- Home
- Entertainment
- రష్మిక మందన్నా మంచి గర్ల్ ఫ్రెండ్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్.. భార్యాభర్తలు కలిసి మొత్తం బయటపెట్టారు
రష్మిక మందన్నా మంచి గర్ల్ ఫ్రెండ్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్.. భార్యాభర్తలు కలిసి మొత్తం బయటపెట్టారు
రష్మిక మందన్నా ఇటీవల విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమెని చిన్మయి, రాహుల్ రవీంద్రన్ టీజ్ చేశారు. ఓ రేంజ్‌లో ఆడుకున్నారు.

`ది గర్ల్ ఫ్రెండ్`తో రాబోతున్న రష్మిక మందన్నా
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా `థామా` సినిమాతో ఆడియెన్స్ ని అలరిస్తోంది. ఈ మూవీ తెలుగు ఆడియెన్స్ కి పెద్దగా కనెక్ట్ కాకపోయినా, నార్త్ ఆడియెన్స్ ని మెప్పించేలా ఉంది. అయితే మరో రెండు వారాల్లోనే ఇంకో సినిమాతో రాబోతుంది రష్మిక. ఆమె `ది గర్ల్ ఫ్రెండ్` అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ నవంబర్ 7న విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. రష్మిక మందన్నాతోపాటు రాహుల్ రవీంద్రన్, హీరో కౌశిక్ పాల్గొన్నారు. వీరిని రాహుల్ రవీంద్రన్ భార్య, సింగర్, డబింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఇంటర్వ్యూ చేసింది.
రష్మిక మందన్నా గుడ్ గర్ల్ ఫ్రెండ్
ఈ క్రమంలో వీరి మధ్య ఆసక్తికర కన్వర్జేషన్ నడిచింది. భార్యభర్తలు చిన్మయి, రాహుల్ రవీంద్రన్ కలిసి రష్మిక మందన్నాకి సంబంధించిన రహస్యాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాహుల్ రవీంద్రన్.. రష్మిక గుడ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం విశేషం. ఆమెకి చాలా మెచ్యూరిటీ ఉందని చెప్పాడు. ఇదే విషయాన్ని రష్మికని అడిగాడు రాహుల్. దీంతో నవ్వుతూ, అవును, నేను మంచి గర్ల్ ఫ్రెండ్‌ని అని చెప్పింది. చిన్మయి కూడా అవునా మంచి గర్ల్ ఫ్రెండా? అని అడిగింది. ఆ తర్వాత దాన్ని కవర్ చేస్తూ సినిమా పోస్టర్‌ని చూపించింది రష్మిక. దీంతో చిన్మయి కూడా ఆ అవును అది సినిమా అని తెలిపింది. రాహుల్‌ని కూడా నువ్వు సినిమా వదిలేసి దేని గురించి మాట్లాడుతున్నావంటూ, డైరెక్టర్ కొంచెం సినిమాపై ఫోకస్ చేయండి అంటూ కామెంట్ చేయడం విశేషం.
రష్మికకి ఈ దీపావళి చాలా స్పెషల్
అనంతరం చిన్మయి ఎటాక్ స్టార్ట్ చేసింది. రష్మిక గారు ఈ దీపావళి పండగ విషయంలో ఎలా ఎగ్జైట్ అవుతున్నారు అని అడగ్గా, నవ్వులు పూయించిన రష్మిక మందన్నా, నేను ఈ దీపావళికి చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నట్టు తెలిపింది. అయితే చిన్మయి అడిగిన విషయం రష్మికతోపాటు అందరికి అర్థమయ్యింది. అందుకే గట్టిగా నవ్వడం విశేషం. మళ్లీ దాన్ని కవర్ చేస్తూ `ఎందుకండీ ఈ దీపావళి గురించి ప్రత్యేకంగా అడుగుతున్నారు` అని రష్మిక రివర్స్ ప్రశ్న వేసింది. ఎందుకంటే ఈ దీపావళిని మీరు విజయోత్సవంగా సెలబ్రేట్ చేస్తారేమో అని చిన్మయి చెప్పగా, అన్ని దీపావళి అలానే ఉంటుందండీ అని కౌంటర్ ఇచ్చింది రష్మిక. దీంతో చిన్మయి తన బ్లెస్సింగ్స్ ఇచ్చింది.
విజయ్ దేవరకొండతో రష్మిక సీక్రెట్ ఎంగేజ్‌మెంట్
మొత్తంగా భార్యాభర్తలు రాహుల్ రవీంద్రన్, చిన్మయి కలిసి రష్మిక పర్సనల్ విషయాలను చెప్పకనే చెప్పేశారు. రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ చాలా కాలంగా లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే. `గీతా గోవిందం` నుంచి వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. చాలా సార్లు ఆ విషయాలను పరోక్షంగా హింట్ ఇస్తూ వస్తున్నారు. ఇద్దరు కలిసి వెకేషన్‌కి వెళ్లడం, పండగల సమయంలో విజయ్ ఇంట్లో రష్మిక సెలబ్రేట్ చేసుకోవడం చాలా సార్లు చూశాం. అంతేకాదు ఇటీవల ఈ ఇద్దరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. విజయ్ ఇంట్లోనే ఈ ఇద్దరు రింగులు మార్చుకున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. ఈ క్రమంలో రష్మికని చిన్మయి, రాహుల్ టీజ్ చేయడం విశేషం.
రష్మిక మరో హిట్ అందుకుంటుందా?
ఇదిలా ఉంటే రష్మిక మందన్నా ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. `ఛావా`తో బాక్సాఫీసుని షేక్ చేసింది. ఈ మూవీ ఎనిమిది వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఆ తర్వాత `కుబేర` చిత్రంతో అలరించింది. ఈ మూవీ డీసెంట్‌గానే ఆడింది. మధ్యలో `సికందర్` డిజప్పాయింట్ చేసింది. ఇప్పుడు `థామా`తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. మరోవైపు వచ్చే నెలలో `ది గర్ల్ ఫ్రెండ్`తో అలరించనుంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కింది. రాహుల్ రవీంద్రన్ దర్శక్వం వహించారు. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో చూడాలి.