- Home
- Entertainment
- 3 కోట్లతో మొదలు పెట్టి 3000 కోట్లతో లెక్కలు మార్చేసిన హీరోయిన్.. ఇప్పుడు పాన్ ఇండియాలో ఆమె నెంబర్ 1
3 కోట్లతో మొదలు పెట్టి 3000 కోట్లతో లెక్కలు మార్చేసిన హీరోయిన్.. ఇప్పుడు పాన్ ఇండియాలో ఆమె నెంబర్ 1
పాన్ ఇండియా స్థాయిలో రాణించే సౌత్ హీరోలని చూస్తున్నాం. సౌత్ నుంచి హీరోయిన్లు కూడా పాన్ ఇండియా స్థాయిలో కదం తొక్కుతున్నారు. నయనతార, సమంత లాంటి హీరోయిన్లకు బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. అయితే ఒక క్రేజీ బ్యూటీ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రూల్ చేస్తోంది.

పాన్ ఇండియా స్థాయిలో రాణించే సౌత్ హీరోలని చూస్తున్నాం. సౌత్ నుంచి హీరోయిన్లు కూడా పాన్ ఇండియా స్థాయిలో కదం తొక్కుతున్నారు. నయనతార, సమంత లాంటి హీరోయిన్లకు బాలీవుడ్ లో కూడా క్రేజ్ ఉంది. బాలీవుడ్ నుంచి వచ్చిన జాన్వీ కపూర్ ఇప్పుడిప్పుడే సౌత్ లో పాగా వేస్తోంది. అయితే ఒక క్రేజీ బ్యూటీ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రూల్ చేస్తోంది.
ట్రేడ్ పండితులు ఆమె ప్రస్తుతం ఇండియాలో నంబర్ 1 హీరోయిన్ అని అభివర్ణిస్తున్నారు. ఆమె ఎవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక మందన. రష్మిక ఈ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకోవడానికి కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ మాత్రమే అందుకు కారణం కాదు. పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో 2000 కోట్ల బిజినెస్ చేసి మైండ్ బ్లోయింగ్ విక్టరీ అందుకుంది. కేవలం థియేటర్ బిజినెస్ మాత్రమే 2000 కోట్లు. శాటిలైట్, డిజిటల్ రైడ్స్ చూసుకుంటే ఆ లెక్క ఇంకా ఎక్కువ ఉంటుంది.
Rashmika Mansanna
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 120 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతున్న కుబేర చిత్రంలో కూడా రష్మిక నటిస్తోంది. ఇది కూడా పాన్ ఇండియా చిత్రమే. అదే విధంగా విక్కీ కౌశల్ సరసన ఛావా అనే చారిత్రాత్మక చిత్రంలో మహారాణి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర బడ్జెట్ 150 కోట్లు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కి రెడీ అవుతోంది. సల్మాన్ ఖాన్ సరసన సికిందర్ అనే చిత్రంలో రష్మిక నటిస్తోంది. ఈ మూవీ బడ్జెట్ ఏకంగా 400 కోట్లు. మరికొన్ని చిత్రాలకు కూడా రష్మిక సైన్ చేస్తోంది. ఈ చిత్రాల బిజినెస్ లెక్కలు చూసుకుంటే గత కొన్ని నెలల్లోనే ఆమె చిత్రాల బిజినెస్ 3000 కోట్లు దాటిపోయింది.
రష్మిక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఛలో చిత్రంతో. ఆ చిత్ర బడ్జెట్ కేవలం 3 కోట్లు. 3 కోట్లతో ప్రారంభించిన హీరోయిన్ ఈ రోజు 3 వేల కోట్లతో ఇండియన్ బాక్సాఫీస్ ని రూల్ చేయడం రేర్ ఫీట్ అనే చెప్పాలి. రష్మిక ఈ స్థాయికి చేరుకోవడానికి ఆమె గ్లామర్, ప్రతిభ తో పాటు డెడికేషన్ కూడా ఒక కారణం. ఎంత బిజీగా ఉన్నా నిర్మాతలని ఇబ్బంది పెట్టేలా రష్మిక ప్రవర్తించలేదు.
Rashmika Mandanna
రష్మిక తన పాత్రలని ఎంచుకుంటున్న విధానం కూడా అదుర్స్ అనే చెప్పాలి. కేవలం 4 పాటలకు పరిమితం అయ్యే రోల్స్ కి రష్మిక ఫుల్ స్టాప్ పెట్టేసింది. పుష్ప 2లో ఆమె నటన, డ్యాన్స్, రొమాన్స్ ఇలా అన్ని విషయాల్లో ప్రశంసలు దక్కాయి. 2024 పుష్ప 2 తో గ్రాండ్ గా ముగించిన రష్మిక 2025లో క్రేజీ చిత్రాలతో అలరించబోతోంది. ఈ కారణాల వల్ల రష్మికని పాన్ ఇండియా స్థాయిలో నెంబర్ 1 హీరోయిన్ అంటూ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.