అందుకే వరుణ్ తేజ్ పెళ్ళికి వెళ్ళలేదు.. నా కళ్ళముందే పెరిగాడు కానీ, రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, గ్లామరస్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటలీలో నవంబర్ 1న అంటే నేడు వీరి వివాహ వేడుక గ్రాండ్ గా జరగనుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, గ్లామరస్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇటలీలో నవంబర్ 1న అంటే నేడు వీరి వివాహ వేడుక గ్రాండ్ గా జరగనుంది. ఇటలీలో మెగా ఫ్యామిలీ సందడితో సోషల్ మీడియాలో వరుణ్ వివాహం ట్రెండింగ్ గా మారింది.
కాక్ టెల్ పార్టీ, హల్దీ, మెహందీ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వరుణ్ తేజ్, లావణ్య వివిధ కాస్ట్యూమ్స్ లో అదరగొడుతున్నారు. కొత్త జంట ఎంతో అందంగా కనిపిస్తూ కనుల విందు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు, అల్లు అర్జున్, రాంచరణ్ దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేయిస్తున్నారు. వరుణ్ పెళ్ళికి నాలుగురోజుల ముందే వెళ్లిన పవన్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
అయితే వరుణ్ తేజ్ పెళ్లి గురించి పవన్ మాజీ సతీమణి రేణు దేశాయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం వైరల్ అవుతున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య వివివాహానికి వెళుతున్నారా అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. రేణు దేశాయ్ లేదు అని సమాధానం ఇచ్చింది.
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. నేను నిహారిక పెళ్లికి కూడా వెళ్ళలేదు కదా.. పిల్లలని పంపించాను.. వరుణ్ పెళ్ళికి కూడా వెళ్లడం లేదు. వరుణ్ తేజ్ 8 ఏళ్ల వయసు నుంచి నా కళ్ళముందు పెరిగాడు. వరుణ్ తేజ్ కి ఎప్పుడూ నా విషెస్ ఉంటాయి. నేను వెళితే అందరూ అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. కాబట్టి నేను వెళ్లడం లేదు. పిల్లలు అకిరా, ఆద్య కూడా వెళ్లడం లేదు అని రేణు ఆసక్తికర వ్యాఖలు చేసింది.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్.. అన్నాలెజినోవా తో కలసి వరుణ్ పెళ్లి కోసం ఇటలీ వెళ్లారు. మెగా ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం ఇటలీలో సందడి చేస్తున్నారు. పవన్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారు. అకిరా, ఆద్య మాత్రం తరచుగా తండ్రి వద్దకు రావడం.. ఫ్యామిలీ పార్టీలకు హాజరు కావడం చేస్తున్నారు.
రేణు దేశాయ్ రీసెంట్ గా రవితేజ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఫలితంగా రేణు దేశాయ్ పాత్రకి కూడా తగిన గుర్తింపు లభించలేదు.