పొట్టి దుస్తుల్లో రష్మిక మందన్నా క్రేజీ వర్కౌట్స్.. ఆ యాంగిల్స్ చూస్తే కుర్రాళ్లకి పిచ్చెక్కిపోద్ది..
రెండుమూడు రోజులుగా ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న పేరు రష్మిక మందన్నా. ఆమె ఇప్పుడు మరో రూపంలో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. వర్కౌట్ వీడియోతో రచ్చ చేస్తుంది.
రష్మిక మందన్నా పేరు గత మూడు రోజులుగా ఇండియాని షేక్ చేస్తుంది. ఆమె ముఖంతో ఉన్న ఒక డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమె కోసం సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఫ్యాన్స్ సైతం స్పందిస్తూ ఆమెకి అండగా నిలిచారు. ఆమెకి సపోర్ట్ గా ముందుకు కదిలారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సైతం ఇనిషీయేట్ తీసుకుని డీజీపీకి కంప్లెయింట్ చేసింది. దీనిపై రష్మిక కూడా స్పందించి ధన్యవాదాలు తెలిపింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో రూపంలో రష్మిక మందన్నా సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఆమె వీడియో ట్రెండ్ అవుతుంది. వర్కౌట్ చేస్తున్న వీడియోని పంచుకుంది రష్మిక మందన్నా. ఇందులో ఆమె పొట్టి దుస్తులు ధరించి హాట్ వర్కౌట్స్ చేస్తుంది. టైట్ షాట్, టీషర్ట్ ధరించి హాట్ యాంగిల్స్ లో వర్కౌట్స్ చేస్తుంది. క్రేజీ ఎక్సర్‌సైజ్‌లతో అదరగొడుతుంది.
దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ వీడియో నెట్టింట వైరల్ అవుతూ, నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. అంతేకాదు కుర్రాళ్లకి పిచ్చెక్కించేలా ఈ వర్కౌట్ వీడియో ఉండటం విశేషం. ఇందులో రష్మిక చెబుతూ, మీరు మంచి వ్యాయామం చేసిన తర్వాత ఇది మంచి రోజు అని మీకు తెలుసు. జునైద్ షేక్ ఇవి నాకు ఈజీ చేయకూడదా? ఎప్పటిలాగే నన్ను చంపినందుకు ధన్యవాదాలు. నేను బలంగా తిరిగి వస్తాను, ఇంకా బలమైన రేపటికి శుభాకాంక్షలు` అని తెలిపింది రష్మిక.
తను ఫిజికల్‌గా మరింత బలంగా మారుతున్నట్టు ఆమె చెప్పింది. పరోక్షంగా ఇటీవల జరిగిన పరిణామాలపై రష్మిక రియాక్ట్ అయ్యిందని తెలుస్తుంది. తాను మరింత బలంగా తిరిగి వస్తానని చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆమెకి సపోర్ట్ గా నిలుస్తూ కామెంట్లు పెడుతున్నారు.
రష్మిక మందన్నా గ్లామర్ ప్రదర్శన విషయంలో ముందే ఉంటుంది. ఆమె ఆ మధ్య చేసిన ఫోటో షూట్లు, ఈవెంట్లలో కనిపించిన తీరు షాకిచ్చింది. విచిత్రమైన డ్రెస్‌లో అందాల విందు చేసింది. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేసింది. రష్మిక ఇంతగా బౌండరీలు బ్రేక్ చేసిందేంటి? అంటూ ఆశ్చర్యపోయారు.
కానీ తన రూట్‌లో తాను దూసుకుపోతుంది. ఎవరేమనుకున్నా తన గ్లామర్ స్టయిల్‌ని ఆవిష్కరిస్తూ మరింతగా అలరిస్తుంది. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్‌గా మారింది. కుర్రాళ్లకి గ్లామర్ ట్రీట్‌లా మారింది. ఆద్యంతం అలరిస్తుంది.
ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు భారీ చిత్రాల్లో భాగమైంది. బాలీవుడ్‌లో `యానిమల్` మూవీ చేస్తుంది. రణ్‌బీర్ కపూర్‌కి జోడీగా నటిస్తుంది. ఇది పాన్ ఇండియా లెవల్‌లో డిసెంబర్ 1న విడుదల కాబోతుంది. దీంతోపాటు `పుష్ప2`లో బన్నీకి జోడీగా చేస్తుంది. సుకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతుంది.