- Home
- Entertainment
- క్యూట్ లుక్‌లో రష్మిక క్రేజీ ముద్దు.. సోఫాలో కూర్చొని రెచ్చగొడుతున్న నేషనల్ క్రష్.. ఇంతటి విరహమా?
క్యూట్ లుక్‌లో రష్మిక క్రేజీ ముద్దు.. సోఫాలో కూర్చొని రెచ్చగొడుతున్న నేషనల్ క్రష్.. ఇంతటి విరహమా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. తీరిక లేకుండా గడుపుతుంది. సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తుంది. రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు, ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది రష్మిక.

రష్మిక మందన్నా వేగంగా ఎదిగిన కథానాయికల్లో ఒకరిగా రాణిస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతుంది. నేషనల్ క్రష్‌గా ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఓ వైపు అందాలతో, మరోవైపు చలాకీతనంతో ఆకట్టుకుంటుంది. ఆద్యంతం కట్టిపడేస్తుంది.
అయితే బాలీవుడ్ కి వెళ్లాక రష్మిక చాలా మారిపోయింది. ఆమె బోల్డ్ నెస్‌కి ప్రయారిటీ ఇస్తుంది. కానీ తాజాగా చాలా రోజుల తర్వాత ట్రెడిషనల్‌గా కనిపించింది. నిండు దుస్తుల్లో ఆకట్టుకుంటుంది. కానీ ఆమె ఇచ్చిన పోజు మాత్రం గిలిగింతలు పెడుతుంది. ఇందులో చిలిపి పోజులిస్తూ క్రేజీగా ముద్దు పెడుతుంది. విరహంతో కూడిన పోజులిస్తూ టెంప్ట్ చేస్తుందీ హాట్ హీరోయిన్.
వెకేషన్‌లో ఓ బోట్‌లో రష్మిక ఈ పోజ్ ఇవ్వడం విశేషం. దీంతో ప్రస్తుతం ఇది ఆకట్టుకుంటూ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, ఒంటరిగా విరహంతో తల్లడిల్లుతుంది రష్మిక అంటున్నారు. కానీ రష్మిక నయా ఫోటో మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.
దీంతోపాటు కొన్ని యాడ్స్ కోసం రష్మిక ఫోటో షూట్లు చేస్తుంది. ఆయా పిక్స్ కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో క్లీవేజ్ షోతో, కొంటె పోజులిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుందీ స్టార్ హీరోయిన్. తనదైన స్టయిల్ లుక్స్ తో కట్టిపడేస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది.
రష్మిక మందన్నా.. ఇటీవల కాలంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా క్రేజ్‌ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఎంతో కష్టపడితే, ఎన్నో స్ట్రగుల్స్ అయితే గానీ పెద్ద ఆఫర్లు రావు. కానీ రష్మిక మందన్నా మాత్రం వేగంగా దూసుకొచ్చింది. దాని వెనకాల ఆమె స్వయంకృషి, అందం, అభినయం ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి లక్ ఫ్యాక్టర్ కూడా కలిసొచ్చింది.
పాన్ ఇండియా హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ తెలుగులో మంచి విజయాలు అందుకుంది. `ఛలో`, `గీతగోవిందం`, `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` చిత్రాలు మంచి హిట్స్ ఇచ్చి, రష్మిక కెరీర్‌కి పెద్ద బూస్ట్ నిచ్చాయి. అవి ఆమె కెరీర్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. `పుష్ప` సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇందులోని శ్రీవల్లి పాత్రతో ఇంటర్నేషనల్ గుర్తింపుని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తుంది. మరోసారి శ్రీవల్లిగా రచ్చ చేసేందుకు వస్తుంది రష్మిక. బన్నీ హీరోగా, రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. దీంతోపాటు హిందీలో `యానిమల్` మూవీ చేస్తుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌కి జోడీగా చేస్తుంది. ఇది కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.
ఇలా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల వైపు మొగ్గు చూపుతుంది. ఆ మధ్య `రెయిన్‌బో` అనే మహిళా ప్రధాన చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఓ బలమైన కథతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇక డిసెంబర్ తర్వాత రష్మిక రచ్చ మరింతగా ఉండబోతుందని చెప్పొచ్చు. మరోవైపు నితిన్‌తో, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం నుంచి రష్మిక తప్పుకుందని సమాచారం.