8 సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్న రష్మిక మందన్న
బాక్సాపీస్ ను షేక్ చేయనుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఈ బ్యూటీ దాదాపు 8 సినిమాలతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేయబోతోంది. రష్మిక అప్ కమింగ్ సినిమాలు గురించి ఇప్పుడు చూద్దాం.

బాక్సాపీస్ ను షేక్ చేయనున్న రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. అంతే కాదు చేసిన సినిమాలన్నీ సక్సెస్ బాటపట్టడంతో తిరుగులేని ఇమేజ్ ను సాధిస్తోంది. ప్రస్తుతం రష్మిక చేతిలో 8 సినిమాలకుపైగా ఉన్నాయి. ఈ సినిమాల సక్సెస్ అయితే బాక్సాఫీస్ మహారాణిగా రష్మిక పేరు నిలిచిపోనుంది. ఇక రష్మిక వరుసగా సందడి చేయబోతున్న సినిమాల గురించి తెలుసుకుందాం.
రష్మికకు జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన సినిమాలు పుష్ప, పుష్ప2. అల్లు అర్జున్ జంటగా రష్మి పుష్ప3 లో నటించబోతోంది. దర్శకుడు సుకుమార్, నిర్మాత రవిశంకర్ 'పుష్ప 3: ది ర్యాంపేజ్' సినిమాను కొన్ని నెలల క్రితం ప్రకటించారు. మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమాకు సబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ 2026లో స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2027లో ఈసినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. పస్తుతం బన్నీ అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు.
రష్మిక మందన్న యాక్షన్ సీక్వెన్స్
రష్మిక మందన్న తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా ఉన్న సినిమాలో నటిస్తోంది. ఇంత వరకూ తాను టచ్ చేయని హారర్ జానర్ లో మూవీ చేస్తోంది. రష్మిక నటిస్తోన్న అప్‌కమింగ్ హారర్ ఫిల్మ్ ‘తామా’. ఈ సినిమాతో హాట్ టాపిక్ గా నిలిచింది రష్మిక. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరో. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కానుంది. మరి రష్మిక ఈసినిమాలో ఎలా కనిపించబోతోందో చూడాలి.
భయపెట్టబోతోన్న శ్రీవల్లి
తన అభిమానులను అలరించడమే కాదు భయపెట్టడం కూడా తెలుసు అని నిరూపించబోతోంది రష్మిక మందన్న. క్యూట్ లుక్స్ తో నేషనల్ క్రషక్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. భయంకరమైన రూపంలో కనిపించబోతున్న సినిమా ‘మైసా’. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈసినిమా నుంచి రీసెంట్ గా రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అది చాలా భయానకంగా ఉంది. ఈ సినిమాను 2026లో విడుదల చేయనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందిన మైసాతో రష్మిక ఏం చేయబోతుందో చూడాలి.
రష్మిక హవా
రష్మిక మందన్న నటిస్తోన్న అప్‌కమింగ్ ఫిల్మ్ 'ది గర్ల్‌ఫ్రెండ్' ఈ ఏడాదే విడుదల కానుంది.రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ రొమాంటిక్ డ్రామాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రష్మికతో పాటు ధీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు, సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
తెలుగు, తమిళంలో
రష్మిక మందన్న నటిస్తోన్న మరో సినిమా 'రెయిన్‌బో'. ఇది ఒక రొమాంటిక్ ఫాంటసీ సినిమా. తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది మూవీ. ఈ సినిమాకు శాంతరుబన్ దర్శకుడు. ఈ సినిమా 2026లో విడుదల కావచ్చు. శాకుంతలం సినిమాలో సమంత జంటగా నటించిన మలయాళ యంగ్ స్టార్ దేవ్ మోహన్ ఈసినిమాలో హీరోగా నటిస్తున్నారు.
యానిమల్ సీక్వెల్ ఎప్పుడు?
బాలీవుడ్ లో హిట్ సినిమా సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' సీక్వెల్ 'యానిమల్ పార్క్'తో వస్తున్నారు. రష్మిక మందన్న, రణబీర్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించే ఈ సినిమా షూటింగ్ 2026లో మొదలవ్వొచ్చు. ఈ సినిమా 2027లో విడుదల అవుతుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన యానిమల్ సినిమా బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా రచ్చ రచ్చ చేసింది. ఈసినిమాతో రష్మిక మరోసారి బాక్సాఫీన్ ను షేక్ చేయనుంది.
సౌత్ లో తిరుగులేని ఇమేజ్
సౌత్ లో సత్తా చాటుతోన్న రష్మిక మందన్న బాలీవుడ్ లో కూడా బ్లాస్ట్ అవ్వబోతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఛావా, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన రష్మికకు హిందీ అవకాశాలు భారీగా వస్తున్నాయి. స్టార్ హీరోల చూపు రష్మిక పైనే ఉంది. దాంతో అక్కడ సెలెక్టీవ్ గా వెళ్తోంది బ్యూటీ. ప్రస్తుతం ఉత్తరాదిన 'కాక్‌టెయిల్' సీక్వెల్‌లో ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైందని సమాచారం. ఈ ఏడాది చివరికల్లా చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ చేయాలని టీమ్ చూస్తోందట. ఇక 2026 చివరి నాటికి కాక్ టెయిల్ మూవీ సీక్వెల్ విడుదల కావచ్చు.
అల్లు అర్జున్ తో కలిసి
ఇక ఇప్పటికే పుష్ప రెండు సినిమాలలో అల్లు అర్జున్ తో కలిసి రచ్చ రచ్చ చేసింది రష్మిక మందన్న. పుష్ప3 లో కూడా నటించబోతోంది. ఈలోపు మరో సూపర్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో నటిస్తోన్న పాన్ వరల్డ్ మూవీ AA22xA6లో కూడా నటించబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, దీపికా పదుకొణె కూడా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఈ సినిమా 2027లో విడుదల రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక 800 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈసినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. 2000 కోట్లు కలెక్షన్లు దాటి, బాక్సాఫీస్ ను దడదడలాడించే ప్లాన్ లో ఉన్నారు టీమ్.