- Home
- Entertainment
- Rashmika: సమంత ఐటెమ్ సాంగ్‌పై రష్మిక షాకింగ్ కామెంట్.. వెంటనే మెసేజ్ పెట్టిందట.. దానికి సై?
Rashmika: సమంత ఐటెమ్ సాంగ్‌పై రష్మిక షాకింగ్ కామెంట్.. వెంటనే మెసేజ్ పెట్టిందట.. దానికి సై?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఓ షాకింగ్ కామెంట్ చేసింది. తాను కూడా సంచలనాలకు తెరలేపేందుకు రెడీ అవుతుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వెళ్లిన ఈ బ్యూటీ ఇప్పుడు సమంతని ఫాలో అవుతానంటోంది.

రష్మిక మందన్నా.. తాజాగా సమంతపై స్పందించింది. సామ్ చేసిన ఐటెమ్ సాంగ్ చూసి షాక్ అయ్యిందట. స్టార్ హీరోయిన్‌గా ఉండి సమంత ఈ ఐటెమ్ సాంగ్ చేయడం చూసి ఆశ్చర్యపోయానని, ఆమెకిది ఫస్ట్ ఐటెమ్‌సాంగ్ అని తెలిపింది. స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూ ఇలా స్పెషల్ సాంగ్ చేయడం గొప్ప విషయమని చెప్పింది రష్మిక.
సూపర్ స్టార్‌గా రాణిస్తూనే స్పెషల్ సాంగ్ చేయడం మామూలు విషయం కాదు. ఐటెమ్ సాంగ్‌లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ చూసి షాక్ అయ్యాను. సాంగ్ షూటింగ్ పూర్తి కాగానే ఆమెకి మెసేజ్ పెట్టాను. చాలా అద్భుతంగా చేశావని సందేశం పంపించాను. సినిమాలో ఈ సాంగ్ అదిరిపోయేలా ఉంటుంది` అని చెప్పింది రష్మిక.
మరి మీకు అవకాశం వస్తే చేస్తారా? అనే ప్రశ్నకి ఆమె స్పందిస్తూ, చేస్తానో లేదో తెలియదని చెప్పింది. అయితే ఇలాంటి మంచి ఐటెమ్ సాంగ్ వస్తే ఆలోచిస్తానని తెలిపింది. పరోక్షంగా తాను సిద్ధమే అనే విషయాన్ని వెల్లడించింది రష్మిక. అల్లు అర్జున్‌తో కలిసి ఆమె నటిస్తున్న `పుష్ప` చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో భాగంగా సోమవారం రష్మిక మీడియాతో ముచ్చటించింది.
ఈ సందర్భంగా రష్మిక సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. `పుష్ప` సినిమా గురించి బాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారని తెలిపింది. అంతేకాదు ఇందులో తాను శ్రీవల్లి అనే డీ గ్లామర్ పాత్రలో కనిపిస్తానని తెలిపింది. తన పాత్ర చాలా కన్నింగ్‌గా ఉంటుందని, కాకపోతే అది ఫన్నీ వేలో ఉంటుందని చెప్పింది.
బన్నీతో వర్క్ చేయడం ఆనందంగా ఉందని, ఒకప్పుడు ఆయనతో ఒక్కసీన్ లో కనిపించినా చాలు అనుకున్నానని, ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. బన్నీతో వంద సినిమాలైనా చేయడానికి రెడీ అని, ఆయన బెస్ట్ కోస్టార్ అని చెప్పింది రష్మిక. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న `పుష్ప` చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఇందులో ఆయన పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో సమంత ఐటెమ్ సాంగ్ చేసింది. `ఊ అంటవా.. ఉ ఉ అంటావా` అంటూ సాగే ఈ సాంగ్ ఇటీవల విడుదలై దుమ్మురేపుతుంది. ఇందులో సమంత గ్లామర్ లుక్‌లో బోల్డ్ గా కనిపిస్తూ షాకిస్తుంది. ఈ పాటకి సంబంధించిన చిన్న క్లిప్ విడుదల చేయగా, అది యూట్యూబ్‌ని, సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. దీనిపై పలు సంఘాలు కూడా కేసు నమోదు చేయడం గమనార్హం.