40 దాటిన నాజూగ్గా ఉన్న హీరోయిన్లు, ఏం తింటార్రా బాబు అంటున్న ఫ్యాన్స్
హీరోల మాట పక్కన పెడితే 40 ఏళ్లు దాటితే హీరోయిన్లు ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అవుతుంటారు. కాని ప్రజెంట్ జనరేషన్ లో అలా కాదు. 40 ఏళ్లు దాటి 50 కి దగ్గర పడుతున్నా నాజూగ్గా మెయింటేన్ చేస్తున్న తారలు ఎవరో తెలుసా?

40 దాటిన నాజూగ్గా
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు కెరీర్ 35 నుంచే పడిపోతూ వస్తుంది. గతంలో 40 ఏళ్లు దాటితే హీరోయిన్ గా కెరీర్ ముగిసిపోయేది. ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాల్సిందే. కాని ఇప్పుడు ఆ పరిస్తితి లేదు. 50 ఏళ్ళకు దగ్గరపడుతున్నా కానీ. .హీరోయిన్లుగా రాణిస్తున్నారు. బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా హీరోయిన్లు ఏజ్ బార్ అవుతున్నా ఫామ్ ను కొనసాగిస్తున్నారు. అలాంటివారిలో నాయనతారను బెస్ట్ ఎక్జాంపుల్ గా చెప్పవచ్చు. 40 ఏళ్ల వయస్సులో కూడా హీరోయిన్ గా రాణించడమే కాదు, భారీ గా రెమ్యునరేషన్ కూడా తీసుకుంటోంది నయనతార. ప్రస్తుతం సౌత్ లో సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది నయనతార.
హీరోయిన్ గా రీ ఎంట్రీ
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 40 దాటిన తరువాత హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఏకైక నటి త్రిష. కెరీర్ అయిపోయింది అనుకుంటున్న టైమ్ లో విజయ్ సరసన నటించి మరోసారి హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది త్రిష. పొన్నియన్ సెల్వన్ సినిమాతో త్రిష డిమాండ్ మరింతగా పెరిగిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది బ్యూటీ. తెలుగలో మెగాస్టార్ చిరంజీవి జంటగా విశ్వంభర సినిమాలో నటిస్తోంది. 42 ఏళ్ల వయసులో ఇప్పటికీ జీరో సైజ్ ను మెయింటేన్ చేస్తూ, అభిమానులను అలరిస్తోంది.
ఫిట్ నెస్ కాపాడుకుంటున్నారు
40 ఏళ్లకు రెండు అడుగులు దూరంలో ఉంది సమంత. ఫిట్ నెస్ అంటే ఆమెకు ప్రాణం. ఇప్పటికీ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఆరోగ్యం సహకరించకపోయినా ఫిట్ నెస్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు. 38 ఏళ్ల సమంత ఇటు టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో సత్తా చాటుతోంది. నిర్మాతగా, బిజినెస్ విమెన్ గా అదరగొడుతోంది. 40 ఏళ్లు వచ్చిన మరో హీరోయిన్ కాజల్ అగర్వాల్, పెళ్లై, ఓ పాప ఉన్నా సరే ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. సీనియర్ హీరోల సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది బ్యూటీ. బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాలో సందడి చేసింది కాజల్.
ట్రెండ్ మారిపోతోంది
ఇక 39 ఏళ్ల వయస్సులో కూడా నాజూగ్గా ఉన్న మరో హీరోయిన్ శృతీ హాసన్. కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం సీరియర్ హీరోల జంటగా మెరుస్తోంది బ్యూటీ. ఫిట్ నెస్ కు ఎప్పుడూ ఇంపార్టెన్స్ ఇచ్చే శృతీ హాసన్ 40 ఏళ్లకు అడుగు దూరంలో ఉంది. అయినా హీరోయిన్ గా సత్తా చాటుతోంది. మరోవైపు 40 ఏళ్లు దాటి, ఓ బిడ్డకు జన్మినిచ్చిన శ్రియా కూడా ఫిట్నెస్, గ్లామర్ విషయంలో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ రోల్స్ కు మారిన శ్రీయా.. గ్లామర్ విషయంలో మాత్రంతగ్గేది లేదంటోంది.
50 ఏళ్లు దాటిన తగ్గేది లేదంటున్నారు
ఫిట్నెస్, ఫ్యాషన్ విషయంలో అందరికంటే ముందుంటుంది మలైకా అరోరా. 51 ఏళ్ల ఈ సీనియర్ బ్యూటీ.. కుర్రహీరోయిన్లకు పోటీ ఇస్తోంది. యోగా సెంటర్‌ను నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో ఫిట్నెస్ పాఠాలు చెబుతోంది. 51 ఏళ్ళ వయస్సులో ఐశ్వర్యా రాయ్ కూడా తన గ్లామర్ ను కాపాడుకుంటూ వస్తోంది. కళ్లు తిప్పుకోలేని అందంతో మోస్మరైజ్ చేస్తోంది మాజీ విశ్వసుందరి.
జీరో సైజ్ తో రచ్చ
బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో టబు, శిల్పాశెట్టి లాంటి వారు ఉన్నారు. టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది. 53 ఏళ్ల వయస్సులో అందాన్ని కాపాడుకుంటూ యంగ్ స్టార్స్ కు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక మరో హీరోయిన్ శిల్పా శెట్టి కూడా అంతే, 50 ఏళ్ల వయస్సులో జీరోన సైజ్ మెయింటేన్ చేస్తోంది శిల్పా శెట్టి. ప్రస్తుతం సినిమాలు మానేసి శిల్పా బిజినెస్ చూసుకుంటోంది. ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది ఈ హీరోయిన్, అందుకే ఇంట్లోనే పూర్తిస్థాయి జిమ్‌ను ఏర్పాటు చేసుకుంది. జిమ్‌తో పాటు 50 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే యోగాసనాలతో అలరిస్తోంది.
వయసును తగ్గించుకుంటున్నారు
జిమ్, యోగా , డైట్ టిప్స్ తో హీరోయిన్లు తమ వయసును తగ్గించుకుంటున్నారు. బాలీవుడ్ తో పాటు సౌత్ హీరోయిన్లు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోను సత్తా చాటిన హీరోయిన్ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం మహేష్ బాబు జోడీగా రాజమౌళి పాన్ వరల్డ్ మూవీలో నటిస్తోంది. 43 ఏళ్లు వచ్చినా ఫిట్ నెస్ విషయంలో ఏమాత్రం తగ్గేది లేదంటోంది ప్రియాంక చోప్రా. ఇక 39 ఏళ్ల వయస్సులో దీపికా పదుకొనే, 38 ఏళ్ల శ్రద్దా కపూర్ లాంటి హీరోయిన్లు కూడా సక్సెస్ ఫుల్ గా తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఇకమిస్ యూనివర్స్, సీనియర్ నటి సుస్మితా సేన్ 49 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్‌లో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. కపుల్ యోగా చేస్తూ అదరగొడుతోంది.