MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సొంత అన్నతో సంబంధం అంటగట్టారు.. వాళ్ళ వల్ల నిద్రలేని రాత్రులు గడిపా: సీనియర్ హీరోయిన్

సొంత అన్నతో సంబంధం అంటగట్టారు.. వాళ్ళ వల్ల నిద్రలేని రాత్రులు గడిపా: సీనియర్ హీరోయిన్

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. తెలుగులో కూడా ఆమె నాలుగైదు చిత్రాల్లో నటించారు. ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి చిత్రాల్లో రవీనా టాండన్ మెరిశారు.

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
| Updated : Jan 05 2022, 08:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. తెలుగులో కూడా ఆమె నాలుగైదు చిత్రాల్లో నటించారు. ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి చిత్రాల్లో రవీనా టాండన్ మెరిశారు. ప్రస్తుతం రవీనా వయసు 47 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఆమె చెక్కు చెదరని గ్లామర్ తో మతిపోగొడుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సినిమా అనేది రంగుల ప్రపంచం. ప్రతి నటుడికి, నటికి ఏదో ఒక సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా కష్టాలు అనుభవించిన నటులు ఎంతో మంది ఉన్నారు. తాను కూడా నటించే రోజుల్లో ఎన్నో అవమానాలు, నిద్రలేని రాత్రులు ఎదుర్కొన్నట్లు రవీనా టాండన్ పేర్కొన్నారు. 

36

ఇప్పట్లో సినీ తరాల ఎఫైర్ వార్తలు కామన్ అయిపోయాయి. కానీ గతంలో అలా కాదు హీరోయిన్ ఎఫైర్ గురించి వార్తలు వస్తే.. ఆ హీరోయిన్ తో పాటు ఆమె ఫ్యామిలీ కూడా సఫర్ అయ్యేది. అలాంటి అవమానాలే తనకు ఎదురైనట్లు రవీనా టాండన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 

46

మేము మీడియాని చూస్తేనే భయపడే వాళ్ళం. ఎలాంటి పుకార్లు పుకార్లు పుట్టిస్తారో అని భయపడుతూ గడిపేవాళ్ళం. నేను నా కోస్టార్ట్స్ తో స్నేహంగా మెలిగేదాన్ని. అది మీడియాకు నచ్చేది కాదేమో. వెంటనే పుకార్లు పుట్టిస్తూ ఎవరెవరికో నాతో సంబంధం అంటగట్టేవారు. దీనివల్ల నాతో పాటు మా ఫ్యామిలీ కూడా నిద్రలేని రాత్రులు గడిపాము. 

56

నిద్ర పోవాలంటే ఏడ్చేదాన్ని అని రవీనా టాండన్ పేర్కొన్నారు. ఒకసారి నా సొంత అన్నతో కూడా సంబంధం అంటగట్టారు. రవీనాని కారులో డ్రాప్ చేసిన ఆ అందమైన అబ్బాయే ఆమె బాయ్ ఫ్రెండ్ అని వార్తలు రాశారు. అసలు అలా ఎలా రాస్తారు అంటూ రవీనా మండిపడింది. ఆ వార్తలకు నేను కుంగిపోయినట్లు రవీనా తెలిపింది. అలా తన కెరీర్ లో ఎదుర్కొన్న అవమానాల గురించి రవీనా ఇంటర్వ్యూలో నెమరు వేసుకుంది. 

66

రవీనా టాండన్ భర్త అనిల్ తడానీ బాలీవుడ్ లో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు. అనిల్ తడానీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు మంచి సన్నిహితుడు. అనిల్ ఇటీవల ముగిసిన రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా హాజరైన సంగతి తెలిసిందే. Also Read: విరబూసిన రోజాలా ఆమె అందం.. ఈషా రెబ్బా స్టన్నింగ్ లుక్స్, చూపు తిప్పుకోవడం అంత ఈజీ కాదు

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth Nagothi: ఎవరీ శ్రీకాంత్ నాగోతి? కలర్స్ స్వాతి ప్రేమలో ఎలా పడ్డాడు? రెండో పెళ్లికి కారణం ఏంటి?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: జ్యోతో షర్ట్ ఉతికించిన సూరజ్-కాంచన సంతోషం-సుమిత్ర కోసం తండ్రి హోమం
Recommended image3
Prabhas: 200 కోట్ల రాజభవనంలో ప్రభాస్ పెళ్లి జరగబోతోందా? కాబోయే భార్యకు రెబల్ స్టార్ సర్ ప్రైజ్ ? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved