్పొరేట్ ఎండార్స్మెంట్ విషయంలో కూడా చాలా కాలం తిరుగులేని విధంగా కొనసాగింది.
సినిమా రెమ్యునరేషన్ అయినా, వాణిజ్య ప్రకటనలు అయినా ఆమె ఒక దశలో స్టార్ హీరోలని మించి కూడా రెమ్యునరేషన్ అందుకునేది. అందుకే ఇంతలా ఆస్తులు పోగేయగలిగింది. ఐశ్వర్యారాయ్ ఒక్కో చిత్రానికి 10 కోట్లకి పైగా రెమ్యునరేషన్ తీసుకునేది. అదే విధంగా వాణిజ్య ప్రకటనలకు కేవలం ఒక్క రోజుకు 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ కంటే దాదాపు 3 రెట్లు ధనవంతురాలు. అభిషేక్ ఆస్తుల విలువ 280 కోట్లు మాత్రమే.
ఐశ్వర్యారాయ్ తర్వాతి స్థానంలో ఉన్న హీరోయిన్ ప్రియాంక చోప్రా. గ్లోబల్ బ్యూటీగా ఎదిగిన ప్రియాంక ఆస్తుల విలువ 650 కోట్లు. ఆ తర్వాతి స్థానంలో అలియా భట్ ఉంది. ఆమె ఆస్తుల విలువ 570 కోట్లు. వీరితో పోల్చుకుంటే దీపికా పదుకొనె కాస్త వెనుకబడింది. దీపికా పదుకొనె ఆస్తుల విలువ దాదాపుగా 500 కోట్లు.
ఆ తర్వాతి స్థానాల్లో కరీనా కపూర్ 480 కోట్లతో.. కత్రినా కైఫ్ 250 కోట్లతో ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న ఏకైక సౌత్ హీరోయిన్ నయనతార మాత్రమే. నయనతార ఆస్తుల విలువ 200 కోట్లు. ఐశ్వర్యారాయ్, ప్రియాంక, అలియా లాంటి హీరోలతో పోల్చుకుంటే.. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోలు ఆస్తుల విషయంలో బాగా వెనుకబడిపోయారు. ప్రభాస్ ఆస్తుల విలువ 200 కోట్లు కాగా రణ్వీర్ సింగ్ 500 కోట్ల ఆస్తులకు అధిపతి. రణ్వీర్ సింగ్ వాణిజ్య ప్రకటనలు ఎక్కువగా చేస్తుంటారు. ప్రభాస్ వాణిజ్య ప్రకటనలకు దూరం.