- Home
- Entertainment
- Ravi Teja: విష్ణువిశాల్ మూవీతో రవితేజ తమిళ ఎంట్రీ.. అదిరిపోయే యాక్షన్ సీన్స్.. ఏ పాత్రలో దుమ్ము లేపనున్నాడంటే?
Ravi Teja: విష్ణువిశాల్ మూవీతో రవితేజ తమిళ ఎంట్రీ.. అదిరిపోయే యాక్షన్ సీన్స్.. ఏ పాత్రలో దుమ్ము లేపనున్నాడంటే?
మాస్ మహారాజా రవితేజ తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. యంగ్ హీరో విష్ణు విశాల్ అప్ కమింగ్ బిగ్ యాక్షన్ మూవీలో రవితేజ నటించనున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పవర్ ఫుల్ రోల్ లో దుమ్ములేపనున్నట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ (Ravi Teja) వరుస సినిమాల్లో నిర్విరామంగా నటిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇటీవల ‘ఖిలాడీ’ Khiladi చిత్రంతో ఆడియెన్స్ లో జోష్ నింపాడు. ఈ చిత్రం తన ఫ్యాన్స్ ను, ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది.
ఖిలాడీ మంచి రెస్పాన్స్ ను అందుకోవడంతో.. అదే ఊపుతో మిగిలిన సినిమాలను కూడా నిర్విరామంగా షూటింగ్ లో పాల్గొంటూ పూర్తి చేసుందుుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ‘రామరావు ఆన్ డ్యూటీ’ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. తర్వలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ధమాఖా, రావణాసుర, టైగర్ నాగేశ్వర్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
అంతేకాకుండా, రవితేజ తమిళ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) చిత్రంలో నటిస్తున్నట్టుగా సమాచారం. గతేడాది విష్ణు విశాల్ ‘ఎఫ్ఐఆర్’ అనే చిత్రంతో ప్రేక్షకులకు అలరించాడు.
పోయినేడు నుంచే రవితేజ, విష్ణు విశాల్ తో సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది రిలీజ్ అయిన FIR చిత్రం కూడా రవితేజ సమర్పణలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ మూవీ కూడా ఆడియెన్స్ నుంచి మంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
ప్రస్తుతం విష్ణు విశాల్ తన అప్ కమింగ్ ఫిల్మ్ వీవీ18 (vv18)లో నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ లో రవితేజ కూడా నటిస్తున్నట్టు కన్ఫామ్ అయ్యింది. రాబోయే చిత్రంలో రవితేజ పాత్ర సెకండాఫ్ లో వస్తుందని టాక్ వినిపిస్తోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో రవితేజ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.
మరోవైపు, హీరోకు అన్నపాత్ర అని కూడా చెప్తున్నారు. ఏదేమైనా విష్ణు విశాల్ నెక్ట్స్ మూవీలో మాత్రం రవితేజ నటిస్తుండటం మాత్రం కన్ఫామ్ అయ్యింది. ఈ మేరకు హీరో విష్ణు విశాల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ రోజు వీవీ18కి సంబంధించిన టైటిల్, ఇతర వివరాలను వెల్లడించనున్నట్టు సూచించారు.