- Home
- Entertainment
- ఇంత కంటే అర్థమయ్యేలా ఎలా చెప్పాలి.. విజయ్ దేవరకొండతో లవ్ మ్యాటర్‌పై మళ్లీ వార్తల్లో రష్మిక మందన్నా
ఇంత కంటే అర్థమయ్యేలా ఎలా చెప్పాలి.. విజయ్ దేవరకొండతో లవ్ మ్యాటర్‌పై మళ్లీ వార్తల్లో రష్మిక మందన్నా
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ ప్రస్తుతం ప్రేమలో ఉన్నారు. దాన్ని ఒప్పుకోకపోయినా అనేక విధాలుగా హింట్ ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి రష్మిక చేసిన పని చర్చనీయాంశం అవుతుంది.

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి `గీత గోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాల్లో నటించారు. అప్పట్నుంచి ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారని టాలీవుడ్ కోడై కూస్తుంది. అభిమానులు బహిరంగంగానే చెబుతున్నారు. దీనికితోడు తరచూ విజయ్ దేవరకొండ ఇంట్లో మెరుస్తుంది రష్మిక మందన్నా. అలాగే విదేశాల్లోనూ కలిసి తిరుగుతున్నారు. ఆ మధ్య మాల్డీవుల్లోనూ మెరిశారు. ఇద్దరు ఒకే ఫ్రేములో కనిపించకపోయినా ఒకే చోట ఉన్నామనే విషయాన్ని మాత్రం అందరికి తెలిసేలా చేస్తున్నారు.
ఈ విషయంలో రష్మిక మందన్నా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె ఎక్కువగా ఇలాంటి హింట్స్ ఇస్తుంది. ఇద్దరు దొరికిపోయేలా చేస్తుంది. అందుకే ఈ ఇద్దరి రిలేషన్ షిప్ తరచూ హాట్ టాపిక్ అవుతుంది. సోషల్ మీడియాలో డిస్కషన్ పాయింట్ అవుతుంది. అయితే విజయ్ తో లవ్ స్టోరీపై రష్మిక ఆచితూచి స్పందించింది. తాము మంచ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. తాము ప్రేమలో ఉన్నామనే విషయాన్ని మాత్రం కండించలేదు. ఎవరు ఎలా మాట్లాడుకున్నా ఓకే, కానీ పర్సనల్‌గా టార్గెట్ చేయోద్దని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో చెప్పకనే అసలు విషయం చెబుతుంది.
కానీ ఓపెనింగ్‌గా మాత్రం తమ ప్రేమతో దోబూచులాడుతుంది. తాజాగా మరోసారి తమ అనుబంధంపై హింట్ ఇచ్చింది. మహిళా దినోత్సవం సందర్భంగా రష్మిక మందన్నా ఓ ఫోటో పంచుకుంది. రాత్రి టైమ్‌లో పార్టీ మూడ్ సమయంలో వర్షం పడుతున్న వేళ గొడుకు పెట్టుకుని దిగిన ఓ ఫోటోని పంచుకుంది రష్మిక మందన్నారు. ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ, మహిళగా ఉండటం ఒక ఆశీర్వాదం అని చెప్పింది.
అయితే ఇందులో ఆమె పింక్ క్యాప్ ధరించి ఉంది. చలికాలంలో అలాంటి క్యాప్‌లు వాడతారు. ఆమె ఫోటోలో మిస్టేక్ ఏం లేదు, కానీ అలాంటి క్యాప్ ధరించి గతంలో ఓ ప్రెస్ మీట్‌లో విజయ్ దేవరకొండ కనిపించాడు. పింక్ క్యాప్, సేమ్ సింబల్ ఉంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. రష్మిక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయగానే, వెంటనే విజయ్ ఫోటోని వెతికి పట్టి పోస్ట్ చేస్తున్నారు కుర్రాళ్లు.
ఈ సందర్భంగా రష్మిక పరోక్షంగా ఓ సందేశం ఇస్తుంది. తాము ప్రేమలో ఉన్నామనే విషయాన్ని ఇంతకంటే బాగా అర్థమయ్యేలా ఎలా చెప్పాలనే విషయాన్ని నేషనల్ క్రష్ చెప్పకనే చెబుతుంది. నెటిజన్లు కూడా ఇదే కామెంట్ చేస్తున్నారు. తమ రిలేషన్‌కి సంబంధించిన వార్తలు సైలెంట్ అయిన ప్రతిసారి ఇలా ఏదో రూపంలో ఆమె సాంకేతాలు పంపుతూ డిస్కషన్ పాయింట్‌గా, వార్తల్లో వ్యక్తులుగా మార్చేస్తుంది. ప్రేమని మరింత బలంగా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది.
ప్రస్తుతం కూడా అదే చర్చ నడుస్తుంది. ఇటీవల హీరోయిన్లంతా ప్రేమని ప్రకటిస్తూ, పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరి రష్మిక, విజయ్‌లు తమ ప్రేమని ఎప్పుడు పెళ్లి వరకు తీసుకెళ్తారో చూడాలి. కానీ ఇటీవల ఈ ఇద్దరు మ్యారేజ్‌కి సంబంధించిన వార్తలు ప్రారంభమయ్యాయి. కానీ దాన్ని పరోక్షంగా తిప్పికొట్టారు.ఆనంద్ దేవరకొండ కూడా స్పందించి ఖండించారు.
Rashmika
ఇక ప్రస్తుతం రష్మిక మందన్నా `పుష్ప 2`, `ది గర్ల్ ఫ్రెండ్`, `రెయిన్‌బో`, `కుబేర` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ `ఫ్యామిలీ స్టార్`లో నటిస్తున్నాడు. నెక్ట్స్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయబోతున్నారు.