వైరల్ అవుతున్న రష్మిక చీర ధర, అసిస్టెంట్ పెళ్ళికి కాస్ట్లీ చీరలో మెరిసిన కన్నడ భామ..
చీరలో హాట్ టాపిక్ అయ్యింది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా.చీరలో కూడా హాట్ గా కనిపించిన ఈ భామ.. తన అసిస్టెంట్ పెళ్ళిలో సందడి చేసింది. ఈ పెళ్లిలో ఆమె కట్టిన చీర కాస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
వరుస సినిమాలతో.. స్టార్ డమ్ సాధించి దూసుకుపోతోంది కన్నడ కస్తూరి రష్మిక మందన్నా. ప్రస్తుతం సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా.. ఇటు సౌత్ భాషలతో పాటు.. బాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్ అయ్యింది బ్యూటీ. స్టార్ హీరోల సరసన.. పాన్ ఇండియా మూవీస్ లో నటిస్తూ.. ఆ ఇమేజ్ ను ఎంజాయ్ చేస్తోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 సినిమా బిజీలో ఉంది రష్మిక. పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న రష్మిక.. పుష్ప2 సినిమాతో అంతకు మించి సాధించాలని చూస్తోంది. పుష్ప2 అనకున్నట్టే బ్లాక్ బస్టర్ అయి.. బన్నీకి గ్లోబల్ ఇమేజ్ వస్తే.. రష్మిక కెరీర్ భారీ టర్నింగ్ తీసుకునే అవకాశం ఉంది.
రష్మిక మందన్న తాజాగా తన అసిస్టెంట్ పెళ్లి వేడుకలలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే. హైదరాబాదులో జరిగిన తన అసిస్టెంట్ పెళ్లి వేడుకలలో భాగంగా ఈమె ఈ పెళ్లి వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇలా ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా రష్మిక ఆరెంజ్ కలర్ శారీ ధరించే చాలా స్టైలిష్ గా కనిపించారు. ఈ చిరకు చాలా ప్రత్యేకత ఉంది. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న ఈ చీర ధరమాత్రం చాలా ఎక్కువట. సింపుల్ గా ఉన్న ఈ చీరలో మాత్రం రష్మిక చాలా అందంగా కనిపించారు.
ప్రస్తుతం ఈ చీరలోని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ చీర ప్రముఖ డిజైనర్ అనితా డుంగ్రి డిజైన్ చేశారు. ఈ చీర ఖరీదు ఏకంగా 35 వేల రూపాయలు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న ఈ చీర రష్మిక పుట్టినరోజు సందర్భంగా తన అమ్మగారు తనకు కానుకగా ఇచ్చారట. ఖరీదు ఏకంగా 35వేల రూపాయలు అని తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఈమధ్య సెలబ్రిటీలు బ్రాండెడ్ బట్టలు, వస్తువులతో ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. చిరు, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్, మహేష్. ఇలా స్టార్స్ వాడే వస్తువుల ధరలు ఎప్పటికప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.