ఎలా యాక్ట్ చేశారనేది కాకుండా ఎంత మందితో పడుకుందంటున్నారు.. రేణు దేశాయ్ బోల్డ్ కామెంట్స్..
రేణు దేశాయ్.. ఇప్పటి వరకు ఒక యాంగిల్ చూపించింది. ఇప్పుడు తనలోని మరో యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది. తన పర్సనల్ లైఫ్‌లోని విషయాలను ఓపెన్‌గా బయటపెడుతుంది.
రేణు దేశాయ్(Renu Desai) ఇటీవల `టైగర్ నాగేశ్వరరావు` చిత్రంలో నటించింది. కరెక్ట్ గా ఇరవై ఏళ్ల తర్వాత ఆమె బిగ్ స్క్రీన్‌పై కనిపించింది. చివరగా `జానీ` చిత్రంలో మెరిసింది రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్‌కి దగ్గరై సినిమాలకు దూరమైంది. పవన్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. ఆ తర్వాత పవన్ ని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత విడిపోయింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. వ్యక్తిగత జీవితానికే ప్రయారిటీ ఇచ్చింది.
ఇటీవల రేణు దేశాయ్ సినిమాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. `టైగర్ నాగేశ్వరరావు` చిత్రంలో ఆమె నటించడం, మీడియా ముందుకు రావడం, వరుసగా ఇంటర్వ్యూలివ్వడంతో ఆమె మళ్లీ సినిమాల్లో యాక్టివ్ అవుతుందని అంటున్నారు. అదే సమయంలో పాలిటిక్స్ లోకి కూడా వస్తుందనే కామెంట్లు వచ్చాయి. వైసీపీ నుంచి బరిలోకి దిగుతుందనే కామెంట్లు వచ్చాయి. కానీ వాటిని ఖండించింది రేణు దేశాయ్. నిజం లేదని చెప్పింది.
ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ ప్రేమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం షాకింగ్ విషయాలను బయటపెట్టింది. రేణు దేశాయ్ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ఇందులో అకీరానందన్ బర్త్ డే సమయంలో నెలకొన్న వివాదానికి క్లారిటీ ఇచ్చింది. దీంతోపాటు పవన్ కళ్యాణ్‌ని పేరుతో తమపై చేసే విమర్శలపై స్పందించింది. ప్రతి సారి మమ్మల్ని టార్గెట్ చేయడం పట్ల ఆమె ఫైర్ అయ్యింది.
Renu Desai, Jagan, Pawan Kalyan
రాజకీయంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, ఆయన్ని విమర్శించండి, ఆయన మెనిఫెస్టోని విమర్శించండి, ఆయన పొలిటికల్‌గా చేసే మిస్టేక్స్ ని విమర్శించండి, కానీ ప్రతిసారి నన్ను, నా పిల్లలను లాగడం ఏంటని ఆమె ప్రశ్నించింది. మండిపడింది. ఇది మరి ఎక్కువైపోయిందని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆమె తెలిపింది. ఈ మేరకు హెచ్చరించింది. పరోక్షంగా రేణు దేశాయ్ వైసీపీ నాయకులకు కౌంటర్ ఇచ్చిందని తెలుస్తుంది. పవన్‌ని పదే పదే మూడు పెళ్లిళ్లు అనే మ్యాటర్ తెస్తూ వైసీపీ నాయకులు విమర్శిస్తున్న రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మరోవైపు ఇందులో మహిళలపై వచ్చే కామెంట్లపై, ముఖ్యంగా సినిమా యాక్టర్స్ పై వచ్చే కామెంట్లపై రేణు దేశాయ్ స్పందించింది. అమ్మాయి లుక్‌పై కామెంట్ చేయోచ్చు, యాక్టింగ్‌పై కామెంట్ చేయోద్దు, చెత్తగా చేసింది, స్టూపిడ్‌గా చేసిందని విమర్శించొచ్చు. అవన్నీ వదిలేసి ఎంత మందితో పడుకుంది, ఇలా చేసింది, అలా చేసిందని క్యారెక్టర్ పై కి వెళ్లున్నారని, క్యారెక్టర్ అస్సాసినేషన్ చేస్తున్నారని రేణు దేశాయ్ మండి పడింది. అలాంటివి మానుకోవాలని తెలిపింది. రేణుదేశాయ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తున్నాయి.
ఇక రేణు దేశాయ్ ఇటీవల `టైగర్ నాగేశ్వరరావు` చిత్రంలో హేమలత లవణం పాత్రలో నటించింది. రియల్ లైఫ్‌లో ఉన్న పాత్ర ఆమెది. సినిమాలో చివరి పది నిమిషాల్లో వచ్చింది రేణు దేశాయ్. అయితే సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రయారిటీ ఉంటుందని అంతా భావించారు. టీమ్ కూడా అలానే చెప్పొకొచ్చింది. కానీ తీరా ఆమె పాత్ర నిడివి మరీ తక్కువగా ఉండటం, పైగా అది బలంగా లేకపోవడంతో ఆడియెన్స్ ని నిరాశ పరిచింది.