‘మిస్టర్ బచ్చన్’ థియేట్రికల్ బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్
ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ప్రీమియర్స్ ఆగస్టు 14న ప్రదర్శించనున్నారు.
హీరో రవితేజ (Ravi Teja) స్పెషాలిటీ ఏమిటంటే..ఎన్ని ప్లాఫ్ లు వచ్చినా ఓపినింగ్స్ కు లోటు ఉండదు. బిజినెస్ అయితే ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. అందుకు తగినట్లుగా తనకు కలిసొచ్చిన డైరక్టర్ తో జతకడితే ఇంక చెప్పేదేముంది. ఫ్యాన్స్ కే కాదు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కు పండగే. అలా తనకు గతంలో మిరపకాయ వంటి సూపర్ హిట్ ఇచ్చిన
డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ప్రీమియర్స్ ఆగస్టు 14న ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఏ మేరకు జరిగి ఉండవచ్చు అనే విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
మొదట ఈ సినిమా అక్టోబర్‌లో విడుదల చేద్దామని తొలుత చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే పుష్ప 2 చిత్రం విడుదల వాయిదా పడిన నేపథ్యంలో మిస్టర్ బచ్చన్‌ను అనుకున్న తేదీ కంటే ముందుగానే తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 15 లాంగ్ వీకెండ్ ఎడ్వాంటేజ్ ఉండటంతో సినిమా కలెక్షన్స్ కు బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. దానికి తోడు నీట్ గా ప్రమోషన్స్ చేస్తూండటంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
హిందీలో అజయ్ దేవగన్ హీరోగా చేసిన రైడ్ సినిమాకు రీమేక్ ఇది. ఇన్కమ్ టాక్స్ రైడ్ నేపధ్యంలో జరిగే కథ ఇది. అయితే ఈ సినిమాను రీమేక్ లా కాకుండా హరీష్ శంకర్ ఈ కథకు తనదైన స్టయిల్లో మాస్ టచ్ ఇచ్చారని తాజాగా వచ్చిన షో రీల్ చూస్తుంటే క్లారిటీ వస్తుంది. ఈ సినిమాలో మంచి మాస్ టచ్ వుందని, రైడ్ స్క్రిప్టుని పూర్తి మాస్ అప్పీలింగ్ తో తయారు చేసారని చెప్తున్నారు. రీమేకులు చేయడంలో కూడా హరీష్ శంకర్ కి సెపరేట్ స్టయిల్ వుంది. రైడ్ తో పోలిక రాకుండా మిస్టర్ బచ్చన్ కి ట్రీట్మెంట్ చేశారాయన.
Mr. Bachchan
ఇక యాక్షన్ అధిక ప్రాధాన్య చిత్రమిది. బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ అభిమాని అయిన రవితేజ ఈ సినిమాలోనూ ఆయన ఫ్యాన్‌గా కనిపించనున్నారని సమాచారం. నిజాయతీ గల ఆదాయపన్ను అధికారిగా కనిపించనున్నట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ఆ అధికారి ఓ రాజకీయ నాయకుడి ఇంటికి రైడ్‌కు వెళ్లాక ఏం జరిగిందన్నది కథాంశం. ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ 40 కోట్లు దాకా జరిగిందని వినికిడి. అంటే ఓ రేంజిలో బిజినెస్ జరిగినట్లే. ఓటిటి, హిందీ యూట్యూబ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కలిపితే పూర్తి లాభాల్లో రిలీజ్ కు ముందే వెళ్లినట్లు అర్దమవుతోంది.
ఇక హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది వరకు వచ్చిన షాక్, మిరపకాయ్ ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. క్యాడ్‌బరీ యాడ్‌తో క్రేజ్ సంపాదించుకున్న భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. జగపతి బాబు విలన్ పాత్ర పోషించారు. .