బిగ్ బాస్ 7కి షాకింగ్ రేటింగ్... జబర్దస్త్ కంటే ఎక్కువా? తక్కువా? టాప్ 10 ప్రోగ్రామ్స్ ఇవే!
బుల్లితెర పరిశ్రమలో స్టార్ మా-ఈటీవి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒకప్పుడు నంబర్ వన్ గా ఉన్న ఈటీవిని వెనక్కు నెట్టి స్టార్ ఆధిపత్యం చూపిస్తుంది. తాజాగా బార్క్ విడుదల చేసిన రేటింగ్స్ లో స్టార్ మా దూసుకుపోయింది.
Bigg Boss Telugu 7
దశాబ్దాలుగా తెలుగులో ఈటీవీదే ఆధిపత్యం. జెమినీ ఈటీవికి పోటీగా వచ్చింది. అది నిలబడలేకపోయింది. మాటీవీ, జీ తెలుగు ఎంట్రీ తర్వాత పోటీ మరింత పెరిగింది. మా టీవీ స్టార్ మా చేతికి వెళ్ళాక లెక్కలు మారిపోయారు. సీరియల్స్ తో పాటు షోలలో స్టార్ మా హవా పెరుగుతూ వచ్చింది.
Bigg Boss Telugu 7
జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలతో ఈటీవి జోరు చూపించింది. ఢీ డాన్స్ రియాలిటీ షో కూడా ఆ ఛానల్ కి ఆయువు పట్టుగా మారాయి. సీరియల్స్ లో మాత్రం స్టార్ మా పూర్తి ఆధిపత్యం చూపిస్తుంది. కార్తీక దీపం వంటి సీరియల్ స్టార్ మాకి బంగారు గనిలా మారింది. ఇక బిగ్ బాస్ షో వచ్చాక పోటీ ఇచ్చే షో ఈటీవీలో రూపొందలేదు.
అలాగే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కి ఆదరణ తగ్గింది. నాగబాబు, రోజా, అనసూయ, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వంటి స్టార్స్ ఆ షోలను వదిలివెళ్ళిపోయాక టీఆర్పీ పడిపోయింది. బిగ్ బాస్ వర్సెస్ జబర్దస్త్ అనుకుంటే... బిగ్ బాస్ టాప్ లో కొనసాగుతుంది.
Bigg Boss Telugu 7
బిగ్ బాస్ సీజన్ 5 ఘోరంగా ఫెయిల్ అయ్యింది. అందుకే సీజన్ 7 సరికొత్తగా రూపొందించారు. రికార్డు టీఆర్పీతో షో సత్తా చాటుతుంది. అక్టోబర్ 28 నుండి నవంబర్ 3 వరకు బార్క్ వెబ్ సైట్ తెలుగు టాప్ టెన్ ప్రోగ్రామ్స్ టీఆర్పీ విడుదల చేసింది. టాప్ లో బిగ్ బాస్ అండ్ స్టార్ మా షోలో కొనసాగుతున్నాయి.
బిగ్ బాస్ తెలుగు 7 వీకెండ్ 6.9 టీఆర్పీ అందుకుంది. వీక్ డేస్ లో అది 4.91 గా ఉంది. సీజన్ 6లో వీకెండ్ 3, వీక్ డేస్ లో 2 రేటింగ్ వచ్చేది. మూడో స్థానం కూడా స్టార్ మాదే. శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఆదివారం స్టార్ మా పరివార్ 4.24 టీఆర్పీతో మైండ్ బ్లాక్ చేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీ నాలుగో స్థానం దక్కించుకుంది. ఈ షో 3.54 టీఆర్పీ దక్కింది.
ఎక్స్ట్రా జబర్దస్త్ 3.34 రేటింగ్ తో ఐదో స్థానంలో ఉంది. టాప్ ఫైవ్ లో 3 స్టార్ మా, రెండు ఈటీవి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జబర్దస్త్ 3.00 టీఆర్పీ, ఢీ షో 2.46 టీఆర్పీ రాబట్టాయి. సుమ అడ్డా, అలీతో ఆల్ ఇన్ వన్, పాడుతా తీయగా టాప్ 10లో ఉన్నాయి. మొదటి పది స్థానాల్లో స్టార్ మా, ఈటీవి ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
Bigg Boss Telugu 7
బిగ్ బాస్ షో విషయానికి వస్తే మేకర్స్ ప్లాన్స్ సక్సెస్ అయ్యాయి. గత సీజన్ తో పోల్చుకుంటే రేటింగ్ డబుల్ అయ్యింది. ఇక రానున్న ఎపిసోడ్స్ మరింత కీలకం కాగా టీఆర్పీ పెరిగే సూచనలు కలవు. మొత్తంగా బిగ్ బాస్ మరోసారి తనకు తిరుగు లేదని నిరూపించుకుంది...