MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • రష్మిక , విజయ్ దేవరకొండ రహస్య వివాహం ఎందుకు ? పెళ్లికి రాబోయే అతిథులు ఎవరో తెలుసా?

రష్మిక , విజయ్ దేవరకొండ రహస్య వివాహం ఎందుకు ? పెళ్లికి రాబోయే అతిథులు ఎవరో తెలుసా?

నేషనల్ క్రష్ రష్మిక పెళ్లికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఫిబ్రవరి 26న రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి ఫిక్స్ అయిందని, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఈ జంట ఏడడుగులు వేయబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 03 2026, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
మొదలైన విజయ్ ‌  రష్మిక పెళ్లి ఏర్పాట్లు..!
Image Credit : Rashmika Mandanna/Instagram, Vijay Devarakonda/Instagram

మొదలైన విజయ్ ‌- రష్మిక పెళ్లి ఏర్పాట్లు..!

టాలీవుడ్ స్టార్ జంట.. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోబోతున్నరన్న విషయం వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. కానీ ఈ స్టార్ జంట పెళ్లికి ఉదయ్‌పూర్ ప్యాలెస్ ఇప్పటినుంచే సిద్ధమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

 ఆ వీడియోలో ఇద్దరు యువతులు తాము రష్మిక, విజయ్ పెళ్లి జరగబోయే ప్రదేశంలో ఉన్నామని, పెళ్లి ఏర్పాట్లు చాలా గ్రాండ్‌గా జరుగుతున్నాయని చెప్పారు. అంతేకాదు, ఏర్పాట్లు జరుగుతున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు.విజయ్, రష్మికల పెళ్లి రాజస్థాన్‌లోని ప్యాలెస్‌ల నగరమైన ఉదయ్‌పూర్‌లోని సిటీ ప్యాలెస్‌లో జరుగుతుందని వీడియోలోని యువతులు చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అభిమానులను కన్ఫ్యూజన్లో పెడుతున్నారా?
Image Credit : instagram

అభిమానులను కన్ఫ్యూజన్లో పెడుతున్నారా?

ఈ నెల 26న విజయ్ రష్మిక పెళ్లి జరుగుతుందంటే.. మరి ఇప్పుడు పెళ్లికోసం స్టేజ్ ను ఎలా డెకరేట్ చేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈక్రమంలో పెళ్లికి ప్యాలెస్ సిద్ధమవుతున్న వైరల్ వీడియో చూసి, ఈరోజే రహస్యంగా రష్మిక - విజయ్ పెళ్లి జరుగుతోందా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి తమ ఎంగేజ్‌మెంట్‌ను కూడా రష్మిక, విజయ్ దేవరకొండ ఇలాగే రహస్యంగా చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లిని కూడా అంతే సైలెంట్‌గా చేసుకుంటున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. 

రెండు రోజుల క్రితమే నటి రష్మిక మందన్న ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. అప్పుడు పాపరాజీలు ‘పెళ్లికి పిలవరా?’ అని నేరుగా అడిగారు. దానికి తెలివిగా సమాధానమిచ్చి తప్పించుకున్న రష్మిక, ‘ఎవరి పెళ్లి?’ అని అడిగారు. మళ్లీ పెళ్లి గురించే అడిగినప్పుడు వెంటనే మాటను సినిమా వైపు మళ్లించారు.

36
ఆంధ్రా అబ్బాయి.. కొడగు అమ్మాయి..రాజస్థాన్‌లో పెళ్లి..!
Image Credit : X/GeethaArts

ఆంధ్రా అబ్బాయి.. కొడగు అమ్మాయి..రాజస్థాన్‌లో పెళ్లి..!

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కుటుంబాలు రాజస్థాన్‌లోని ప్యాలెస్ హోటల్‌లో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాయని తెలుస్తోంది. కోటల నగరమైన రాజస్థాన్‌లో చాలా ప్యాలెస్‌లు ఉన్నాయి. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌ను హోటల్‌గా మార్చారు. అక్కడ ఈవెంట్స్ నిర్వహించడానికి అద్దెకు ఇస్తారు. ఈ ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లోనే ఎంతో మంది సెలబ్రిటీల పెళ్లిల్లు జరిగాయి. 

ఈక్రమంలో రష్మిక, విజయ్ పెళ్లి కూడా జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇక రష్మిక మందన్న కన్నడ అమ్మాయి.. మడికేరి వాసి. కొడవ కుటుంబానికి చెందిన ఆమె సొంత ఇల్లు ఇప్పటికీ విరాజ్‌పేటలో ఉంది. ఇక దేవరకొండ కుటుంబానికి చెందిన హైదరాబాద్‌ కుర్రాడు విజయ్ దేవరకొండ. అలా వధూవరులిద్దరి సొంత ఊర్లు వదిలి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారు.

46
రహస్య వివాహాని కారణం ఏంటి?
Image Credit : Asianet News

రహస్య వివాహాని కారణం ఏంటి?

విజయ్ రష్మిక రహస్యంగా పెళ్లి చేసుకోడానికి కారణం ఏంటో క్లియర్ గా తెలియదు. కానీ వారి ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఇలా చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. గత అక్టోబర్ 3న రష్మిక, విజయ్ దేవరకొండ నిశ్చితార్థం కూడా రహస్యంగానే హైదరాబాద్‌లో జరిగింది. ఇరు కుటుంబాలు, సన్నిహితులు మాత్రమే దేవరకొండ ఇంట్లో జరిగిన నిశ్చితార్థంలో పాల్గొన్నారు. ఇప్పటివరకు ఎంగేజ్‌మెంట్ విషయాన్ని ఇద్దరూ రహస్యంగానే ఉంచారు. పెళ్లి విషయాన్ని కూడా బయటపెట్టలేదు. కానీ ఎంత రహస్యంగా ఏర్పాట్లు చేసినా, పెళ్లి ఏర్పాట్ల విషయం మాత్రం తెగ వైరల్ అవుతోంది.

56
పెళ్లి ఎలా ఉండబోతోంది? ఎవరికి ఆహ్వానం?
Image Credit : Rashmika Mandanna/Instagram, Vijay Devarakonda/Instagram

పెళ్లి ఎలా ఉండబోతోంది? ఎవరికి ఆహ్వానం?

సినిమా ప్రపంచంలో ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తోంది. అదే డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రెండ్. అనుష్క శర్మ-విరాట్, దీపికా పదుకొణె-రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా, కియారా అద్వానీ సహా చాలా మంది నటీనటులు డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాల్లోని ప్రసిద్ధ ప్రదేశాలకు వెళ్లి కేవలం సన్నిహితులను మాత్రమే ఆహ్వానించి పెళ్లి చేసుకోవడం. 

ఇదే పద్ధతిని నటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఫాలో అవుతున్నారు. ప్యాలెస్‌లో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్‌కు సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం ఉంటుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ దిగ్గజాలు పెళ్లిలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్, చిరంజీవి, సమంత, తరుణ్ భాస్కర్, పూరీ జగన్నాథ్ లాంటి స్టార్స్ ఈ పెళ్లికి హాజరు అయ్యే అవకాశం కనిపిస్తోంది.

66
విజయ్ - రష్మిక కొత్త సినిమాపై భారీ అంచనాలు..
Image Credit : Asianet News

విజయ్ - రష్మిక కొత్త సినిమాపై భారీ అంచనాలు..

రష్మిక మొదట నటిగా అడుగుపెట్టింది శాండల్‌వుడ్‌లో. కానీ ప్రస్తుతం కన్నడ పరిశ్రమతో రష్మిక బంధం అంతంత మాత్రమే. రక్షిత్‌తో ఎంగేజ్మెంట్ బ్రేకప్ అయ్యాక రిషబ్ శెట్టితో సహా ఎవరితోనూ రష్మికకు మంచి సంబంధాలు లేవు. కాబట్టి శాండల్‌వుడ్‌లో ఎవరెవరికి పెళ్లి పిలుపు వస్తుందో తెలియదు. 

ఇక రష్మిక, విజయ్ దేవరకొండ ఒకవైపు పెళ్లి సంబరాల్లో ఉంటే, మరోవైపు వారి ఇంకో సినిమా పనులు ఫాస్ట్ గా జరుగుతున్నాయి. గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో విజయ్, రష్మిక కలిసి నటించారు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా ‘రణబలి’ చిత్రంలో స్టార్ కపుల్ మళ్లీ కలిసి నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘రణబలి’ సినిమాను నిర్మిస్తోంది. 

ఇందులో రియల్ లైఫ్ జంట మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఇది పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో రానుంది. విజయ్ దేవరకొండ ‘రణబలి’ అనే పాత్ర చేస్తుంటే, రష్మిక మందన్న ‘జయమ్మ’ అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టైటిల్ టీజర్ చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
అల్లు అర్జున్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Related Stories
Recommended image1
రామ్ చరణ్ తన వారసుడికి ఏం పేరు పెట్టబోతున్నాడో తెలుసా? మెగా కిడ్ కోసం అభిమానుల ఎదురుచూపులు..
Recommended image2
జబర్దస్త్ లో 10 లక్షలు తీసుకున్న ఫస్ట్ కమెడియర్ ఎవరు? సుడిగాలి సుధీర్, హైపర్ ఆది కూడా ఆయన తరువాతే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved