రామోజీరావు కు తుది నివాళులు అర్పించటానికి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
ఫిల్మ్‌సిటీలోని రామోజీరావు స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై స్మృతివనానికి చేరుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాడెను మోశారు.

ntr, ramojirao
రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (Ramojirao) అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతి వనంలో అంత్యక్రియలు నిర్వహించారు. రామోజీరావు కుమారుడు కిరణ్ (Ch kiran) అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. రామోజీరావుకి (Ramojirao Final journey) కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. తెదేపా అధినేత చంద్రబాబు రామోజీరావు పాడెను మోశారు. పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించగా అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
మీడియా మొఘల్, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (87) శనివారం (జూన్ 8) ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. . గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన హైదారాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఉదయం 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో మీడియా, సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల ప్రముఖ రాజకీయ వేత్తలు, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. ఓ మీడియా దిగ్గజానికి ప్రభుత్వం ఇలా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించటం దేశంలో ఇదే తొలిసారి.ఇక ఈ దిగ్గజ నటుడు రామోజీరావు మరణవార్త విని యావత్ తెలుగు ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. దిగ్గజ వ్యక్తికి తుది నివాళులు అర్పించేందుకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అంతిమ నివాళులు అర్పించటానికి రాకపోవటం అంతటా హాట్ టాపిక్ గా మారింది.
అందుకు కారణం రామోజీరావు నిర్మించిన సినిమా ఎన్టీఆర్ హీరోగా పరిచయం కావటమే. "నిన్ను చూడాలని" అనే సినిమాతో తారక్‌ను రామోజీ రావు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. దాంతో ఎన్టీఆర్ ఖచ్చితంగా రామోజీరావు కు తుది నివాళులు అర్పించటానికి వస్తారని అందరూ భావించారు. కానీ కొన్ని తప్పనిసరి పరిస్దితుల్లో కేవలం ఓ ట్వీట్ వేసి నివాళి అర్పించి ఊరుకోవాల్సి వచ్చింది ఎన్టీఆర్.
NTR Birth anniversary
కారణం జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. గోవాలోని మారుమూల ప్రాంతంలో షూటింగ్ జరుగుతుండడంతో రామోజీరావు అంత్యక్రియలకు ఆయనతో పాటు దేవర టీం కూడా హాజరుకాలేకపోయారు. తాజా షెడ్యూల్ జూన్ 3న ప్రారంభమైంది, ఎన్టీఆర్ జూన్ 5న షూట్‌లో జాయిన్ అయ్యాడు, అందుకే హైదరాబాద్‌కి రాలేకపోయాడు.
గోవా షెడ్యూల్ చాలా ఖర్చుతో కూడుకుని ఉంది. తాను షూటింగ్ కాన్సిల్ చేసుకుని వస్తే చాలా మంది ఇబ్బంది పడతారు. డబ్బు కూడా వృదా అవుతుంది. దాంతో వేరే దారిలేక ఎన్టీఆర్ ఆగిపోయారని తెలుస్తోంది. ఈ నేపధ్యంల ో రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది: జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.
ఎన్టీఆర్ తన ట్వీట్ లో ...రామోజీ రావుగారి లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
actor junior ntr new movie with director prashanth neel
నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ట్వీట్ చేస్తూ... రామోజీ రావుగారు భారతీయ మీడియా మరియు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడుతాయి. ఆయన ఆత్మకు శాంతి చేగూర్చాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అన్నారు.
నందమూరి రామకృష్ణ (Ramakrishna) ట్వీట్ చేస్తూ... ఈనాడు గ్రూప్ / మార్గదర్శి సంస్థల అధినేత రామోజీ రావుగారి ఆకస్మిత మరణం మనందరికీ తీరనిలోటు. వారు తండ్రిసమానులు. ఒక రైతు కుటుంబములో జన్మించి వ్యవసాయంలో వారి తండ్రుకి చేదోడుగా ఉంటూ కష్టపడి చదువుకున్నారు రామోజీ రావు గారు. అన్ని రంగాల్లో వారు వారి సేవలందించారు. ఇటు ప్రెస్ మీడియా/జర్నలిజం లీడరే కాకుండా….మార్గదర్శి చిట్స్ / ఫైనాన్స్ చైర్మన్ గాను… సినీ నిర్మాతగా, సినీ స్టూడియో అధినేతగా… వివిధ రంగాల్లోనూ చాలామందికి ఉద్యోగాలు కల్పించి అందరిని ఆదుకున్నారు రామోజీ రావు గారు. వారెక్కడున్న వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ… మా కుటుంబం తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము అన్నారు.