Rashmika Mandanna : వాలెంటైన్స్ డే రోజు రష్మిక కష్టాలు చూశారా? ఏం చేసిందంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) వాలెంటైన్స్ డే సందర్భంగా పెట్టిన పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఆ విషయాన్ని అబద్దమని చెప్పేందుకు ఇలా తిప్పలు పడింది.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న వాలెంటెడైన్స్ డే Valentines Day 2024 సందర్బంగా తను పెట్టిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఫ్యాన్స్, నెటిజన్లు స్పెషల్ ఏంటంటూ అడుగుతున్నారు.
ఈ క్రమంలో రష్మిక మందన్న తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది. తన ఇన్ స్టా హ్యాండిల్ ద్వారా ఓ వీడియోను పంచుకుంటూ తన అభిమానులు, ప్రేమికులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపింది.
ఈ సందర్భంగా తను నేరుగా చెప్పకుండా తన నీడతో భావాలను పలికిస్తూ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఈ వీడియో ద్వారా రష్మిక చేసిన ఆసక్తికరంగా మారింది.
అయితే ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో రష్మిక వీడియోలను, ఫొటోలను తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండనే తీస్తున్నారంటూ ప్రచారం జరిగింది. పైగా ఇవ్వాళ వాలెంటైన్స్ డే కావడంతో తన పక్కన ఎవరు లేరంటూ చెప్పేందుకు ఇలా తన నీడతో కనిపించింది.
అయినా నెటిజన్లు స్పందించే తీరు మరోలా ఉంది.. కాగా విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నకు ఫిబ్రవరిలో నిశ్చితార్థం అంటూ ఇప్పటికే ప్రచారం జరిగింది. కానీ వాటిని విజయ్ టీమ్ ఖండించింది.
‘పుష్ప’ చిత్రంతో నేషనల్ క్రష్ గా మారిన రష్మిక మందన్న ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గానే ‘యానిమల్’తో బాలీవుడ్ లో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. నెక్ట్స్ ‘పుష్ప2’తో రాబోతోంది. అలాగే మరిన్ని చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి.