'బ్యూటిఫుల్ ఆంటీ' అంటూ రేణు దేశాయ్ పై నటుడి కూతురు కామెంట్.. రిప్లై ఏమని ఇచ్చిందంటే..
రేణు దేశాయ్ తరచుగా సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టడం చూస్తూనే ఉన్నాం. తాజాగా రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో బ్లూ శారీ ధరించిన వీడియో పోస్ట్ చేసింది.
పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ సింగిల్ గానే ఉంటూ తన పిల్లల భాద్యతలు చూసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రేణు దేశాయ్ తన పిల్లల గురించి అనేక విశేషాలు పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. అకిరా నందన్, ఆద్య నెమ్మదిగా పెద్దవాళ్లు అవుతుండడంతో సోషల్ మీడియాలో వారిపై ఫోకస్ పెరుగుతోంది.
రేణు దేశాయ్ తరచుగా సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టడం చూస్తూనే ఉన్నాం. తాజాగా రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ లో బ్లూ శారీ ధరించిన వీడియో పోస్ట్ చేసింది. బ్లూ శారీ బ్లూ బొట్టు అంటూ ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చింది. చిరునవ్వులతో రేణు దేశాయ్ ఎంతో అందంగా కనిపించింది.
నెటిజన్లు అంతా తమకి తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు పవన్ ఫ్యాన్స్ అయితే వదిన బంగారమంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో అందంగా ఉన్నారంటూ ప్రశంసిస్తున్నారు. కానీ ఒక్కరి కామెంట్ మాత్రం రేణు దేశాయ్ ని ఆకర్షించింది.
సో బ్యూటిఫుల్ ఆంటీ అంటూ కామెంట్ పెట్టిన అమ్మాయికి రేణు దేశాయ్ రిప్లై ఇచ్చింది. అలా కామెంట్ చేసింది ఎవరో కాదు.. ప్రముఖ నటుడు ఉత్తేజ్ కుమార్తె పాట. పాట ఉత్తేజ్ అలా కామెంట్ చేయడంతో ఆమెకి రేణు దేశాయ్ రిప్లై ఇచ్చింది. థాంక్యూ బేబీ అని పేర్కొంది.
రేణు దేశాయ్ చివరగా రవితేజ టైగర్ నాగేశ్వర రావు చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. ఫలితంగా రేణు దేశాయ్ పాత్రకి కూడా తగిన గుర్తింపు లభించలేదు. రేణు దేశాయ్ ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో అనేక విషయాలు పంచుకుంది. పిల్లల కోసమే రెండో పెళ్లి చేసుకోలేదని.. రెండేళ్ల తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటానని పేర్కొంది.
అలాగే పవన్ కళ్యాణ్ గురించి అనేక విషయాల్లో రేణు దేశాయ్ ఓపెన్ అయింది. అకీరా నందన్ కి ప్రస్తుతం నటనపై ఆసక్తి లేదని.. తాను నటుడైతే చూడాలని ఉందని కూడా రేణు మనసులో కోరిక బయటపెట్టింది. రేణు దేశాయ్ ఇకపై మరిన్ని చిత్రాల్లో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.