MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • 8 నెలలు నేలపై పడుకున్న హీరో సుమన్‌.. తన కెరీర్‌లో బాగా కష్టపడ్డ మూవీ ఏంటో తెలుసా?

8 నెలలు నేలపై పడుకున్న హీరో సుమన్‌.. తన కెరీర్‌లో బాగా కష్టపడ్డ మూవీ ఏంటో తెలుసా?

హీరో సుమన్‌ కెరీర్‌ పరంగా ఎంతో స్ట్రగుల్‌ అయ్యారు. అయితే ఓ సినిమా కోసం అంతకు మించి కష్టపడాల్సి వచ్చిందట. 8 నెలలు నేలపైనే పడుకున్నాడట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 21 2025, 04:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సుమన్‌ కెరీర్‌ని తలక్రిందులు చేసిన ఒకే ఒక్క ఘటన
Image Credit : youtube/idream

సుమన్‌ కెరీర్‌ని తలక్రిందులు చేసిన ఒకే ఒక్క ఘటన

సుమన్‌ తెలుగు హీరోల్లో అందగాడిగా పేరుతెచ్చుకున్నారు. ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించారు. ఇంకా చెప్పాలంటే 1980లో ఏకంగా చిరంజీవికే పోటీ ఇచ్చాడు. యాక్షన్‌ సినిమాలతో మెప్పించాడు. తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. కానీ ఆయన్ని ఓ కేసు వెంటాడింది. దీంతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. నిర్దోశిగా బయటకు వచ్చినా ఆ ప్రభావం మాత్రం సుమన్‌ కెరీర్‌పై పడింది. మునుపటి క్రేజ్‌ లేదు, మునుపటి సక్సెస్‌ లేదు, సినిమాలు లేవు. దీంతో కొంత కాలం హీరోగా రాణించిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్స్ వైపుకి టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. అయినా సెకండ్‌ ఇన్నింగ్స్ లో కూడా దుమ్ములేపారు. అదిరిపోయే సినిమాలు చేశారు. `అన్నమయ్య`లో వేంకటేశ్వరస్వామిగా, `శివాజీ`లో విలన్‌గా సుమన్‌ పాత్రలు ఇప్పటికీ గుర్తిండిపోతాయి.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సుమన్‌ కెరీర్‌ని మార్చిన అన్నమయ్య
Image Credit : youtube/idream

సుమన్‌ కెరీర్‌ని మార్చిన అన్నమయ్య

సుమన్‌ తన కెరీర్‌లో ఓ సినిమా విషయంలో మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చిందట. ఏకంగా ఎనిమిది నెలలు నేలపైన పడుకోవాల్సి వచ్చిందట. ఆ విషయాలను సుమన్‌ స్వయంగా తెలిపారు. ఎంతో దీక్షతో ఆ మూవీ చేసినట్టు చెప్పారు. ఆ సినిమానే `అన్నమయ్య`. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో నాగార్జున హీరోగా నటించగా, సుమన్‌ వేంకటేశ్వర స్వామిగా కనిపించారు. ఈ మూవీలో నాగార్జున పాత్ర ఎంత గొప్పదో, సుమన్‌ పాత్ర కూడా అంతే గొప్పది. ఈ సినిమా పేరు చెబితే నాగ్‌తోపాటు సుమన్‌ కూడా గుర్తుకు వస్తారు. 1997లో విడుదలైన ఈ మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అప్పటి వరకు రొమాంటిక్‌, మాస్‌, కమర్షియల్‌ చిత్రాలు చేస్తూ వచ్చిన రాఘవేంద్రరావు తన రూట్‌ మార్చిన రూపొందించిన చిత్రమిది. ఆయనకు ఛేంజోవర్‌ మాత్రమే కాదు, అటు మన్మథుడు నాగార్జునకి కూడా పెద్ద ఛేంజోవర్‌ అని చెప్పొచ్చు. ఇద్దరూ తన కంఫర్ట్ జోన్‌ దాటి చేసిన చిత్రమిది. అంతే స్థాయిలో ఆదరణ పొందింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది.

34
8 నెలలు నేలపైనే పడుకున్న సుమన్‌
Image Credit : stockPhoto

8 నెలలు నేలపైనే పడుకున్న సుమన్‌

అయితే `అన్నమయ్య` సినిమా కోసం తాను ఎంతో కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు సుమన్‌. ఈ పాత్ర చేసే అవకాశం రావడం గొప్ప వరం అని తెలిపారు. ఆ దేవుడు తనని ఇన్నాళ్లు నానా రకాలుగా పరీక్షించి ఇలాంటి పాత్రని అందించారని, ఈ పాత్ర కోసమే తనని ఇలా తయారు చేశారేమో అని వెల్లడించారు సుమన్‌. అయితే `అన్నమయ్య` మూవీ కోసం చాలా కష్టపడినట్టు తెలిపారు. సినిమా షూటింగ్‌ జరిగినన్ని రోజులు చెప్పులు వేసుకోలేదట. ఉత్త కాళ్లతో నడిచినట్టు తెలిపారు. అలాగే ఎనిమిది నెలలు నేలపై పడుకున్నాడట. ఉదయం నాలుగు గంటలకు షూటింగ్‌లో పాల్గొన్నాడట. ఉదయాన్ని మేకప్‌ వేసుకుని షూటింగ్‌కి రెడీ అవ్వాల్సి వచ్చిందట. ఈ సినిమాని ఒక తపస్సులా చేయాల్సి వచ్చిందన్నారు సుమన్‌. ఆయనే కాదు దర్శకుడు రాఘవేంద్రరావు, హీరో నాగార్జున, ఇలా టీమ్‌ అందరు అలానే ఫీల్‌ అయ్యారని, ఎప్పుడూ ఆ భక్తి మూడ్‌లో ఉండేవారని, అలా చేశాం కాబట్టే సినిమా అంత బాగా వచ్చిందని, అంతటి పెద్ద విజయం సాధించిందని తెలిపారు సుమన్‌.

44
`అన్నమయ్య` సినిమా అవకాశం నా అదృష్టం
Image Credit : youtube/idream

`అన్నమయ్య` సినిమా అవకాశం నా అదృష్టం

ఈ మూవీ విడుదలయ్యాక పెద్ద హిట్‌ అయ్యిందని, ఆ మరుసటి రోజు అప్పటి రాష్ట్రపతి శంకర్‌ దాయల్‌ శర్మ పక్కన కూర్చొని సినిమా చూశామని, ఈ మూవీ తనకు రాష్ట్రపతి పక్కన కూర్చునే అవకాశం కల్పించిందని, ఇదంతా తనకు ఇన్నాళ్ల కష్టం ద్వారా సాధ్యమైందని, వెంకటేశ్వరుడి రూపం, ఆ కళ రావడానికి ఆ దేవుడు తనని రకరకాలుగా పరీక్షించాడని తెలిపారు సుమన్‌. ఇలాంటి పాత్ర చేసే అవకాశం రావడం మన అదృష్టమని, ఎవరికీ అలా రావు అని చెప్పారు. ఏదైనా దేవుడి బ్లెస్సింగ్స్ తో సాధ్యమవుతుందని, జీవితంలో ఏ విషయంలోనూ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని, కాలాన్ని బట్టి వెళ్తూనే ఉండాలని తెలిపారు సుమన్‌. ఐడ్రీమ్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
అల్లు అర్జున్‌ రీమేక్‌ చేయాలనుకున్న ఏకైక చిరంజీవి మూవీ ఏంటో తెలుసా? ప్రతి డైలాగ్‌ దించేశాడు
Recommended image2
`థామా` మూవీ రివ్యూ, రేటింగ్‌.. రష్మిక మందన్నా భయపెట్టిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved