- Home
- Entertainment
- రష్మిక మందన్నకు మరో బంపర్ ఆఫర్.. తమిళ స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్.. ఇంతకీ ఏ చిత్రం?
రష్మిక మందన్నకు మరో బంపర్ ఆఫర్.. తమిళ స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్.. ఇంతకీ ఏ చిత్రం?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ను అనౌన్స్ చేస్తూ షాకిస్తోంది. నార్త్, సౌత్ మొత్తం తన గుప్పిట్లోకి తెచ్చుకుంటోంది. ఇప్పటికే తమిళంలో విజయ్ దళపతితో నటిస్తుండగా.. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకుందీ బ్యూటీ.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పుష్ఫ : ది రైజ్’లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున సరసన నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత రష్మిక రేంజ్ మరో స్థాయికి చేరుకుంది.
వరుసగా చిత్రాలను ప్రకటిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. మరీముఖ్యంగా ఈ బ్యూటీ క్రమక్రమంగా బాలీవుడ్ ను తన గుప్పిట్లోకి తెచ్చుకుంటోంది. నార్త్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. బాలీవుడ్ అగ్ర హీరోయిన్లకే మతిపోయేలా ఆఫర్లను అందుకుంటోంది. ఇప్పటికే హిందీలో ఈ బ్యూటీ నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నది.
కన్నడ, టాలీవుడ్, బాలీవుడ్ లో బడా హీరోల సరసన నటిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం కోలీవుడ్ పైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే దళపతి విజయ్ - వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న ‘వారసుడు’ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే. తాజాగా కోలీవుడ్ నుంచి ఈ బ్యూటీకి మరో బంపర్ ఆఫర్ తగిలినట్టు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. రష్మిక మందన్న వర్సటైల్ యాక్టర్, చియాన్ విక్రమ్ (Vikram) సరసన నటించే ఛాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. విక్రమ్ నటించిన ‘పొన్నియిన్ సెల్వన్ : పార్ట్ వన్’ ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉండగా.. ఇటీవలనే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
తమిళ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ 61వ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఇటీవలనే పూజాకార్యక్రమం కూడా గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ సినిమాలో విక్రమ్ కు జోడీగా రష్మిక మందన్న నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర యూనిట్ కూడా రష్మికనే తీసుకోవాలని గట్టి నిర్ణయించారని తెలుస్తోంది. త్వరలో అభిమానులను సర్ ప్రైజ్ చేస్తూ అనౌన్స్ మెంట్ కూడా రానుందంట.
కొంతకాలంగా రష్మిక మందన్న ఇండియన్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయయింది. చేతి నిండా ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తోంది. ఎక్కడా సమయం వేస్ట్ కాకుండా పక్కాగా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ.. ‘పుష్ఫ : ది రూల్, మిషన్ మజ్ను, గుడ్ బై, సీతా రామం, వారసుడు, యానిమల్’ చిత్రాల్లో నటిస్తోంది.