టాలీవుడ్ చిత్ర పరిశ్రమతో రేవంత్‌రెడ్డికి ఉన్న సంబంధాలు ఇవే.. ఎవరెవరు టచ్‌లో ఉన్నారంటే?
కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి తెలుగు చిత్ర పరిశ్రమతో సంబంధాలు ఉన్నాయా? ఉంటే ఎలాంటి పరిచయాలు? ఏం చేయబోతున్నారనేది ఆసక్తికంగా మారింది.
revanth reddy
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించారు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. దాదాపు 65 సీట్ల మెజారిటీని సాధించింది. కావాల్సిన దానికంటే ఐదు సీట్లు ఎక్కువగానే కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. స్పష్టమైన మెజారీటీ సాధించింది. ఈ వారంలో ఎవరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారనేది తేలనుంది. రేవంత్‌రెడ్డినే సీఎం అనే నినాదాలు ఇప్పటికే ఊపందుకున్నాయి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలిసిన వెంటనే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అప్రమత్తమయ్యింది. సినీ ప్రముఖులు రేవంత్‌రెడ్డిని కలవడం ప్రారంభించారు. రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకి దూరంగా ఉన్నారు. ఆయన సినిమా రిలేటెడ్ అంశాల్లో ఎప్పుడూ లేరు. చాలా వరకు సీరియస్ పాలిటిక్స్ లోనూ భాగమయ్యారు. మరి అనూహ్యంగా సినీ ప్రముఖులు ఆయన్ని కలవడం ఆసక్తికరంగా మారింది. రేవంత్ రెడ్డినే సీఎం అని భావించి ముందుగా ఆయన మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారని అర్థమయ్యింది.
సీఎం కంట్లో పడితే మున్ముందు తమ అవసరాలు తీర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఆల్‌రెడ్డి రేవంత్ రెడ్డిని కలిశారట. ఆయనతోపాటు మరికొందరు సినిమా ప్రముఖులు రేవంత్‌రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారని తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డికి సినిమా పరిశ్రమతో డైరెక్ట్ గా సంబంధాలు లేకపోయినా వ్యక్తులతో మాత్రం మంచి సంబంధాలే ఉన్నాయి. నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌తో ఆయనకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ గెలవాలని బండ్ల గణేష్ ఏకంగా పూజలు నిర్వహించారు. హోమాలు చేశారు.
ఇక బాలకృష్ణతోనూ రేవంత్‌రెడ్డికి మంచి సంబంధాలున్నాయని సమాచారం. రేవంత్ రెడ్డి మొదట టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో బాలయ్యతో ర్యాపో ఉందని టాక్. మరోవైపు తెలుగు చిత్ర పరిశ్రమకి టీడీపీ అనుకూలంగా ఉండేది. చాలా మంది ఇండస్ట్రీలో సినీ ప్రముఖులు టీడీపీకి అనుకూలంగా ఉంటారు. మొన్న చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ చాలా మంది స్పందించారు. ఈ నేపథ్యంలో ఇటు రేవంత్‌తోనూ ఆ సంబంధం ఉంటుందని తెలుస్తుంది. వీరితోపాటు చాలా మంది దర్శకులు, నిర్మాతలు రేవంత్ రెడ్డితో క్లోజ్‌గానే మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కె రాఘవేంద్రరావు పక్కా టీడీపీ పర్సన్. అదే రిలేషన్ రేవంత్ రెడ్డితో కొనసాగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
టీఆర్‌ఎస్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్ర పరిశ్రమకి దగ్గరగా ఉన్నారు. ఆయన టీడీపీలో ఉన్నప్పట్నుంచి చిత్ర పరిశ్రమకి దగ్గరగా ఉన్నారు. అదే టీఆర్‌ఎస్‌లోనూ కొనసాగించారు. ఇప్పుడు రేవంత్ వచ్చాక కూడా ఆ సంబంధాలు మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా? ఇతర సీనియర్లని ఎన్నుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇక కోడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. ఇక్కడ కేసీఆర్ కూడా ఓడిపోవడం గమనార్హం.