సుశాంత్ ద్వారా తల్లిని కావాలనుకున్నా, సంచలన విషయాలు బయటపెట్టిన రియా..!
సుశాంత్ మరణం తరువాత ఆయన ప్రేయసి రియా చక్రవర్తి పేరు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ముద్దాయిగా ఆమె అనేక ఆరోపణలు ఎదుర్కొంటుండగా మొదటిసారి మీడియా ముందుకు వచ్చి సంచలన విషయాలు బయటపెట్టింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి రెండు నెలలు దాటిపోతుంది. ఈ కేసు ప్రధానంగా ఆయన మాజీ ప్రేయసి రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతుంది. సీబీఐ విచారణ తరువాత కేసులో మరిన్ని కోణాలు బయట పడుతుండగా రియా చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. రియా చక్రవర్తి తన కొడుకు సుశాంత్ ని విషం పెట్టి చంపిందని కె కె సింగ్ ఆరోపిస్తున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో తాజాగా డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూసింది. సుశాంత్ గంజాయి సేవించేవాడని ఆయన దగ్గర పనిచేసిన వంట మనిషి సీబీఐ విచారణలో వెల్లడించడంతో ఆ కోణంలో విచారణ జరుపగా, రియా చక్రవర్తి కొందరు డ్రగ్ డీలర్లతో సంబంధాలు కలిగి ఉందన్న విషయం బయటికి వచ్చింది.
డ్రగ్ డీలర్ గా భావిస్తున్న జయ సాహా అనే వ్యక్తితో రియా చక్రవర్తి నిషేధిత డ్రగ్స్ గురించి వాట్స్ అప్ చాట్ చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి. జయ సాహా ఆమెకు కొన్ని డ్రగ్స్ ఉపయోగించే విధానం తన చాట్ లో విపులంగా చెప్పడం జరిగింది.
రోజుకో కొత్త కేసులో ఇరుకుంటున్న రియా చక్రవర్తి మొదటి సారి మీడియా ముందుకు వచ్చారు. ఆమె ఓ ప్రముఖ ఛానెల్ లో సుదీర్ఘ ప్రసంగం చేశారు. కొన్ని సంచల విషయాలు ఆమె బయటపెట్టడం జరిగింది. సుశాంత్ తో పాటు యూరప్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు హోటల్ లో ఆయన వింతగా ప్రవర్తించాడట. అలాగే డాక్టర్స్ సూచనలు లేకుండానే డిప్రెషన్ కోసం మెడిసిన్ వాడేవారట.
దానితో పాటు తాను శుశాంత్ ని ఎంతగానో ప్రేమించానని ఆమె చెప్పింది. సుశాంత్ తో తాను ఓ కొడుకును కనాలని ఆశపడినట్లు చెప్పి ఆమె సంచలనానికి తెరలేపింది. విలాస వంతమైన జీవితం కోరుకునే సుశాంత్ ఓ కంపెనీ నెలకొల్పి తన తమ్ముడు మరియు తనకు ప్రాతినిథ్యం ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది.