- Home
- Entertainment
- ఆర్జీవీ రూ.20 కోట్ల వరకు అప్పులపాలయ్యాడు..పేమెంట్ ఇస్తే చాలు, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
ఆర్జీవీ రూ.20 కోట్ల వరకు అప్పులపాలయ్యాడు..పేమెంట్ ఇస్తే చాలు, మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే. రాంగోపాల్ వర్మకి ఏ విషయంలోనూ ఎమోషన్స్ ఉండవు. ప్రతి విషయాన్ని వర్మ లైట్ తీసుకుంటూ లైఫ్ ని బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి అందరికి తెలిసిందే. రాంగోపాల్ వర్మకి ఏ విషయంలోనూ ఎమోషన్స్ ఉండవు. ప్రతి విషయాన్ని వర్మ లైట్ తీసుకుంటూ లైఫ్ ని బిందాస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో వర్మ ఎన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా వాటిని సమర్థించుకునే నైపుణ్యం కూడా వర్మ దగ్గర ఉంది.
ఇటీవల కాలంలో వర్మ ఎక్కువగా ఏపీ రాజకీయాల్లో కాంట్రవర్షియల్ అంశాలని మరింత కాంట్రవర్సీగా మార్చి సినిమాలు తీయడం చూస్తూనే ఉన్నాం. లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు, పవర్ స్టార్ ఇలా వివాదాస్పద చిత్రాలు చేస్తూ కొందరిని టార్గెట్ చేయడం చూస్తున్నాం. దీనితో వర్మ వైసిపి మద్దతు దారుడిగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వర్మ ఏపీ రాజకీయాలపై వ్యూహం అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ చిత్రం వైసిపికి అనుకూలంగా.. పవన్ కళ్యాణ్ లాంటి వారిని టార్గెట్ చేసే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గార్లపాటి వెంకటేష్ అనే వ్యక్తి గతంలో వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి మానేశాడు. తాజాగా గార్లపాటి వెంకటేష్ వర్మ ఇటీవల తెరకెక్కిస్తున్న చిత్రాలు, యూట్యూబ్ లో చేస్తున్న వీడియోల గురించి సంచలన ఆరోపణలు చేశాడు.
వెంకటేష్ మాట్లాడుతూ.. వర్మ తిక్క పనులన్నీ చేసి దాదాపు రూ.20 కోట్ల వరకు అప్పులపాలయ్యారు. ఆ అప్పు తీర్చేందుకు వర్మ దగ్గర డబ్బు లేదు. దీనితో వైసిపి నాయకులు కొందరు వర్మని వాడుకుని ఇలాంటి సినిమాలు చేయమని ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళిచ్చే పేమెంట్ కి వర్మ బాగా అలవాటు పడ్డాడు. పేమెంట్ ఇస్తే చాలు వర్మ ఎవరిపైన అయినా విషం కక్కుతాడు.
అప్పట్లో వైసిపి నాయకులు కొందరు నేరుగా వచ్చి వర్మతో డీల్స్ మాట్లాడడం కళ్లారా చూశాను అని వెంకటేష్ అంటున్నారు. ఇదంతా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా టైంలో జరిగింది. ఆ సమయంలో కొన్ని విభేదాల వల్ల నేను తప్పుకుని పక్కకు వచ్చేశాను. పేమెంట్స్ తీసుకుంటూ ఎలాంటి సత్యం లేకపోయినా వర్మ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారిపై విషం కక్కడం మొదలు పెట్టారు.
ఇప్పుడు అదే తరహాలో మరో విషప్రచారం చేసేందుకు వర్మ రెడీ అవుతున్నారు అని వ్యూహం మూవీ గురించి వెంకటేష్ ప్రస్తావించారు. ఇందులో చంద్రబాబు, పవన్, లోకేష్ పాత్రలు ఉండబోతున్నాయి అని చెప్పాడు. వర్మ మైండ్ సెట్ పేమెంట్ తో నిండిపోయింది. వర్మని ఒక పిల్ల బాట్ గా అభివర్ణించాడు. ఒకప్పుడు వర్మ అంటే ఆ క్రేజు వేరు.. ఇప్పుడు అంతా పోయింది. ఏదైనా చెప్పాలన్నా జంట్స్ తో మాట్లాడడు.. కేవలం ఫీమేల్ అసిస్టెంట్స్ తో మాత్రమే మాట్లాడతాడు అంటూ వెంకటేష్ గార్లపాటి పేర్కొన్నారు.