Bigg Boss Telugu 7: కొనసాగిన నామినేషన్ల రచ్చ, ప్రశాంత్- అర్జున్, అమర్- యావర్ మధ్య పీక్స్ కు చేరిన గొడవ..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజుకో రచ్చ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా నామినేషన్స్ రచ్చ ఈసారి రెండు రోజులు కొనసాగుతోంది. నిన్న స్టార్ట్ అయిన రచ్చ నేరు కూడా కొనసాగింది. కంటెస్టెంట్స్ మధ్య వాడి వేడి వాదనలు చోటు చేసుకున్నాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. మునుపటి సీజన్ల కంటే డిఫరెంట్ గా సీజన్ 7 నడుస్తోంది. గొడవలు తారాస్థాయికి చేరి.. కొట్టుకునే వరకూ వస్తున్నాయి. ఇప్పటికే గేమ్ 11వ వారానికి చేరగా.. నామినేషన్స్ లో గొడవల జోరు కొనసాగుతోంది. ఈ నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్- అర్జున్, అశ్వినీ -ప్రియాంక, అమర్ -యావర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
బిగ్ బస్ లో సోమవారం స్టార్ట్ అయిన నామినేషన్స్ నెక్ట్స్ డే కూడా కొనసాగుతున్నాయి, ముందు రోజు స్టార్ట్ అయిన రచ్చ.. తరువాత రోజు కూడా పెరిగిపెద్దది అయ్యింది. ఇక 11వ వారం ఇంటి నుండి ఎవరు బయటకు వెళ్లాలో తగు కారణాలు చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. శివాజీ హౌస్ కెప్టెన్ కాగా అతన్ని ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదన్నారు. రతిక... ప్రియాంక, శోభ శెట్టిలను నామినేట్ చేసింది. వారిద్దరితో రతిక సీరియస్ గా వాదించింది...
ఇక ఈరోజు నామినేషన్లలో ప్రశాంత్ అర్జున్ మద్య తీవ్ర వాగ్వాదంజరిగింది. శోభా శెట్టి - పల్లవి ప్రశాంత్ ల మధ్య కూడా రచ్చ రచ్చ జరిగింది. అశ్విని.. అమర్, ప్రియాంకలను నామినేట్ చేసింది. అయితే అశ్విని, ప్రియాంక మధ్య వాదనలు గట్టిగా జరిగాయి.ప్రియాంక తెగ ఫీల్ అవుతుంది. అందరికి ఆమె వండిపెడుతుంది అన్నభావనలో ఉంది..నేను ఒంటిచేత్తో వంట చేస్తాను అంటూ..అనసవరంగా బ్లేమ్ అయ్యింది అశ్విని. ఇక అశ్వీని అమర్ ఆమెది సిల్లీ రీజన్ అన్నాడు కానీ ప్రతిఘటించలేదు. ఇది కొంచెం ఫన్నీగా సాగింది.
కాగా యావర్.. అమర్ ఒకరిని మరొకరు నామినేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ ఎపిసోడ్ అంతా ఆ గోడవ కొనసాగింది. ఓ క్రమంలో ఇద్దరూ గొడవకు దిగాడు. కేవలం స్ప్రైట్ కోసం నన్ను యావర్ నామినేట్ చేశాడని అన్నాడు. నీ బిహేవియర్ కి చేశానని యావర్ బదులిచ్చాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఒకరిపైకి మరొకరు దూసుకెళ్లారు. ఇద్దరు కాస్త విచిత్రంగా ప్రవర్తించగా.. కెప్టెన్ శివాజీ కలుగ చేసుకుని గొడవ ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో శోభ యావర్ ను, అశ్వినీని నామినేట్ చేయగా.. ఈ ఇద్దరితో శోభ గట్టిగానే వాదించింది.
ఇక ఎలాగోలాగ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఆతరువాత దివాళి సందర్భంగా డాన్స్ లతో హోరెత్తించారు హౌస్ మెంబర్స్. అయితే నామినేషన్స్ కు సబంధించిన వేవ్స్ ఆనైట్ అంతా కొనసాగాయి. నైట్ కూడా గ్రూప్స్ గా చేరి.. నామినేషన్స్ గురించి చర్చించకోవడం మొదలు పెట్టారు. ఈక్రమంలో యావర్ కు, పల్లవిప్రశాంత్ కు శివాజీ హిత బోద చేయగా.. అమర్ ప్రియాంక మధ్య నామినేషన్స్ కు సంబధించినడిస్కార్షన్స్ జరిగాయి. ఇక హౌస్ లో 10 మంది ఉన్నారు. 10వ వారం భోలే షావలి ఎలిమినేట్ అయ్యాడు. టాప్ 10 నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూడాలి. గత మూడు వారాలుగా మేల్ కంటెస్టెంట్స్ ఇంటిని వీడుతున్న విషయం తెలిసిందే...