బాద్షాని రౌడీలతో బెదిరించిన రష్మిక.. ఫస్ట్ టైమ్‌ వీడియో సాంగ్‌లో.. దుమ్మురేపుతున్న `టాప్‌ టక్కర్‌` టీజర్‌

First Published Feb 9, 2021, 12:06 PM IST

టాలీవుడ్‌ క్రేజీ బ్యూటీ రష్మిక మందన్నా దూసుకుపోతుంది. ఫస్ట్ టైమ్ ఓ వీడియో సాంగ్‌లో మెరిసింది. హిందీలో టాప్‌ ర్యాప్‌ సింగర్‌ బాద్షాతో కలిసి హంగామా చేసింది. `టాప్‌ టక్కర్‌` అంటూ సాగే ఈ సాంగ్‌లో లేడీ డాన్‌ తరహా గెటప్‌లో దుమ్మురేపుతుంది. అయితే ఇందులో ఛాన్స్ కోసం రష్మిక రౌడీలతో బెదిరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సాంగ్‌ టీజర్‌ ట్రెండ్‌ అవుతుంది.