‘జై బాలయ్య’ అని ఎందుకంటారో వివరించిన బోయపాటి శ్రీను
పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్లి అడుగు.. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది ” అనగానే.. “జై బాలయ్య..” అంటూ వాయిస్ వస్తుంది.
Balakrishna
జై.. బాలయ్య స్లోగన్ ఎంత ఫేమస్ అనేది చెప్పక్కర్లేదు. ఆ స్లోగన్ వినగానే అభిమానుల్లో ఆనందం టన్నుల కొద్దీ బయటకు తన్నుకుని వస్తుంది.సమయం సందర్భం లేకుండా కూడా అభిమానులు ఈ స్లోగన్ ని విచ్చలవిడిగా వాడేస్తుంటారు. చివరకు జై బాలయ్య అనే పాటను సమయం సందర్భం సంబంధం లేకున్నా సరే వీర సింహా రెడ్డి సినిమాలో పెట్టుకున్నారు. వీర సింహా రెడ్డి సినిమాలో బాలయ్య పేరు ఏంటి? ఆ పాటలో ఉన్న పేరు ఏంటి? అనేది కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. జై బాలయ్య అనే పాటను పెట్టేశారు.
వీరసింహారెడ్డి సినిమాల్లో .. ” పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్లి అడుగు.. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది ” అనగానే.. “జై బాలయ్య..” అంటూ వాయిస్ వస్తుంది. గతంలో డైరెక్టర్ రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లిలో ఎన్టీఆర్ జై బాలయ్య అంటూ స్లోగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇలా జై బాలయ్య అని ఎందుకంటారు అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. దానికి బోయపాటి శ్రీను సమాధానం ఇచ్చారు.
Balakrishna
ప్రముఖ నటుడు బాలకృష్ణ నట ప్రస్థానానికి ఈ ఏడాదితో 50 ఏళ్లు. ఈ సందర్భంగా సెప్టెంబరు 1న హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించనున్నారు. బుధవారం కర్టెన్ రైజర్ ఈవెంట్ (NBK 50 Years Curtain Raiser Event) ఏర్పాటు చేశారు. బోయపాటి శ్రీను, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా బోయపాటి శ్రీను మాట్లాడారు. ఆయన ఈ ప్రశ్నకు స్టేజిపైనే సమాధానం ఇచ్చారు.
Actor Balakrishna
బోయపాటి శ్రీను మాట్లాడుతూ..గతంలో దర్శకులు కోదండ రామిరెడ్డి గారు ఓ సారి బాలయ్య ని ఇదే ప్రశ్న అడిగితే ఆయన నవ్వేసి ఊరుకున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే...పేరు బాగుందని జై బాలయ్య అనట్లేదు, దాని వెనుక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ కోసమే అందరూ జై బాలయ్య అంటుంటారని దర్శకుడు బోయపాటి శ్రీను (Director Boyapati Srinu) అన్నారు.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ కాంబో అంటే అందరికీ ఆసక్తి. అలాగే బోయపాటి సైతం బాలయ్యతో కాకుండా వేరే హీరోతో సినిమా చేస్తే వర్కవుట్ కావటం లేదు. ఈ నేపధ్యంలో ఈ కాంబినేషన్ కు మళ్లీ రంగం సిద్దమైందని సమాచారం.