గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కి ప్రధాన కారణాలు ఇవే.. దెబ్బ పడింది అక్కడే..
గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ కి ప్రధాన కారణాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఈ మేరకు నెటిజన్లలో, అభిమానుల్లో వీటి గురించి చర్చ జరుగుతోంది.
- FB
- TW
- Linkdin
Follow Us

మెగా పవర్ స్టార్ రాంచరణ్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ చిత్రం ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. శంకర్ గత చిత్రాలతో పోలిస్తే గేమ్ ఛేంజర్ బాగానే ఉందని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ పెట్టిన బడ్జెట్ వెనక్కి తీసుకురావడంలో ఈ చిత్రం విఫలం అయింది. గేమ్ ఛేంజర్ ఫెయిల్యూర్ కి ప్రధాన కారణాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఈ మేరకు నెటిజన్లలో, అభిమానుల్లో వీటి గురించి చర్చ జరుగుతోంది.
అందరూ ప్రధానంగా చెబుతున్న కారణం ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రాంచరణ్ చేయాల్సింది ఇలాంటి మూవీ కాదు అని అంటున్నారు. పాన్ ఇండియా స్టార్స్ అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. జనాలు కూడా సాధారణ చిత్రాలని థియేటర్స్ లో చూడడానికి ఇష్టపడడం లేదు. కథ నేపథ్యం కొత్తగా ఉండాలి, విజువల్స్ గ్రాండ్ గా ఉండాలి.
గేమ్ ఛేంజర్ చిత్రంలో చూపించిన అంశాలు గతంలో శంకర్ చాలా చిత్రాల్లో చూపించారు. ఇతర దర్శకులు కూడా అటు ఇటుగా సామజిక అంశాలపై అనేక చిత్రాలు చేశారు. కాబట్టి ఇది ఓల్డ్ కాన్సెప్ట్. రాంచరణ్ నుంచి ఫ్యాన్స్ ఆశిస్తున్నది ఇది కాదు. గ్రాండ్ విజువల్స్ తో పాన్ ఇండియా అప్పీల్ ఉండే సరికొత్త చిత్రం.
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర చిత్రం చేశారు. ఆ చిత్రానికి టాక్ గొప్పగా ఏమి రాలేదు. కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత అంచనాలకు తగ్గట్లుగా కొరటాల శివ సముద్ర నేపథ్యంలో సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. విజువల్స్ ని గ్రాండ్ గా చూపించారు. అక్కడే మ్యాజిక్ జరిగింది. దేవర హిట్ అయింది. కానీ శంకర్ రాంచరణ్ తో కరప్షన్ నేపథ్యంలో సినిమా చేస్తున్నారు అని చెప్పగానే గేమ్ ఛేంజర్ చిత్రం తేలిపోయింది. ఇలాంటి కథలు చాలా చూసిన జనాల్లో గేమ్ ఛేంజర్ పై బజ్ పెరగలేదు.
అలాగని గేమ్ ఛేంజర్ చిత్రం బ్యాడ్ మూవీ కాదు. ఏకంగా 100 కోట్లపైగా షేర్ సాధించింది. ఇది మామూలు విషయం కాదు. కానీ ఇలాంటి చిత్రానికి 300 కోట్ల బడ్జెట్ కేటాయించడం కరెక్ట్ కాదు. 100 కోట్ల బడ్జెట్ లో నిర్మించి ఉంటే ఎలా ఉండేది.. 100 కోట్ల షేర్ వచ్చింది కాబట్టి హిట్ అనేవాళ్ళు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ సినిమాకి 300 కోట్ల బడ్జెట్ కేటాయించారు కానీ.. కాన్సెప్ట్ కొత్తగా ఉండాలి అని ఆలోచించలేదు. 100 కోట్ల రేంజ్ ఉన్న కథకి 500 కోట్ల వసూళ్లు ఆశించడం కూడా అత్యాశే అవుతుంది. జనాలు ఈవెంట్ ఫిలిమ్స్ తప్ప మిగిలిన సినిమాలు చూడడం లేదా అంటే చూస్తున్నారు.. కానీ వాటి రేంజ్, రీచ్ తక్కువ. సో గేమ్ ఛేంజర్ చిత్ర పరాజయానికి ప్రధాన కారణం రాంచరణ్, శంకర్ ఇలాంటి కథని ఎంచుకోవడమే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.